అనంతపురం

ఈసారైనా ‘్భసార’ ఫలితాలు సకాలంలో అందేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 22 : ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశెనగ పంట తొలగింపు పూర్తి కానున్న నేపథ్యంలో అక్టోబర్ 1 నుంచి ఉచిత భూసార పరీక్షలు నిర్వహించేందుకు భూసార పరీక్ష కేంద్రం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈఏడాది డిసెంబర్ వరకూ 58వేల శ్యాంపిల్స్ (మట్టి నమూనాలు) పరీక్షించి ఇందుకు సంబంధించిన కార్డులు అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ నాటికి ఇందుకు సంబంధించిన ఫలితాల పత్రాల (సాయిల్ హెల్త్ కార్డ్స్)ను రైతులను అందజేయాల్సి ఉంది. ప్రభుత్వం భూసార పరీక్షలు ఉచితంగా నిర్వహించి రైతులకు ప్రత్యేకంగా సాయిల్ హెల్త్ కార్డులను అందజేస్తోంది. భూమి ఆరోగ్య పరిస్థితిని గుర్తించడం, తద్వారా భూసారం పెంపునకు రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాడాల్సిన ఎరువులు, రసాయనాలు, మందుల్ని సూచిస్తూ అధిక దిగుబడులను దోహద పడాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం అవసరమైన రైతులకు రూ.15 నామమాత్రపు రుసుంతో నెలకు కనీసం 500-600 మేరకు నమూనాలు పరీక్షించి ఫలితాల పత్రాలు అందిస్తున్నారు. ఒకటో తేదీ నుంచి నిర్వహించనున్న ఉచిత భూసార పరీక్ష నేపథ్యంలో రైతుల నుంచి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. దీంతో సకాలంలో పరీక్షల ఫలితాలు అందుతాయా? అనే సందేహం వారిలో నెలకొంది. గతేడాది భూసార పరీక్షలకు అవసరమైన రసాయనాల కొరతతో ఫలితాల వెల్లడి ఆలస్యమైంది. ఫలితంగా రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ ఏడాది డిమాండ్ అధికంగా పెరగనున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేకుంటే రైతుల నుంచి ఒత్తిడి పెరిగే పరిస్థితి నెలకొంటుంది. ఈ సందర్భంగా భూసార పరీక్ష కేంద్రం డిడి ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ రైతులకు అవసరమైన మేరకు భూసార పరీక్షలను వేగవంతంగా నిర్వహించి సకాలంలో ఫలితాలు అందజేస్తామన్నారు. ఈ ఏడాది భూసార పరీక్షకు సంబంధించి రసాయనాల కొరత లేదన్నారు.