అనంతపురం

చంద్రన్న బీమా.. కార్మికులకు ధీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, అక్టోబర్ 2: అసంఘటిత కార్మికుల జీవితాల్లో వెలుగులను నింపి వారిని అదుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా అసంఘటిత కార్మికుల్లో ధీమాను పెంచిందని రాష్ట్ర సమాచార, ఐటి, శాఖ మంత్రి పల్లె రఘనాథరెడ్డి, పౌర సరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత సంయుక్తంగా అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం స్థానిక మెడికల్ కాలేజి ఆడిటోరియంలో చంద్రన్న బీమా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘనాథరెడ్డి మాట్లాడుతూ అహింసా మార్గం ద్వారా దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చి కోట్లాదిమంది ప్రజలకు ఆరాధ్య దైవంగా జాతిపిత గాంధీ మహాత్ముడు పేరు తెచ్చుకొన్నారన్నారు. ఆసంఘటిత కార్మికులను ఆదుకోవాలని భావించి దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రన్న బీమా పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ప్రవేశపెట్టారన్నారు. మన జిల్లాలో ఇప్పటి వరకు 14.35 లక్షల మంది అసంఘటిత కార్మికులను ఇప్పటికే గుర్తించామని, ఇందులో ఇప్పటి దాకా 12.50 లక్షల మందికి చంద్రన్న బీమాలో చేర్పించడం జరిగిందన్నారు. ఈ పథకంలో చేరిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు, ప్రమాదం జరిగి పూర్తిగా వైకల్యం సంభవిస్తే రూ.3,62,500లు , సహజ మరణం అయితే రూ. 30 వేలు, ఇద్దరు పిల్లల వరకు ఉపకార వే తనం యేడాదికి రూ.1200లు చొప్పు న అందించడం జరుగుతుందన్నారు. ఇందులో సభ్యత్వం పొందేందుకు కేవలం రూ.15లు మాత్రమే చెల్లిస్తే, ప్ర భుత్వం రూ.135లు చెల్లించడం జరుగుతుందన్నారు. జిల్లాలో నేటి వరకూ 150 గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లను పూర్తిగా నిర్మించామన్నారు. కేంద్రం రూ.4వేలు, రాష్ట్రం వాటాగా రూ.11వేలు లబ్దిదారులకు అందించ టం జరుగుతుందన్నారు. 12 మున్సిపాలిటీల్లో 373 వార్డులలో వంద శాతం మరుగుదొడ్లను నిర్మించి ఆరుబయట మల విసర్జన రహితగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. దీనిని పురస్కరించుకొని 150కేజీల కేక్‌ను ప్రజలకు పంపిణీ చేశారు. ప్రజా సాధికార సర్వేలో భాగంగా జిల్లాలో వున్న 43, 02,502 మంది జనాభాకు ఇప్పటిదా కా 33,88,129 మందిని సర్వేచేసి 79 శాతంతో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా ప్రథమస్థానంలో వుందన్నారు. మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ సరిగ్గా మూడు ఏళ్ల క్రితం గాంధీ జయంతి రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మన జిల్లాలో పాదయాత్ర మెదలెట్టారన్నారు. ఇందులో చెప్పిన వాగ్ధానాలను నెరవేస్తున్నారన్నారు. మహాత్మాగాంధీ కలలు కన్న స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్రను దేశ ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుండి నడిపిస్తున్నారన్నారు. వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. సభాధ్యక్షులు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలని విజ్ఞప్తిచేశారు. కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ స్వచ్ఛంధ్రప్రదేశ్‌ను సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో విప్ యామినీ బాల, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనువంతరాయచౌదరి, మేయర్ స్వరూప, కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్-1 లక్ష్మికాంతం, జెసి-2 సయ్యద్ ఖాజామెహిద్దీన్, జడ్పీటిసి గంగాధర్ , డ్వామా పిడి నాగభూషణం, ఐకేపి పిడి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబిలేసు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్.ఇ హరిరాంనాయక్, కార్మిక శాఖ డిప్యూటీ అధికారి రేఖారాణి తదితర అధికారులు, అనధికారులు, ప్రజలు పాల్గొన్నారు.