అనంతపురం

21న పురం ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, అక్టోబర్ 17: సాధారణ, మధ్యతరగతి కుటుంబాల రోగులను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 21న స్థానిక జిల్లా స్థాయి ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ సెంటర్‌ను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణచే ప్రారంభించడం జరుగుతుందని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ జెఇ వెంకటస్వామి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ప్రభుత్వాసుపత్రిలో సూపరింటెండెంటెంట్ డాక్టర్ కేశవులు అధ్యక్షతన అభివృద్ధి కమిటీ, వైద్యులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ వివిధ రోగాల కారణంగా రక్త మార్పిడి కోసం హిందూపురం పరిసర ప్రాంతాలకు చెందిన ఎంతోమంది రోగులు బెంగళూరుకు వెళ్ళి ఎన్నో వ్యయ ప్రయాసలకు గురవుతున్నారన్నారు. వారానికి కనీసం రెండుసార్లు రక్త మార్పిడి కోసం వేలాది రూపాయలు వ్యయం చేస్తూ ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్ళామన్నారు. అధునాతన పరికారాలతో నిపుణుల పర్యవేక్షణలో 10 పడకల డయాలసిస్ కేంద్రాన్ని ఈ నెల 21న ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. రోజు రోజుకు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, ఇక్కడ ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సులు తదితర పోస్టులను భర్తీ చేసేందుకు ఎమ్మెల్యే ద్వారా మంత్రి కామినేని శ్రీనివాస్, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌లకు నివేదిక పంపామన్నారు. ఈ నెల 21న ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన సందర్భంగా ఆయా సమస్యలను పరిష్కరించేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు దేమకేతేపల్లి అంజినప్ప, బండారు బాలాజీ, సుశీలమ్మ, ఆర్‌ఎంఓ రుక్ష్మిణమ్మ తదితరులు పాల్గొన్నారు.