అనంతపురం

పట్టు ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం రూరల్, నవంబర్ 6 : పట్టు ఉత్పత్తుల్లో దేశీయంగా స్వయం సమృద్ధి సాధించడానికి కేంద్ర పట్టు మండలి నిరంతర కృషి చేస్తోందని కేంద్ర పట్టు మండలి చైర్మన్ హనుమంతరాయప్ప పేర్కొన్నారు. ఆదివారం లేపాక్షి మండల పరిధిలోని శిరివరం గ్రామం వద్ద పట్టు పురుగుల చాకీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశీయంగా పట్టు ఉత్పత్తులు మన అవసరాలకు సరిపడటం లేదని, విదేశీ దిగుమతులపై పట్టు ఉత్పత్తులు ఆధారపడి ఉందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పట్టుగూళ్ల దిగుబడులు పెంచడం ద్వారా పట్టు ఉత్పత్తి అధికంగా సాధించడానికి మండలి కృషి చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా 800 మంది శాస్తవ్రేత్తలు పట్టు అధికోత్పత్తికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన మేక్ ఇండియా ఆశయాలను సాధిస్తామన్నారు. ఈ దిశగా పట్టు పరిశ్రమలో రీలింగ్, వీవింగ్ తదితర విభాగాలను ఆధునీకరించడానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను అందిస్తున్నామని తెలిపారు. అంతేగాకుండా పట్టు రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పలు పథకాలు ప్రారంభిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు హరి, పార్థసారథి, వరప్రసాద్, సుబ్రమణ్యం, ఆదర్శకుమార్, ఉదయ్‌కుమార్ తదితరులు చైర్మన్ హనుమంతరాయప్పను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమ శాఖ జెడి అరుణకుమారి, పట్టు మండలి శాస్తవ్రేత్తలు సత్యనారాయణ రాజు, పట్టు పరిశ్రమ శాఖ ఎడి నాగరంగయ్య, ప్రసాద్, డాక్టర్ మనోహర్‌రెడ్డి, డాక్టర్ నరసింహమూర్తి తదితర పట్టు రైతులు పాల్గొన్నారు.