అనంతపురం

రాజకీయ పరిస్థితులపై ఆరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, అక్టోబర్ 7 : హిందూపురం, పెనుకొండ నియోజక వర్గాల్లో రాజకీయ పరిస్థితులపై స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలతో పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఆరా తీసినట్లు తెలుస్తోంది. శుక్రవారం హిందూపురం, పెనుకొండ నియోజక వర్గాల్లో రఘువీరా పర్యటించి వివిధ పంటలను పరిశీలించారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వి.నాగరాజు తోటకు వెళ్లి దాదాపు నాలుగు గంటల పాటు గడిపారు. ఈ సందర్భంగా తోటలోని వివిధ పంటలను పరిశీలించిన అనంతరం కాంగ్రెస్ నాయకులతో రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. రెండు రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అనంతపురంలో రైతులకు మద్దతుగా నిర్వహించిన ధర్నాకు హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాల నుంచి ఎంతమంది వెళ్లారు, స్పందన ఎలా ఉందంటూ ఆరా తీశారు. అదే విధంగా రెండు నియోజకవర్గాల్లో టిడిపి పట్ల ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ఆ పార్టీ నేతల పనితీరు ఎలా ఉంది అన్న అంశాలపై లోతుగా ఆరా తీశారు. దీనికితోడు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఏమైనా సానుకూల స్పందన లభిస్తోందా అన్న వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యే బాలకృష్ణ అభివృద్ధి పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇక్కడ వైకాపా బలం ఏ మేరకు ఉంది అన్న అంశాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. హిందూపురం నుంచి ఓ సామాజిక వర్గానికి చెందిన నేత గురువారం నీలకంఠాపురానికి వచ్చి చర్చించిన విషయాన్ని స్థానిక నాయకులతో పేర్కొన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, సంక్షేమ పథకాల అమలు తీరు ఎలా ఉందంటూ వాకబు చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా దాదాపు 4 గంటల పాటు ఎపి పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి నాగరాజు తోటలో ఇష్టాగోష్టిగా కాంగ్రెస్ నాయకులతో కలిపి రాజకీయ పరిస్థితులపై లోతుగా ఆరా తీయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో హిందూపురంపై దృష్టి సారించే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ నాయకులు కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.