అనంతపురం

కొడుకును చంపిన తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, సెప్టెంబర్ 30:పోలీస్‌శాఖలో రిటైర్డ్ అయిన ఓ ఎఎస్‌ఐ స్థాయి వ్యక్తి. చట్టం గురించి పూర్తిస్థాయిలో అవగాహన వున్న వ్యక్తి ఆయితే ఆయన తండ్రి స్థానాన్ని మరి చి, కన్నకొడుకునే అత్యంత పాశవికంగా బండరాయితో మోది హత్యచేశాడు. హత్యచేసిన అనంతరం ఇంటి నుండి పరారైనాడు. దీంతో శవాన్ని పోస్టుమార్టమ్ కోసం సర్వజన ఆసుపత్రికి చేర్చారు. కాని ఇక్కడ పోస్టుమార్టమ్ నిర్వహించడానికి కుటంబ సభ్యు లు సంతకం చేసేవారు లేక అనాథశవంగ మార్చురీలోనే వుంది. ఆ తండ్రి ఎందకు కుమారున్ని చంపాలనుకున్నాడు, అంతటి ఆవేధన కారణాలు నగరంలోని రుద్రంపేట చర్చికాలనీలో వుంటున్న రిటైర్డ్ ఎఎస్‌ఐ గిరన్నకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. కొడుకు సత్యేంద్రను చదవులో మేటిగా తీర్చిదిద్దాడు. డాక్టర్‌ను కూడా చేశారు. అనంతరం కుమారునికి హైదరాబాద్‌కు చె ందిన అమ్మాయితో వివాహం చేశారు. తన జీవితంలో ఏమి జరిగిందో ఏమో తెలియదు కాని మానసికంగా కుంగిపోవడం ఆరంభించాడు. ఒక విధంగా మానసిక పరిస్థితి విషమించడంతో అతని భార్య సైతం భరించలేక ఆరునెలల్లోనే విడాకులు తీసుకుని వెల్లిపోయింది. దీంతో మానసికంగా కుంగపోయిన సత్యేంధ్ర తన తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ వస్తున్నారు. మానసిక పరిస్థితి చేయిదాటిపోవడంతో తండ్రిని సైతం విపరీతంగా ఇబ్బందులకు గురిచేసేవాడు, తల్లి వున్నప్పటికి కొడుకు తీరును చూసి తట్టుకోలేక బెంగూళూరులో ఉంటున్న కూతురు, అలుడి దగ్గరు వెళ్లిపోయింది. గత మూడునెలలుగా సత్యేంధ్రను తన బంధువుల దగ్గరకు గిరన్న పంపాడు. మళ్లీ ఇరవైరోజుల క్రితమే నగరానికి వచ్చాడు. మానసిక పరిస్థితి సరిగాలేని మృతుడు సత్యేంధ్ర తన తండ్రితో నిత్యం గొడవపడుతూ వుండేవాడని తెలుస్తోంది. ఒక్కొక్కసారి అపస్మారక స్థితిలో దాడి చేసినట్లు సైతం తెలుస్తోంది. గురువారం రాత్రి తండ్రి, కొడుకు కలిసి ఇంట్లో పడుకున్నట్లు తెలుస్తోంది కాని అర్ధరాత్రి ఏమైందో తెలియదుకాని సత్యేంధ్ర ఇంటిముందు రక్తమడుగులో పడి ఉన్నాడు. రాత్రి ఇంట్లో వున్న తండ్రి తలుపులకు తాళం వేసి వెళ్ళటం బట్టి చూస్తే తండ్రే సత్యేంధ్రను హత్యచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు సత్యేంద్ర తండ్రికి ఫోన్ చేసినప్పటికి ప్రయోజనం లేకపోవడంతో పోలీసులు తండ్రే కుమారున్ని హత్యచేసి ఉంటారని బలంగా నమ్ముతున్నారు. ఈ సంఘటన నగరంలోని రుద్రంపేటలో కలకలం రేపింది.