అనంతపురం

వడాముదం కాయలు తిని 10 మంది విద్యార్థులకు అశ్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, సెప్టెంబర్ 25 : నంబులపూలకుంట మండలం మనె్నంవారిపల్లిలో వడాముదం(ఎర్రి ఆముదం) కాయలు తిని పది మంది విద్యార్థులు అశ్వస్థతకు గురైన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు తాము వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల్లోకి వెళ్ళగా ఆదివారం సెలవు దినం కావడంతో తమ పిల్లలు నాగేంద్రకుమార్, గగన్ కుమార్, ఆంజనేయులు, సురేష్, వంశీకృష్ణ, రామయ్య, బాలాజి, భూమిక, మల్లీశ్వరి, కమలాకర్‌లు ఊరి మధ్యలో వున్న ఎర్రి ఆముదం కాయలు తిన్నారన్నారు. సాయంత్రం నుంచి పిల్లలకు విరోచనాలు, వాంతులు కావడంతో వారిని కదిరి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ , కదిరి ఆర్డీఓ వెంకటేశ్, తహశీల్దార్ రామకృష్ణారెడ్డి ప్రభుత్వాస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా వారిలో ఇద్దరు పరిస్థితి ఆందోళనకరంగా వుందని వైద్యులు తెలిపారు.

విద్యార్థి ఆత్మహత్య
పామిడి, సెప్టెంబర్ 25: స్థానిక ఎద్దులపల్లి రోడ్డులో నివాసముంటున్న విద్యార్థి పవన్‌కుమార్ (17) పామిడి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి.. అంగన్‌వాడీ కార్యకర్త నాగరత్న కుమారుడైన పవన్‌కుమార్ అనంతపురంలో మొదటి సంవత్సరం పాలిటెక్నిక్‌విద్యనభ్యశిస్తున్నాడు. సంఘటనా స్థలంలో రైలు పట్టాల మధ్యన పవన్‌కుమార్ మృతదేహం తల, ఎద భాగం పూర్తిగా ఛిద్రమైంది. గుత్తి జిఆర్‌పి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం పవన్ మృతదేహాన్ని తరలించారు.
రైలు ఢీకొని యువకుడి మృతి
గుంతకల్లు, సెప్టెంబర్ 25 : స్థానిక తిమ్మనచెర్ల రైల్వేస్టేషన్‌లో ఆదివారం గూడ్స్ రైలు ఢీకొని విజయ్(20) మృతి చెందాడు. గుంతకల్లుకు చెందిన విజయ్ గుత్తి నుంచి రైలు దిగి తిమ్మనచెర్ల స్టేషన్‌లో దిగాడు. స్టేషన్ నుంచి ఇంటికి బయలుదేరే క్రమంలో పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు గూడ్స్ రైలు ఢీకొంది. ఈ ఘటనలో విజయ్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జిఆర్‌పి పోలీసులు తెలిపారు.
ట్రాక్టర్ బోల్తా.. యువకుడి మృతి
తనకల్లు, సెప్టెంబర్ 25: మండల పరిధిలో బండివారిపల్లిలో ఆదివారం ట్రాక్టర్ బోల్తాపడి చంద్రమోహన్ (28) అనేవ్యక్తి మృతి చెందాడు. పొలీసుల కథనం మేరకు మృతుడు చంద్రమోహన్ ట్రాక్టరుతో పోలం దున్నుతుండగా ట్రాక్టరు ఆదుపుతప్పి బోల్తా పడినట్లు చెప్పారు. దీంతో డ్రైవింగ్ చేస్తున్న చంద్రమోహన్ ట్రాక్టరు కిందపడి అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, ఎడాది వయస్సుగల బాబు వున్నారు. ఎస్సై శ్రీనివాసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి
పుట్టపర్తి, సెప్టెంబర్ 25: పుట్టపర్తి సమీపంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పుట్టపర్తి సాయినగర్ సమీపంలో హంద్రీనీవా కాలువగట్టున హత్యకు గురైన శవం ఆచూకీ లభ్యమైంది. కాలువ పనుల నిమిత్తం జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇక్కడకు విచ్చేసినట్లు సమాచారం అన్నారు. వారిలో ఓ వ్యక్తిని మిగిలిన ఇద్దరు హత్య చేసి ఉండవచ్చునని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రమాదవశాత్తు చిన్నారి మృతి
యాడికి, సెప్టెంబర్ : మండల పరిధిలోని రాయలచెరువు మసీదువీధికి చెందిన షఫీవుల్లా కూతురు షహనాజు (7) ఆదివారం ప్రమాదవశాత్తు బండ పడి మృతి చెందింది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు షహనాజు ఇంటి సమీపంలో ఆడుకుంటూ ఏడు అడుగుల బండ వద్దకు వెళ్లింది. దీంతో బండపడి తీవ్రంగా గాయపడింది. గమణించిన బంధువులు 108 సాయంతో గుత్తి ప్రభత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.