అనంతపురం

నగరాభివృద్ధికి జె.సి నిధులిచ్చారా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురంటౌన్, సెప్టెంబర్ 19: నగరాభివృద్ధికై రెండేళ్ల పాలనా కాలంలో ఎం.పి జె.సి.దివాకరరెడ్డి ఎం.పి ల్యాడ్స్ నుంచి ఒక్క రూపాయి నిధులను కూడా కార్పొరేషన్‌కు ఇచ్చిన పాపాన పోలేదని, ఆయనవి ఉత్తమాటలేనని మేయర్ స్వరూప ధ్వజమెత్తారు. సోమవారం మేయర్ ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందంటూ ఎంపి చేస్తున్న ఆరోపణలపై ఏ విచారణ జరిపినా వాస్తవం కాదని నిరూపించటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. శానిటేషన్‌లో రాష్టస్థ్రాయి అవార్డు పొందిన కమిషనర్ ఓబులేశు కమ్మ కులస్తుడైనంత మా త్రాన ఉండకూడదాయని అన్నారు. ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి సూచనలు, సలహాలతో అవార్డుగ్రహీత కమిషనర్ ఓబులేశు సారధ్యంలో నగరం అభివృద్ధి పథాన ముందుకు దూసుకెళుతుంటే చూసి ఓర్వలేక ఎం.పి జె.సి.దివాకరరెడ్డి స్థాయి మరచి కులం పేరుతో విమర్శలు చేయటం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి సలహాలు, సూచనలతో తాము అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజల మన్ననలు చూరగొంటున్నామని అన్నారు. రామ్‌నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు ఎం.పి దగ్గరి బంధువుకు రావటంతో ఆయన కౌన్సిల్ సమావేశానికి వచ్చి హడావిడి చేసి వెళ్ళారన్నారు. అంతేకాని ఏనాడూ ప్రజా సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు చేయటం మాని నిర్దిష్ట ఆధారాలు చూపాలని కోరారు. తిలక్‌నగర్ ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టినా యజమానులు కోర్టుకెళ్ళి స్టే తీసుకురావటంతో నిబంధనలకు కట్టుబడి పనులు నిలిపివేశామన్నారు. ఎన్‌టిఆర్ మార్గ్‌ను లక్షలాది రూపాయలు వ్యయం చేసి అభివృద్ధి చేయటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారన్నారు. అయితే రాత్రికిరాత్రి ఎం.పి అనుచరులు స్థానికులను రెచ్చగొట్టి రహదారికి అడ్డంకులు ఏర్పరిచారన్నారు. ఇప్పటికైనా స్థాయి మరచి ఆరోపణలు చేయటం మానుకోవాలన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు రాజారావు, రహమత్‌బీ, సరళ, రంగాచారి పాల్గొన్నారు.