అనంతపురం

నోట్ల దడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 8 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మోదీ ప్రకటన వారికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. లాకర్లు, బీరువాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని ఎలా మార్చిడి చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి రూ. 500, రూ. వెయ్యి కరెన్సీ నోట్ల చెల్లుబాటు రద్దయింది. అంతేగాకుండా బుధవారం నుంచి బహిరంగ మార్కెట్‌లో ఈ రెండు కరెన్సీ నోట్లు చెల్లుబాటు కావని వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి రూ. 100 కరెన్సీ నోట్లుగా మార్చుకోవాల్సిందిగా ప్రధాని సూచించడంతో సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బుధ, గురువారాలు ఏటిఎంలు పని చేయకపోవడంతో పాటు బుధవారం బ్యాంకు లావాదేవీలు నిలిచిపోనున్నాయి. దీంతో అనంతపురం పట్టణంతోపాటు హిందూపురం, పుట్టపర్తి, కదిరి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో డబ్బులు తీసుకునేందుకు ప్రజలు ఎటిఎంల వద్ద బారుతీరారు. నగరంలోని నోట్ల డిపాజిట్ ఎటిఎం వల్ల జనం నోట్ల కట్టలతో బారులు తీరారు. బ్యాంకుల్లో బుధవారం నుంచి నగదు జమ చేసేందుకు గుర్తింపు పత్రం తప్పనిసరిగా చూపించాల్సి రావడంతో యంత్రాల ద్వారా డబ్బు జమ చేసేందుకు జనం తంటాలు పడుతున్నారు.
ఇది మంచి నిర్ణయం..
- ఆర్.హరినాథ్‌రెడ్డి, అడ్వకేట్, పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు
కేంద్ర ప్రభుత్వం మంది నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మధ్యతరగతి, కిందిస్థాయి వారికి చాలా ఉపయోగకరం. అంతేగాకుండా నల్లధనం బయటకు వచ్చే అవకాశం ఉంది. నకిలీ నోట్ల బెడద నుంచి సామాన్యులకు రక్షణ కల్పించినట్లయింది. అంతేగాకుండా రక్షణ వ్యవస్థ బలోపేతానికి తోడ్పడుతుంది. రూపాయి విలువ పెరగడంతోపాటు ఆర్థిక సమానత్వం వస్తుంది.
నల్లధనంపై ఉక్కుపాదం మోపడం సంతోషం
- వెంకటేష్, చార్టెడ్ అకౌంటెంట్
గతంలో ప్రకటించిన విధంగా కేంద్ర ప్రభుత్వం నల్లధనంపై ఉక్కుపాదం మోపడం సంతోషం. నల్లధనం బయటకు రావడానికి ప్రభుత్వం చేసిన కృషి అపళీకృతం అయింది. స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న ధనం కన్నా మన దేశంలోనే అధికంగా నల్లధనం ఉందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల్లో రూ.500, వెయ్యి నోట్లు డిపాజిట్ చేయనివారికి ఇక ఇబ్బందే. ఆదాయ ప్రకటిత పథకాన్ని చాలామంది సద్వినియోగం చేసుకోకపోవడం వద్ద ఇప్పుడు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. విదేశాల నుంచి అధికంగా వచ్చే నకిలీ నోట్ల చలామణికి చెక్ పడుతుంది.
ప్రజలకు మంచి జరుగుంది
- కె.నాగేంద్ర, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి.
ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలకు మంచి జరుగుంది. గతంలో సామాన్యులు, రైతులు నకిలీ నోట్ల చాలా ఇబ్బందులు పడేవారు. ఈ సమస్య నుంచి వీరికి ఉపశమనం కలిగినట్లైంది.
చట్టబద్ధంగా వ్యవహరించే వారికి ఆనందం
- ఏమినేని వెంకటేష్, మేనేజింగ్ డైరెక్టర్, ఎస్‌ఆర్.కన్స్‌ట్రక్షన్
ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లించేవారికి చాలా మంచి జరుగుతుంది. చట్టబద్ధంగా వ్యవహరించే వారికి కేంద్రం నిర్ణయం ఆనందం కలిగించింది. ఇక లంచాలు తీసుకునే అధికారులు, నల్లధనాన్ని కూడబెట్టే రాజకీయ నేతలు ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే. 40 ఏళ్ల క్రితం జనతా ప్రభుత్వం ఒకసారి ఇలాంటి నిర్ణయం తీసుకుందని, కేంద్రం ఇలాంటి నిర్ణయమే తీసుకోవడం హర్షణీయం.
ప్రభుత్వ స్వాగతిస్తున్నాం
- సాకే.నరేష్, ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రూ.500, రూ.వెయ్యి నోట్ల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం. అదే సమయంలో రూ.2వేల నోట్లను ప్రవేశపెడుతుండటం వల్ల కొంత కాలానికైనా తిరిగి నల్లధనం కూడబెట్టుకునే అవకాశం లేకపోలేదు. కొత్తనోట్లు చాలామణిలోకి రావడం ఆర్థిక వ్యవస్థకు బలోపేతం కావడానికి దోహదపతాయి. మార్కెట్‌లో నల్లధనాన్ని నియంత్రించడానికి తరచూ భద్రతతో కూడిన కొత్త నోట్లు మార్కెట్‌లోకి విడుదల చేస్తే మంచిది.