అనంతపురం

టిడిపి చేసిన అభివృద్ధిపై ప్రజలకు గర్వంగా చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తచెరువు,నవంబర్ 6 : రాష్ట్రం విడిపోయి లోటుబడ్జెట్‌లో ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై కార్యకర్తలు గర్వంగా ప్రజలకు వివరించాలని మంత్రి పల్లెరఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. జన చైతన్యయాత్రలో భాగంగా ఆదివారం మండల పరిధిలోని పోతులకుంటలో పర్యటించారు. అనంతరం సర్పంచి రమేష్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల కాలంలోనే భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ముఖ్యంగా రైతులకు చేసిన రుణమాఫీ దేశంలో ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. 84 లక్షల మంది రైతులకు రూ.24వేల కోట్లు రుణమాఫీ చేశామని, ఇదే విషయాన్ని గర్వంగా ప్రజలకు వివరించాలన్నారు. కన్న కొడుకులే నెలనెల రూ.1000 డబ్బులు ఇవ్వలేదని, అదే వృద్ధులకు ప్రతినెలా రూ.1000 పింఛన్ ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దకొడుకయ్యాడన్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా జిల్లాలోనే పెద్ద చెరువు అయిన బుక్కపట్నం చెరువుకు నీరు నింపుతామన్నారు. చంద్రన్న బీమా గురించి విరివిగా ప్రచారం చేయాలని కోరారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2లక్షల మేర బీమా సౌకర్యం ఉంటుందన్నారు. రాష్ట్ర పరిశీలకురాలు పర్వీన్‌బాను మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి యాత్రలు చేపట్టినట్లు తెలిపారు. సమస్యలు తెలుసుకుని వచ్చే జన్మభూమి కార్యక్రమాల్లో పరిష్కరిస్తామన్నారు. అనంతరం వైకాపాకు చెందిన పోతులకుంట ఎంపీటీసీ శాంతమ్మ, మరి కొందరు నేతలు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర పరిశీలకురాలు శ్రీమతి పర్వీన్‌బాను, మండల పార్టీ కన్వీనర్ రమేష్‌నాయుడు, ఎంపీపీ వాణి, జడ్పీటీసీ మహాలక్ష్మి, మాజీ జడ్పీటీసీ లక్ష్మీనారాయణ, పెనుకొండ మార్కెట్‌యార్డు వైస్‌చైర్మన్ రఘుపతి, మాజీ సర్పంచులు సూర్యనారాయణ, కిష్టప్ప, జిల్లా టిడిపి కార్యదర్శి శ్రీనివాసులు, కార్యవర్గసభ్యులు దాల్‌మిల్‌సూరి, వైస్ సర్పంచి భక్తవత్సలం నాయుడు, తదితరులు పాల్గొన్నారు.