అనంతపురం

నీలకంఠాపురం శ్రీరామరెడ్డి ఆశయ సాధనకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, అక్టోబర్ 6 : నీలకంఠాపురం శ్రీరామరెడ్డి ఆశయ సాధనకు ప్రతి విద్యార్థి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కర్నాటక వ్యవసాయశాఖా మంత్రి కృష్ణ బైరేగౌడ్, డిసిసి అధ్యక్షులు కోటా సత్యంలుసూచించారు. గురువారం నీలకంఠాపురంలో ఎపిపిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీరామరెడ్డి 110వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కృష్ణ బైరేగౌడ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి
ఎదగాలన్నారు. రైతు సంక్షేమం కోసం శ్రీరామరెడ్డి చేసిన కృషి అభినందనీయమన్నారు. అతని నిరంతర శ్రమ, కార్యదీక్షతో ఉన్నత పదవులు అధిరోహించారన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజా సేవలో ముందుండాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీల్లో అమరాపురం మోడల్ స్కూల్ విద్యార్థులు విన్నర్లుగా, మడకశిర సిద్దార్థ పాఠశాలకు చెందిన విద్యార్థులు రన్నర్లుగా నిలిచారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. 2015-16 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో అధిక మార్కులు సాధించిన 77 మంది విద్యార్థులకు రూ.వెయ్యి నగదుతోపాటు సర్ట్ఫికెట్లు పంపిణీ చేశారు. అలాగే నీలకంఠాపురం పాఠశాలలో వందశాతం హాజరైన 12 మంది విద్యార్థులకు, పదో తరగతిలో అధిక మార్కులు సాధించిన 5 మందికి రూ. 43 వేలు నగదు బహుమతిని అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, కణ్వా అధినేత నంజుండయ్య, కెటి శ్రీ్ధర్, ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ జయరాం, చలువమూర్తి తదితరులు పాల్గొన్నారు.

పప్పుశెనగ పంపిణీ ప్రారంభం
* కొన్నిచోట్ల స్టాక్ లేక పర్మిట్లతో వెనుదిరిగిన రైతులు
* పలు కేంద్రాల్లో మెసేజ్‌లు రాక అవస్థలు

అనంతపురం, అక్టోబర్ 6 : జిల్లాలో ప్రభుత్వం సబ్సిడీపై అందించే పప్పుశెనగ విత్తనాల పంపిణీ గురువారం ప్రారంభమైంది. తొలిరోజు నిర్దేశించిన 27 మండలాల్లో 19 మండలాల్లో 5,890 క్వింటాళ్ల విత్తనాన్ని ఆధార్ అనుసంధానిత బయోమెట్రిక్ విధానం ద్వారా పంపిణీ చేశారు. జిల్లాకు తొలి విడతగా మొత్తం 50 వేల క్వింటాళ్ల విత్తనం కేటాయించారు. ఇందులో పంపిణీకి ముందుగానే ఆయిల్‌ఫెడ్, ఎపి సీడ్స్ ద్వారా జిల్లాకు చేరిన 25వేల క్వింటాళ్ల విత్తనాలను ఆయా మండలాల్లోని గోడౌన్లలో నిల్వ ఉంచారు. తొలిరోజు పంపిణీ పోగా ఇంకా 19వేల క్వింటాళ్లు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా పంపిణీని బట్టి గోడౌన్లు ఖాళీ అయ్యే కొద్దీ పప్పుశెనగ కోటాను దశలవారీగా తెప్పించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. నాణ్యమైన విత్తనానే్న సరఫరా చేస్తున్నట్లు ఎపి సీడ్స్, ఆయిల్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా విత్తనాలు పంపిణీ చేస్తుండంతో కొన్నిచోట్ల రైతులు సెల్‌ఫోన్‌లకు మెసేజ్‌లు అందక అవస్థలు పడ్డారు. మరికొన్ని కేంద్రాల్లో వచ్చిన రైతులకు సరిపడ స్టాకు సరఫరా చేయకపోవడంతో వెనుదిరిగాల్సి వచ్చింది. కాగా ఒక్కో కేంద్రంలో కనిష్టంగా 200 క్వింటాళ్లు, గరిష్టంగా 4వేల క్వింటాళ్లు పైబడి విత్తనాలు పంపిణీ చేశారు. అయినా తొలిరోజు అధికంగా వచ్చిన రైతుల్లో వందల సంఖ్యలో విత్తనాలు అందక అవస్థలు పడ్డారు. మరుసటి రోజు రావాలని అధికారులు చెప్పడంతో పర్మిట్లతోనే వెనుదిరిగాల్సి వచ్చింది. పామిడి మండలంలోని 200 క్వింటాళ్లు సరఫరా చేయగా, ఇందులో 150 మంది రైతులు వెనుదిరిగి వెళ్లారు. తాడిపత్రిలో రైతుల సెల్‌ఫోన్‌లకు మేసేజ్‌లు రాకపోవడంతో ఉసూరుమంటూ తిరిగి వెళ్లిపోయారు. ఇక ఆదివారం మినహా మిగతా రోజుల్లో పప్పుశెనగ విత్తనాలు సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. విత్తనం నాణ్యతగా ఉందని కొందరు రైతులు చెబుతున్నారు. అయితే మొలకెత్తి దిగుబడి వస్తేగానీ తెలీదని పలువురు అంటున్నారు. కాగా జిల్లాలోని అనంతపురం, బుక్కరాయసముద్రం, ఆత్మకూరు, తాడిపత్రి, పెద్దపప్పూరు, పుట్లూరు, యల్లనూరు, గుత్తి, యాడికి, శింగనమల, పెద్దవడుగూరు, పామిడి, బెళుగుప్ప, గుంతకల్లు, విడపనకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు, కణేకల్లు, బొమ్మనహాల్, డి.హీరేహాళ్, రామగిరి, కనగానిపల్లి, రొద్దం, పెనుకొండ, హిందూపురం, లేపాక్షి, పరిగి మండలాల్లో విత్తన వేరుశెనగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నేటి నుంచి అన్ని మండలాల్లోని పంపిణీ కేంద్రాల్లో విత్తనాలు అందజేయనున్నారు. సబ్సిడీ పోనూ రైతులు ఒక్కో బస్తాకు రూ.1,480 చెల్లించాల్సి ఉంది. గరిష్టంగా ఐదెకరాలకు 40 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. వేరుశెనగ పంట దెబ్బతిన్న తరుణంలో రైతులు పప్పుశెనగ ద్వారా కొంతైనా నష్టాన్ని పూడ్చుకోవాలన్న ఆశతో సాగుకు సిద్ధమై విత్తనాలు కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో పంపిణీ కేంద్రాలకు తరలి వస్తుండటం గమనార్హం.

అదుపు తప్పితే డ్రైనేజీలోకే...
* ధర్మవరంలో కాలువలు తవ్వి వదిలేశారు...
* ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు
ధర్మవరంరూరల్, అక్టోబర్ 6:్ధర్మవరం పట్టణంలో ప్రధాన రహదారుల్లో వెళ్లేవారు అడుగు పక్కకు వేసినా, వాహనంలో వెళ్లేవారు అదుపుతప్పినా, దుకాణాల్లోకి వెళ్లే వారు అదమరచి నడిచినా డ్రైనేజి కాలువలోకి పడిపోయే ప్రమాదం నెలకొంది. పట్టణంలో గత పదిరోజులుగా ప్రధాన రహదారులైన కళాజ్యోతి, ఎన్టీఆర్ కూడలి, గాంధీ కూడలి, కొత్తపేట రైల్వేకూడలితో పాటు పీఆర్‌టీ కూడలిలోకి వెళ్లే ప్రధాన రహదారుల వెంబడే కాకుండా మరికొన్ని రహదారుల్లో దారికి ఇరువైపులా ఉండే డ్రైనేజిలపై మూతలను తొలగించారు. మున్సిపల్ అధికారులు మురుగునీరు సక్రమంగా వెళ్లకుండా చెత్తాచెదారం అడ్డుపడుతుందని వీటిని తీసివేసేందుకే తొలగిస్తున్నామని తొలుత చెప్పారు. అలాగే ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉండే ఎవరూ అరుగులు కాని, మూతలు కాని వేయకూడదని, వాటిపై అక్రమకట్టడాలు కూడా కట్టకూడదని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మురికికాలువ ఓపెన్‌గా ఉండడంతో వాణిజ్యభవనాల్లోకి వెళ్లే ప్రజలు అతిజాగ్రత్తగా దుకాణాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రధానంగా వాహనాల్లో వెళ్లేవారు ఏ మాత్రం అదుపుతప్పినా కాలువల్లోకి పడాల్సివస్తుందని ఆందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారి వెంట ఉండే మురికికాలువలలోని చెత్తాచెదారం పారిశుద్ధ్య కార్మికులు రోడ్లపైకి వేయడంతో రోడ్లు మరింత ఇరుకుగా మారి ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తుతోంది. ఈ మురికికాలువలు పరిస్థితి తెలియక ప్రజలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. దుకాణదారులు, ఇళ్ల యజమానులు గతంలో కాలువలపై మూత వేసినందుకే ప్రస్తుతం అధికారులు తొలగించారని తామేమి చేయలేని పరిస్థితి నెలకొందని తమకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయంటున్నారు. అయితే ఓపెన్‌గా మురికికాలువలు ఉండడంతో ప్రమాదాలు జరగడం, జరిగే పరిస్థితి ఉందని పలువురు ప్రజలు తెలుపుతున్నారు. మున్సిపల్ అధికారులు ఇందుపై స్పందించి ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఎవరికి వారు గ్రిల్ అమర్చుకోవాలి:కమిషనర్
ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ నాగమోహన్ మాట్లాడుతూ డ్రైనేజిపై అక్రమంగా నిర్మాణాలు, మూతలు ఉండడంతో కాలువల్లో మురుగునీరు పోకుండా పారిశుద్ధ్య సమస్య ఏర్పడడంతో పాటు దోమల నిల్వలు పెరుగుతున్నాయని అంతేగాక వర్షాకాలంలో నీరు రహదారుల వెంట వెళ్లి ఒకచోట నిలవగా డ్రైనేజిలోకి వెళ్లలేని పరిస్థితులు ఉండడంతో తొలగించామన్నారు. ప్రస్తుతం ఎవరి దుకాణాలు ఇళ్ల వద్ద కాలువలపై ఇనుపగ్రిల్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించామని, ఇప్పటికే కొందరు అలా గ్రిల్ ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.

సిసి కెమెరాల సంఖ్య పెంచండి..
* ఎస్పీ రాజశేఖర్‌బాబు
గుంతకల్లురూరల్, అక్టోబర్ 6 : పట్టణంలో నేరాల నియంత్రణకు సిసి కెమెరాల సంఖ్య పెంచాలని ఎస్పీ రాజశేఖర్ బాబు సిఐ ప్రసాదరావును ఆదేశించారు. గురువారం స్థానిక సిఐ కార్యాలయాన్ని ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో నేరాలు తగ్గాయన్నారు. జిల్లావ్యాప్తంగా ఐదువందల మంది కానిస్టేబుళ్ల కొరత ఉందని త్వరలోనే నియమాకాలు చేపట్టి సిబ్బంది కొరత తీరుస్తామన్నారు. సబ్‌డివిజన్ పరిధిలో ఉన్న పోలీసు క్వాటర్స్ శిథిలావస్థకు చేరుకున్నాయని మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపామని నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడుతామన్నారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులు పరిశీలించి సిబ్బంది పనితీరుపై సిఐని అడిగి తెలుసుకున్నారు.
భర్త ఆచూకీ తెలపాలని వినతి
తన భర్త ఆచూకీ తెలపాలని కోరుతూ గురువారం వజ్రకరూరు మండలం పాతకడమలకుంట గ్రామానికి చెందిన సాలమ్మ ఎస్పీ రాజశేఖర్‌బాబుకు వినతిపత్రం సమర్పించింది. మూడు నెలలుగా తన భర్త ఎర్రిస్వామి కనబడుటం లేదని ఈ విషయమై వజ్రకరూరు ఎస్సైకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఏమాత్రం స్పందించకపోగా తప్పుడు కేసులు ఇస్తారా అంటూ దురుసుగా ప్రవర్తించారని వాపోయింది. కనీసం మీరైనా తన భర్త ఆచూకీ తెలపాలని కోరారు. ఇందుకు ఎస్పీ స్పందిస్తూ తాను విచారించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

మట్కా, గ్యాంబ్లింగ్ నియంత్రించాలి
* ఎస్పీ రాజశేఖర్‌బాబు
ఉరవకొండ, అక్టోబర్ 6 : మట్కా, గ్యాంబ్లింగ్‌ను నియంత్రించకపోతే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రాజశేఖర్‌బాబు హెచ్చరించారు. గురువారం పట్టణంలోని పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి పెండింగ్ ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమవేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో విచ్చలవిడిగా నడుస్తున్న మట్కా, గ్యాంబ్లింగ్ నియంత్రించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వారంలోపు మట్కా, గ్యాంబ్లింగ్ నియంత్రించకపోతే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకోసం జిల్లా ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహిస్తామన్నారు. ఇకపోతే గ్రామాల నుంచి సబ్సిడీ బియ్యం అక్రమంగా తరలించకుండా ప్రత్యేక నిఘా వేస్తామన్నారు. పోలీసు శాఖలో కొత్తటెక్నాలజీలో కంప్యూటరీకరణ చేయనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో నేరాలు తగ్గించడానికి సిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

టిడిపి పాలనలో అభివృద్ది శూన్యం
* గడపగడపకూ వైకాపాలో ఎమ్మెల్యే విశ్వ
బెళుగుప్ప, అక్టోబర్ 6 : టిడిపి అధికారం చేపట్టి రెండున్నరేళ్లు పూర్తయినప్పటికీ అభివృద్ధి శూన్యమని ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం మండల పరిధిలోని కాలువపల్లి గ్రామంలో గడపగడపకూ వైకాపా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వర్షాభావంతో తీవ్రంగా నష్టపోతున్న రైతాంగానికి ఇన్‌పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా అందించడంలో తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. అలాగే రైతులకు రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతులకు కేవలం వడ్డీకే సరిపోతోందన్నారు. అలాగే మహిళా సంఘాలకు అందించిన పెట్టుబడి నిధికూడా బ్యాంకుల వడ్డీకే సరిపోతుందన్నారు. పింఛన్లు తదితర సంక్షేమ పథకాల్లో అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర బిసి సెల్ కార్యదర్శి రామంజినేయులు, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, ఎంపిటిసి వెంకటేశులు, మాజీ సర్పంచు తిమ్మన్న, ఫకృద్దీన్ పాల్గొన్నారు.

గల్లంతైనయువకుడి శవం లభ్యం
గార్లదినె్న, అక్టోబర్ 6 : మండల పరిధిలోని ఎంపిఆర్ డ్యాం గ్రామంలో హెచ్‌ఎల్‌సి కాలవలో బుధవారం గల్లంతైన రాము (16) శవం గురువారం లభ్యమైంది. గల్లైంతనప్పటి నుంచి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినా దొరకలేదు. ఎట్టకేలకూ గురువారం మృతదేహాన్ని గుర్తించి, బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.