అనంతపురం

వత్తిళ్ల మధ్య పనిచేయలేం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం టౌన్, అక్టోబర్ 7: నగర కార్పొరేషన్‌లో బెదిరింపులు, వత్తిళ్ళను తట్టుకోలేక అధికారులు పలాయన మంత్రం పఠిస్తున్నారు. రాజకీయ వత్తిళ్లు, సామాజికవర్గాల అండదండలతో నిన్నటివరకు హల్‌చల్ చేసిన ఉన్నతాధికారులు సైతం నేతలు ‘కనె్నర్ర’ చేయటంతో బదిలీలకు యత్నిస్తున్నారు. మరికొందరు ఆర్థిక సంవత్సరం మధ్యలో బదిలీలు జరగవన్న ఉద్దేశ్యంతో ‘సరెండర్’ జపం చేస్తున్నారు. ఎలాగోలా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బయటపడితే చాలని వెయ్యి దేవుళ్ళకు మొక్కుకుంటున్నారు. అందులోభాగంగా నేతలు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో వాటర్‌వర్క్స్ ఇఇ రామ్మోహనరెడ్డి బాధ్యతలు మోయలేనంటూ కమిషనర్ ఓబులేషుకు లేఖ రాశారు. దీంతో వాటర్‌వర్క్స్ బాధ్యతలను ఇఇ సురేంద్రబాబుకు అప్పగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఇన్‌చార్జి ఎస్‌ఇగా, ఇఇగా విధులు నిర్వహిస్తున్న సురేంద్రబాబు తాజాగా వాటర్‌వర్క్స్ బాధ్యతలను చేపట్టటానికి ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. ఫలితంగా ఉత్తర్వులు తీసుకోవటానికి ఆయన నిరాకరించినట్లు సమాచారం.
ఇటీవల హెచ్‌ఎల్‌సి కెనాల్‌కు తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేశారు. ఈ నీటిని పంపింగ్ చేసుకోవటానికి అవసరమైన మోటార్లు అన్నీ కండిషన్‌లో ఉన్నట్లు వాటర్‌వర్క్స్ డిఇఇ కిష్టప్ప సమీక్ష సమావేశంలో స్పష్టం చేశారు. అయితే తీరా నీరు విడుదలైన తర్వాత పంపింగ్ సమయంలో 40 హెచ్‌పిలో లిఫ్ట్ మోటార్ తప్పించి మిగతావన్నీ పనిచేయని స్థితిలో ఉండటం గుర్తించారు. నేతలు, ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించిన కారణంగా డిఇఇ కిష్టప్పను సెప్టెంబర్ 12 నుంచి నెలాఖరు వరకు లీవుపై వెళ్ళాలని ముఖ్యనేత ఆదేశించినట్లు తెలిసింది. అంతేకాక కార్పొరేషన్ వాటర్‌వర్క్స్‌ను గాడిలో పెట్టటానికి పబ్లిక్‌హెల్త్ ఎస్‌ఇ అంకయ్యకు ముఖ్యనేత బాధ్యతలు అప్పగించారు. ఎస్‌ఎస్ ట్యాంకులో పనిచేయని మోటార్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించారు. వాటర్‌వర్క్స్ డిఇఇ, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పంపింగ్ సైతం పూర్తిస్థాయిలో చేపట్టలేని స్థితినెలకొంది. ట్రాన్స్‌ఫార్మర్ సక్రమంగా పనిచేయని అంశాన్ని సైతం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కీలకమైన వాటర్‌వర్క్స్ బిల్లుల చెల్లింపులో కూడా జాప్యం జరుగుతుండటంతో అధికారులు అత్యవసర పనులు చేయించుకోవటంలో ఇబ్బందులు పడాల్సి వస్తుండటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి పరిస్థితులలో వాటర్‌వర్క్స్ బాధ్యతల నుంచి తప్పుకోవటమే మేలని ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో వాటర్‌వర్క్స్ బాధ్యతలను తప్పించాలని ఇఇ రామ్మోహనరెడ్డి కోరటం అధికారవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. కార్పొరేషన్‌లో కీలక బాధ్యతలను చేపట్టటానికి ఉన్నతాధికారులు పునరాలోచనలో పడటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.