అనంతపురం

రేపటి నుంచి పప్పుశెనగ విత్తనాల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, అక్టోబర్ 4 : జిల్లాలో రేపటి నుంచి పప్పుశెనగ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్ తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లరేగడి భూములున్న రైతులకు ఎకరాకు 25 కిలోలు, రెండెకరాలకు 50 కిలోలు, మూడెకరాలకు 75 కిలోలు, నాలుగు ఎకరాలకు 100 కిలోలు, ఐదెకరాలకు 125 కిలోల చొప్పున సబ్సిడీ ధరపై విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. క్వింటాల్ ధర రూ.9,866 కాగా, ప్రభుత్వ సబ్సిడీ రూ.3,946 మినహాయించి, మిగిలిన మొత్తాన్ని రైతులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం పట్టాదారు పాసుబుక్, ఆధార్ కార్డు, సెల్‌ఫోన్‌లు తీసుకుని రావాలని కోరారు. గతంలో వేరుశెనగ విత్తన పంపిణీలో అనుసరించిన బయోమెట్రిక్ విధానాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. రైతు సెల్‌ఫోన్‌కు వచ్చే పాస్‌వర్డ్‌ను విత్తన పంపిణీ కేంద్రంలో చూపితే అధికారులు విత్తనాలు ఇస్తారన్నారు. అంతేగాకుండా పాస్‌వర్డ్ వచ్చిన రోజే ఖచ్చితంగా విత్తనాలు తీసుకెళ్లాలన్నారు. ఇప్పటికే 25 వేల క్వింటాళ్లు విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని, మరో 25 వేల క్వింటాళ్లు సిద్ధం చేసుకుని ఉంచుకోవాలని జెడిఎను ఆదేశించారు. విత్తనాలతో పాటు విత్తన శుద్ధి కోసం టైకోడర్మా వెరడీ అనే మందు 500 గ్రాముల పాకెట్‌ను వంద రూపాయలకే రైతులకు అందిస్తారన్నారు. వ్యవసాయాధికారులు ముందస్తుగా విత్తనాలను టెస్ట్ చెక్ చేసుకోవాలన్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పంపిణీ కేంద్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సమావేశంలో జెడి ఎ శ్రీరామమూర్తి, డిపి ఒ మల్లీశ్వరీదేవి, డిఐఒ రామ్‌ప్రసాద్, డిఎంఅండ్‌హెచ్‌ఒ ప్రతినిధి డాక్టర్ విజయవల్లి, సి ఐ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ ఏడి, ఇతర అధికారులు పాల్గొన్నారు.