అనంతపురం

మందకొడిగా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, అక్టోబర్ 23 : గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు మందకొడిగా సాగుతోంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ, పట్ట్భద్రుల ఎమ్మెల్సీల పదవీకాలం ముగియడంతో తిరిగి ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈనెల 1వ తేదీ నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 5వ తేదీ వరకూ గ్రాడ్యుయేట్ ఓటర్ల నుంచి ఫారం-18, ఉపాధ్యాయ ఓటర్ల నుంచి ఫారం-19 ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 5 తర్వాత 23వ తేదీ ముసాయిదా ఓటరు జాబితాలను ప్రకటిస్తారు. ఆ రోజు నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకూ క్లెయిములు, అభ్యంతరాలు దాఖలుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అనంతరం డిసెంబర్ 26వ తేదీ వాటిని పరిష్కరించి సప్లిమెంట్‌లు రూపొందిస్తారు. అదేనెల 30న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు. ఈనేపథ్యంలో ప్రభుత్వాధికారులు, మంత్రులు ఓవైపు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పోటీలో ఉంటున్న అభ్యర్థులు సైతం ఓటర్లుగా నమోదు చేయించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అయితే ఓటర్లు మాత్రం పూ ర్తిస్థాయి ఆసక్తితో నమోదు చేయించుకోవడం లేదు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదు చేయించుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులుగా ఉన్న గ్రాడ్యుయేట్లు ఆయా కార్యాలయాల నుంచి దరఖాస్తులను పూరించి పంపుతున్నారు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్లు ఆయా నియోజకవర్గాల్లో స్థానికంగా ఓటర్లుగా నమోదై ఉండాలన్న నిబంధన ఉంది. సాధారణ డిగ్రీలు, డిప్లొమోలు, ఇంజినీరింగ్, మెడిసిన్‌లో ఏదైనా డిగ్రీ కలిగి ఉండవచ్చు. వీరు నవంబర్ 5 లోగా పోస్టుద్వారా కూడా దరఖాస్తులు పంపుకోవచ్చు. కాగా పాత ఓటరు జాబితాలు చెల్లక పోవడంతో గతంలో ఓటరుగా నమోదైన వారు కూడా ఇప్పుడు తిరిగి ఓటర్లుగా నమోదు చేయించుకోవాల్సి ఉంది. అయితే ఫారం-18తో డిగ్రీ సర్ట్ఫికెట్లను గెజిటెడ్ అధికారి లేదా నోటరీ ద్వారా అటెస్ట్ చేయించి సమర్పించాలి. అయితే పలు కారణాల రీత్యా గ్రాడ్యుయేట్లు దరఖాస్తులను సమర్పించడంలో జాప్యం చేస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. కొందరు ఓటర్లుగా ఉన్నా స్థానికంగా లేకపోవడం, అటెస్టేషన్ చేయించేందుకు ఎదువుతున్న ఇబ్బందులు, ఆర్థికంగా కొంతభారం పడుతుండటం, ప్రత్యేకించి సమయాన్ని కేటాయించలేక పోతుండటం వంటి కారణాల వల్ల ఓటరుగా నమోదు చేయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈనెలాఖరు నుంచి నవంబర్ 5లోగా గరిష్టంగా గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ఈసారి గ్రాడ్యుయేట్ ఓటర్ల సంఖ్య పెరుగుతుందని, గ్రాడ్యుయేట్లు అత్యధికంగా ఉండటమే కారణమని వారు పేర్కొంటున్నారు.