అనంతపురం

సామాజిక సేవలో పోలీసులు ముందుంటారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, అక్టోబర్ 18: దేశ భద్రత, ప్రజల రక్షణే కాదు సామాజిక సేవ కూడా పోలీసులకు ముఖ్యమని ఎస్‌పి రాజశేఖర్‌బాబు అభిప్రాయపడ్డారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన మంగళవారం స్థానిక పోలీస్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సమాజానికి పోలీసులు దిశ, దశ నిర్దేశం కావాలన్నారు. దేశ భధ్రత, ప్రజల రక్షణ కోసం ఎందరో పోలీసులు అమరులయ్యారని వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. అందుకే ప్రతి ఏటా అక్టోబర్ 15నుండి 21వరకు అమరవీరుల వారోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. పోలీస్ ఆయుధాల ప్రదర్శనలతో ఆరంభం అయ్యి వారి త్యాగాలను గుర్తుచేసుకొంటూ వ్యాసరచన, పెయింటింగ్, కార్టూన్ల పోటీలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రాణాపాయ స్థితిలో వున్న వారికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడటం మానవతా ధర్మమన్నారు. ప్రతి ఒక్కరు రక్తదాన చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఎస్‌పి నొక్కిచెప్పారు. జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుడు సాకే త్రిలోక్‌నాథ్, సభ్యులు హరినాథ్‌తోపాటు వందమందికి పైగా పోలీస్ సిబ్బంది రక్తదానం చేశారు. ఇందులో హోమ్‌గార్డుల నుంచి అధికారుల వరకూ రక్తమిచ్చారన్నారు. ఒక్క రోజులోనే దాదాపు 300 వరకు రక్తదానం చేసి అమరుల త్యాగాలకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. జిల్లా సర్వజన ఆసుపత్రి వైద్యులు శివకుమార్, పిటిసి వైద్యులు ఆదిశేషయ్యల ఆధ్వర్యంలో రక్తాన్ని సేకరించి భద్రపరిచారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు మల్లికార్జున వర్మ, సిఎం గంగయ్య, బి.మల్లికార్జున, ఖాసీంసాబ్, ఎం.నరసింగప్ప, నాగసుబ్బన్న, సిహెచ్ వెంకటేశ్వర్లు, చిన్నికృష్ణ, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్లు రాజశేఖర్, ఆర్‌ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.