అనంతపురం

నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అనుమతి నో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురంటౌన్, అక్టోబర్ 15: నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ మళ్లీ వాయిదా పడింది. కమిషనర్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో ఈ ప్రక్రియ వాయిదా పడినట్లు సమాచారం. ఆన్‌లైన్ విధానంలో భవన నిర్మాణాల అనుమతి పొందిన వారు నిబంధనల మేరకు కట్టారా లేదాయన్న అంశాన్ని మూడు నెలల క్రితం వచ్చిన టాస్క్ఫోర్స్ కమిటీలు తనిఖీలు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాయి. ఈ నివేదికల మేరకు బిల్డింగ్ ప్లాన్లకు విరుద్ధంగా నిర్మించిన భవంతులను కూల్చివేయటానికి ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాన్ని నియమించింది. శనివారం ఈ బృందం కూల్చివేత ప్రక్రియ చేపట్టటానికి పోలీసు బందోబస్తు కోరింది. దీనిపై అసిస్టెంట్ సిటీ ప్లానర్ కృష్ణకిశోర్ పంపిన లేఖను కార్పొరేషన్ కమిషనర్ సంతకం లేని కారణంగా పోలీస్ యంత్రాంగం తిరస్కరించింది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం శనివారం మేయర్ స్వరూప, అదనపుకమిషనర్ కృష్ణమూర్తిని కలిసి పోలీస్ బందోబస్తు సమకూర్చాలని కోరింది. అయితే రెగ్యులర్ కమిషనర్ లేని కారణంగా కూల్చివేతకు అనుమతి ఇచ్చే అధికారం తనకు లేదని అదనపు కమిషనర్ కృష్ణమూర్తి వారికి తేల్చిచెప్పారు. రెగ్యులర్ కమిషనర్ లేని సమయంలో నగరంలో కూల్చివేతలు చేపడితే సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని మేయర్ స్వరూప స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రెగ్యులర్ కమిషనర్ వచ్చిన తర్వాత కూల్చివేత పనులు చేపట్టాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందానికి మేయర్ సూచించారు. దీంతో చేసేది లేక ఆ బృందం ఇదే అంశాన్ని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. నగరంలో ఆక్రమణల కూల్చివేతకు వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది చేసేదేమి లేక వెనుదివరిగారు.