అనంతపురం

ఓటరుగా నమోదు చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, అక్టోబర్ 7 : వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్ట్భద్రులు, ఉపాధ్యాయు లు ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. కడప-అనంతపురం-కర్నూలు పట్ట్భద్రు లు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లోని ఎన్నికల జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి షెడ్యూల్ విడుదల చేశారు. ఈమేరకు పాత ఓటరు జాబితాల చెల్లుబాటు కాదు. అర్హు లు ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి. ఈనెల 1 నుంచి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబరు 5వ తేదీ వరకు ఓటరు నమోదు కొనసాగుతుంది. ఈనెల 15న మొదటి రీ పబ్లికేషన్ నోటీసును, 25న రెండో రీ పబ్లికేషన్ నోటీసును వెల్లడిస్తారు. నవంబరు 23న ముసాయిదా ఓటరు జాబితాలు ప్రచురిస్తారు. అప్పటి నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు క్లెయిములు, అభ్యంతరాలు దాఖలు చేయవచ్చు. అనంతరం 26వ తేదీ వాటిని పరిష్కరించేందుకు సప్లిమెంట్స్ తయారు చేస్తారు. డిసెంబర్ 30వ తేదీ తుది ఓటరు జాబితా విడుదలవుతుంది. పట్ట్భద్రులు ఓటరు నమోదుకు ఫారం-18తో డిగ్రీ సర్ట్ఫికెట్స్ జిరాక్స్ కాపీలను గెజిటెడ్ అధికారి లేదా, నోటరీతో అటెస్ట్ చేయించి సమర్పించాల్సి ఉంది. ఉపాధ్యాయులు ఫారం-19తో ప్రతి ఒక్కరూ కొత్తగా నమోదు చేయించుకోవాలి. ఇందుకు అర్హత తేదీ 2016 నవంబరు 1వ తేదీకి ఆరేళ్లలో మూడు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో పని చేసి ఉండాలి. అర్హులు గడువులోగా పోస్టు ద్వారా పంపుకోవచ్చు. ఓటరు నమోదు ఫారాలను రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార, ఎంపిడిఓలు, ఎంఈఓలు, మున్సిపల్ కార్యాలయాల్లో పొందవచ్చని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.