అనంతపురం

సజావుగా కానిస్టేబుళ్ల రాత పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, నవంబర్ 6 : జిల్లాలో ఆదివారం నిర్వహించిన కానిస్టేబుళ్లు రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా అనంతపురం, గుత్తి, పామిడిలో 43 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే 23,085 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 21,799 మంది హాజరైనట్లు ఎస్.పి రాజశేఖర్‌బాబు ఎలిపారు. నగరంలో 28 కేంద్రాల్లో 15,836 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 14,949, గుత్తిలో 12 కేంద్రాలు ఏర్పాటు చేయగా 6,199 మందికి 5,857 మంది, పామిడిలో 3 కేంద్రాలు ఏర్పాటు చేయగా 1050 మందికి 993మంది హాజరైనట్లు తెలిపారు.
ఏపిపిఎస్సీ పరీక్షకు 1008 మంది గైర్హాజరు
అనంతపురం సిటీ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ పరీక్షకు 4,086 మంది అభ్యర్థులకు 3,078 మంది హాజరుకాగా 1008 మంది గైర్హజరైనట్లు డిఆర్‌ఓ మల్లీశ్వరీదేవి తెలిపారు. జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన 11 పరీక్ష కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందలు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. అయితే జిల్లా కేంద్రంలోని ఓ పరీక్ష కేంద్రంలో 18 మంది అభ్యర్థులకు ఒకే హాల్‌టికెట్టు నంబరు రావడంతో వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి మరొక నెంబరును కేటాయించి పరీక్ష రాయించినట్లు తెలిపారు. కాగా జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను జెసి బి.లక్ష్మికాంతం పరిశీలించారు. నగరంలోని విజయనగరం లా కళాశాలలో జెసి తనిఖీ చేసి, అందులోని ఏర్పాట్లు, ఎంత మంది పరీక్షకు హాజరయ్యారనే విషయాలను కళాశాల ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, ఇతర ఏర్పాట్లును అడిగి తెలుసుకున్నారు.