అనంతపురం

లక్ష ఫారంపాండ్ల లక్ష్యాన్ని సాధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఏప్రిల్ 7: జిల్లాలో నిర్ధేశించిన లక్ష ఫారంపాండ్ల లక్ష్యాన్ని పూర్తి చేస్తామని కలెక్టర్ కోన శశిధర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వివరించారు. గురువారం గ్రామీణ ఉపాధి హామీ, ఇరిగేషన్, తా గునీరు, సిమెంట్ రోడ్ల నిర్మాణం, ఫా రంపాండ్లు తదితర అంశాలపై సిఎం అన్ని జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబందించి కలెక్టర్ వివరిస్తూ, ఇప్పటివరకు 49 వేల ఫారంపాండ్లను గ్రౌండ్ చేయాలన్నారు. ఇందులో 20 వేల ఫారంపాండ్లు పూర్తయ్యాయన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఉదయం 5:30 గంటల నుండి 10:30గంటల వరకు మాత్రమే కూలీలు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జూన్ లోపు లక్ష ఫారంపాండ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. ఈ ఏడాది సిసి రోడ్లు 436 కిలోమీటర్లు లక్ష్యం కాగా ఈ ఏడు రోజుల్లో 16 కిలోమీటర్లు పూర్తిచేశామన్నారు. నీరు-చెట్టు కార్యక్రమం కింద 386 పనులు మంజూరయ్యాయన్నారు. జిల్లాలో 71 గ్రామాల్లో నీటిని రవాణా చేస్తున్నామన్నారు. 60 శాతం సిపిడబ్ల్యుఎఫ్ పథకాలు పనిచేస్తున్నాయన్నారు. నాన్ సిఆర్‌ఎఫ్ కింద 5 కోట్లు, సిఆర్‌ఎఫ్ కింద 10 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. జిల్లాలో 12 మున్సిపాలిటీలకుగాను 6 మున్సిపాలిటీల్లో ప్రతి రోజూ, 6 వాటిల్లో రోజు విడిచి రోజు నీరు సరఫరా చేయాలన్నారు. ప్రతి రోజు తాగునీటి అంశంపై సమీక్షిస్తూ తాగునీటి స మస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు సిఎంకు కలెక్టర్ వివరించా రు. ఈ వీసిలో అసిస్టెంట్ కలెక్టర్ సు మిత్‌కుమార్ గాంధీ, జెసి-2 సయ్యద్ ఖాజామొహీద్దీన్, డ్వామా పిడి నాగభూషణం, సిపిఓ సుదర్శనం, జెడ్పి సిఇఓ రామచంద్ర, ఆర్‌ఎస్‌ఇ రవికుమార్ పాల్గొన్నారు.