అనంతపురం

ఉషారాణీ శభాష్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్లదినె్న, అక్టోబర్ 15: దోమల నివారణ, దోమలపై దండయాత్ర, పరిశుభ్రత కార్యక్రమాలపై కరపత్రాలను ముద్రించి పంచాయతీలోని ఇంటింటికి అందజేసి ప్రజలకు అవగాహన కల్పించినందుకు గార్లదినె్న సర్పంచ్ గట్టు ఉషారాణిని కలెక్టర్ కోన శశిధర్ అభినందించారు. శనివారం దోమలపై దండయాత్రలో భాగంగా ముందుగా వివిధ పాఠశాల విద్యార్థులచే మండలంలోని అధికారులందరూ హాజరై ఎంపిడిఓ కార్యాలయం నుండి పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం కలెక్టర్ స్థానిక పంచాయతీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులచే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శనివారం ర్యాలీలు నిర్వహించడం కాదు, దోమల నివారణకు ఏఏ చర్యలు చేపట్టారని అధికారులను అడిగితెలుసుకున్నారు. అదేవిధంగా దోమల నివారణ, పరిశుభ్రత కోసం నా సహకారం ఏమి కావాలని సర్పంచ్ గట్టు ఉషారాణిని అడిగారు. ఇందుకు ఆమె పంచాయతీలో చాలా మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని అన్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్ పంచాయతీకి వెంటనే 600 మరుగుదొడ్లు మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా వర్మీకంపోస్ట్ యూనిట్లు ఎన్ని కావాలన్నా ఇస్తామన్నారు. వర్మికంపోస్ట్ యూనిట్లు నిర్మించుకోవడం వలన రైతులకు ఆదాయం వస్తుందని, వాటితోపాటు దోమల బెడద తగ్గుతుందన్నారు. వీటి నిర్మాణం సైతం డ్వాక్రా సంఘాల వారికి ఇవ్వాలన్నారు. గ్రామం మధ్యలో ఉన్న డ్రైనేజి వంకను పలువురు గ్రామస్తులు ఆక్రమించుకుని డ్రైనేజి నీరు పోకుండా మురికి నీరు నిలబడి దోమల బెడద ఎక్కువగా ఉందని వైస్ ఎంపిపి చంద్రశేఖర్ నాయుడు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ వెంటనే పంచాయతీ కార్యదర్శి ముత్యాలరెడ్డితో డ్రైనేజి వంకను వెంటనే హిటాచితో శుభ్రం చేయించాలని ఆదేశించారు. దీనితోపాటు పరిశుభ్రత పనుల కోసం పంచాయతీకి మంజూరైన రూ.10వేలు ఎందుకు ఖర్చు పెట్టలేదని, పంచాయతీ సమావేశాలు సక్రమంగా జరుపుతున్నారా, పంచాయతీ సమావేశాలకు గ్రామ సంఘాల మహిళలను పిలుస్తున్నారా తదితర వాటిపై పంచాయతీ కార్యదర్శి ముత్యాల రెడ్డిని అడిగితెలుసుకున్నారు. కలెక్టర్ మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడుతూ దోమలపై దండయాత్ర, పరిశుభ్రత పనులపై మీరు ఇంటింటికి వెళ్లి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సిఇఒ రామచంద్ర, డిపిఒ జగదీశ్వరమ్మ, డిఎల్‌పిఒ హెచ్‌ఎం బాషా, పిడి నాగభూషణం, ఆర్డీఒ మలోలా, ఎంపిపి నాగరాజు, జడ్పిటిసి విశాలాక్షి, వైస్ ఎంపిపి చంద్రశేఖర్ నాయుడు, మండల టిడిపి నాయకులు గేట్ కృష్ణారెడ్డి, తహశీల్దార్ గోపాల్‌రెడ్డి, ఎంపిడిఒ భాస్కర్‌రెడ్డి, వైద్యాధికారి ఇర్షాద్ అహమ్మద్, ఎంఇఒ సత్యనారాయణ, ఇఒఆర్డీ వేణుగోపాల్‌రెడ్డి, ఎపిఒ రామంజినేయులు, ఎపిఎం గుణశ్యాం, సాక్షరభారతి ఎంసి అనురాధ, సిసి రామంజినేయులు, సిఎలు ప్రభాకర్, రామంజినేయులు, గ్రామైక్య సంఘం లీడర్లు జ్యోతి, విజయలక్ష్మి పాల్గొన్నారు.