అనంతపురం

రావతార్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, సెప్టెంబర్ 23:ఎస్‌ఎ.రావతార్ ఫ్యాక్టరీలో తొలగించిన 183 మంది కార్మికులను వెంటనే విధుల్లకి తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలోని పరిగి మండలంలో గల ఎస్‌ఎ.రావతార్ ఫ్యాక్టరీలో తొలగింపబడ్డ కార్మికులు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా శుక్రవారం సంఘీభావ సభ నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ అధ్యక్షతన జరిగిన సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి హరినాథరెడ్డి, వైకాపా ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి, నాయకులు శంకరనారాయణ, గుర్నాథరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోటా సత్యం, ఇతర వామపక్ష పార్టీలనేతలుహాజరయ్యారు. ఈసందర్భంగా మధు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా ఉందని, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ, బడా వ్యాపారుల కొమ్ముకాస్తోందన్నారు. ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఎమ్మెల్యేలు, జన్మభూమి కమిటీలు చెప్పినట్లు నడుచుకుంటున్నారన్నారు. జిల్లాలో రైతుల నుండి 10వేల 500 ఎకరాల భూమిని సేకరించారన్నారు. ఎన్‌పి కుంట సోలార్ ప్లాంట్ నడుస్తున్నా రైతులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షల 70వేల ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, వాటిని ఎంపి, ఎమ్మెల్యేలు, వ్యాపారులకు కట్టబెడుతోందన్నారు. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి భూమిలేదు కానీ, కోటీశ్వరులకు వందల, వేల ఎకరాలు కట్టబెడుతున్నారన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మరని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్దిచెబుతారని పేర్కొన్నారు.ఎస్‌ఎ.రావతార్ ఫ్యాక్టరీ కార్మికుల పోరాటం ఆగదని, సిపిఎం వారికి మద్దతుగా ఉంటుందన్నారు. కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకోవాలని, తొలగింపబడ్డ 183 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలన్నారు.
ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ కార్మిక చట్టాలను టిడిపి ప్రభుత్వం కాలరాస్తోందని, కార్మికులు చేస్తున్న పోరాటానికి తాము అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాలని పేర్కొన్నారు. కార్మికులకు మద్దతుగా దీక్ష చేస్తున్న సిఐటియు నాయకులకు తోడుగానిలుస్తామన్నారు. ఈకార్యక్రమంలో ఎస్‌యుసిఐ అమర్‌నాథ్, లలిత, సిపిఎం ఓబుళు, సిపిఐ రాజారెడ్డి, సిపిఐ ఎంఎల్ పెద్దన్న, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఇండ్ల ప్రభాకరరెడ్డి, ఆర్‌ఎస్‌పి బాషా, ఐఎన్‌టియుసి రమణ, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకులు కొర్రపాడు హుసేన్‌పీరా, ఆదిరానాయణ, సిఐటియు నాయకులు, రావతార్ ఫ్యాక్టరీ కార్మికులు పాల్గొన్నారు.