అనంతపురం

ఉక్కు పరిశ్రమల్లో కార్మికుల శ్రమదోపిడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డీ. హీరేహాల్, అక్టోబర్ 15: రాయదుర్గం నియోజకవర్గంలోని ఉక్కు పరిశ్రమల్లో కార్మికుల భద్రత గురించి యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. చాలీచాలని జీతభత్యాలు ఇస్తూ 12 గంటలపాటు పని చేయించుకుని వారి శ్రమను దోపిడీ చేస్తున్నారే తప్ప కార్మికులకు కల్పించాల్సిన రక్షణ, భద్రత వంటి ప్రమాణాలు గాలికి వదిలేశారని మండిపడుతున్నారు. ఇక్కడ నిరుద్యోగుల అవసరాలు ఆసరాగా తీసుకున్న ఉక్కు పరిశ్రమలో యాజమాన్యాలు వారిని అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారు. పరిశ్రమల్లో పనిచేయడానికి వస్తున్న నిరుద్యోగులను పనిలో చేర్పించుకుని వారితో ముందుగానే ఒప్పందపత్రంలో సంతకం చేయించుకుని ఇష్టారాజ్యంగా కార్మికులను బయటికి గెంటేస్తున్నారు. పరిశ్రమల యజమానులను ఎదిరించడానికి కంపెనీవారు జారీ చేసిన అగ్రిమెంట్‌కాని, అపాయింట్‌మెంట్ లెటర్ కాని తమ చేతిలో ఏ రుజువు లేకపోవడంతో కార్మికులు ఏమి చేయలేక, వారిని ఎదిరించలేక పోతున్నారు. పని ఉన్న సమయంలో కార్మికులను వాడుకోవడం, పనిలేని సమయంలో కార్మికులను వదిలేయడం వంటి పనులు కంపెనీలు ఇక్కడ పాటిస్తున్నాయి. పరిశ్రమల్లో పాటించవలసిన పద్ధతులు ఏ మాత్రం పాటించడం లేదు. కార్మికుల కోసం హెల్మెట్ కాని, మాస్క్‌లుకాని, డ్రెస్ కోడ్‌కాని యాజమాన్యం సమకూర్చడం లేదు. దట్టమైన పొగలోనే పది గంటలపాటు కార్మికులు విధి లేక పనిచేస్తున్నారు. ఏ మాత్రం అనుభవం లేని కార్మికుల చేత భారీ యంత్రాల వద్ద పనిచేయిండానికి నియమిస్తున్నారు. కార్మికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పనిచేస్తున్నారు. ఒక్కొక్క సమయంలో ఎలాంటి అనుభవం లేని కార్మికులు యంత్రాలకు బలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల గురించి జిల్లా అధికారులు కాని, మండల అధికారులు కాని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పరిశ్రమ యజమానులు తిరుగులేని శక్తులుగా వ్యవహరిస్తున్నారు. నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోయినా ఆ కుటుంబానికి కంపెనీ నుండి ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదు. ఈ సంఘటనలపై ఎవరైనా కార్మికులు ఎదురు తిరిగితే మరుక్షణమే ఆ కార్మికున్ని పరిశ్రమ నుండి నిర్ధాక్షిణ్యంగా మెడపట్టి గెంటేస్తున్నారు. ఇంత దారుణాలు జరిగినా పాపం కార్మిక శాఖ కళ్లు లేని కబోదిలా వ్యవహరిస్తోంది. డీ. హీరేహాల్ మండల పరిధిలో 8 ఉక్కు పరిశ్రమలు నడుస్తున్నాయి. అందులో బిఐఒపి, ఎస్‌ఎస్‌పి, యాపిల్, రావూస్, ఎస్‌ఎల్‌వి, రామాంజినేయ, సాయి బాలాజి, వెంకటసాయి పరిశ్రమలు ఇక్కడ నడుస్తున్నాయి. పరిశ్రమల నుండి వెదజల్లే కాలుష్య దుమ్ము వలన చుట్టుపక్కల గ్రామాలతోపాటు చెట్టుచేమను కప్పి వేస్తున్నాయి. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు కూడా దుమ్ము, ధూళికి దగ్గు, ఊపిరితిత్తులవంటి రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. కుటుంబ అవసరాలు దృష్టిలో ఉంచుకుని ప్రాణాలు లెక్కచేయక కార్మికులు ఇక్కడి పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. పరిశ్రమ యజమానులు ముడిసరుకును తెప్పించుకుని స్పాంజ్ ఐరన్‌ను జీరోలో వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా అధికారులకు ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా పరిశ్రమలతోపాటు రాయదుర్గం నియోజకవర్గంలో తెల్ల కంకర దందా రోజు రోజుకు పెరిగిపోతుంది. పెద్ద పెద్ద కొండలను పిండి చేస్తూ కంకరను కర్నాటక ప్రాంతానికి తరలిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతి మించి తెల్ల కంకర యజమానులు కొండను తవ్వుకుని లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదిస్తూ సంబందిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఇక్కడి ప్రజలు మండిపడుతున్నారు. అందులో రాయదుర్గం-బళ్లారి మార్గంలో ఉన్న పల్లేపల్లి గ్రామం గేటు వద్ద అక్కమ్మ కొండ దిగువున ఉన్న ఓ క్రషర్ యాజమాన్యం అనుమతులకు మించి కొండను తవ్వేస్తున్నారు. కాలుష్యం నియంత్రించడానికి క్రషర్ యాజమాన్యం ఏమాత్రం నియమ నిబంధనలు పాటించడం లేదు. క్రషర్ల నుండి ఉధృతంగా వస్తున్న తెల్లటి దుమ్ము వలన అక్కడ ఉన్న పొలాలు, చెట్లు తెల్లగా మారిపోయింది. దీనివలన ఇంత దారుణంగా కాలుష్యం పెరిగిపోయి ప్రమాద అంచునకు చేరినా కాలుష్య నియంత్రణ శాఖ మొద్దు నిద్రలో ఉన్నారని ప్రజలు బాహాటంగా ఆరోపిస్తున్నారు.
సమాజ పరివర్తన సముదాయ స్వచ్ఛంద సంస్థకు ఫిర్యాదు
ఆంధ్రా, కర్నాటక సరిహద్దు ప్రాంతంలో మైనింగ్ దందాపై గడగడలాడించిన సమాజ పరివర్తన సముదాయ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు ఎస్‌ఆర్ హీరేమట్‌కు ఇక్కడ పెరిగిపోయిన కాలుష్యంపై రాయదుర్గం ప్రజలు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఉక్కు పరిశ్రమ, కంకర పరిశ్రమ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా కాలుష్య నియంత్రణ పాటించకపోవడంతో దుమ్ము, ధూళి వలన ఇక్కడి ప్రాంతం ఎండిపోయిందని ప్రజలు నానా రోగాలతో అవస్థలు పడుతున్నారని హిరేమట్‌కు ఫిర్యాదు చేశారు. ఒకసారి మా ప్రాంతానికి వచ్చి పెరిగిపోయిన ఈ కాలుష్య నియంత్రణను అధ్యయనం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకునే విధంగా చూడాలని ఇక్కడ ప్రాంతవాసులు ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. త్వరలో మీ ప్రాంతాన్ని సందర్శిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిసింది.