అనంతపురం

ప్రణాళిక లేకుండా నోట్ల రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, నవంబర్ 13: కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక లేకుండా రూ.500, వెయ్యి నోట్లు రద్దు చేయడంతో జనం చిల్లర కోసం తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తోందని పిసిసి చీఫ్ రఘవీరారెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని ఎస్‌బిఐ ప్రధాన బ్రాంచ్‌కి సామాన్య, మధ్యతరగతి ప్రజలు నోట్ల మార్పు కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించారు. బ్యాంక్ తెరిచే సమయానికి స్టేట్ బ్యాంక్‌కు చేరుకొన్న రఘవీరారెడ్డి అక్కడి క్యూలో నోట్లను మార్చుకోవడానికి వచ్చిన మహిళల సమస్యలను ఆరా తీశారు. నగరానికి చెందిన తమ బాధలు చెప్పగా ఆవేదన వ్యక్తం చేశారు. కూలీనాలి చేసుకుని జీవనం సాగించే మేము ఇలా తమ డబ్బును మార్పిడి చేసుకోవడానికి పను లు వదులుకోవాల్సి వస్తోందన్నారు. ఇక్కడ విత్‌డ్రాయల్ ఫారాలు రెండు రూపాయలు పెట్టి బయట జిరాక్స్ కేం ద్రాల్లో కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు పలువురిని కలిసి వారివారి సమస్యలను తెలుసుకొన్నారు. అనంతరం బ్యాంక్‌లోకి వెళ్లి అక్కడ కౌంటర్లను పరిశీలించారు. నోట్ల మార్పు కోసం 8 కౌంటర్లు, 8 విత్ డ్రాయల్స్, 3 డిపాజిట్లు, 2 చలానా కౌంటర్లు ఏర్పాటుచేసినట్లు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాసులు రఘవీరారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. కాని ఇక్కడ బ్యాంక్‌లో తగినంత డబ్బు లేదన్న విషయం తెలుసుకొన్న రఘవీరారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్టేట్ బ్యాంక్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం, ఆర్‌బిఐ ఓ ప్రణాళిక లేకుండా పెద్ద నోట్లను రద్దు చేశాయని దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల కష్టాలు రెట్టింపు చేశారన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నికల ముందు నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసిందన్నారు. విదేశాల్లో 80 లక్షల కోట్లు వుందన్న సంగతి కేంద్రానికి తెలియంది కాదన్నారు. ఇప్పటి వరకు ఎంత వెనక్కి తెప్పించారని, జనధన్ ఖాతాలు ఆర్భాటంగా ప్రధాని ప్రజలచే ఆరంభించారని, ఒక్కొక్కరి ఖాతాలోకి 15 లక్షల మేర డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఎక్కడ అమలు అయ్యిందో, సామాన్య జనాన్ని ఎలా మోసం చేశారో ఈ రెండు సంఘటనలే నిదర్శనం అన్నారు. నాలుగు రోజులుగా ఉప్పు, పప్పుకి చిల్లర సమస్యతో కేజీ ఉప్పు రూ.250 అమ్మడం జరిగిందన్నారు. ఇక ఆసుపత్రుల్లో పిల్లలు చనిపోతున్నారన్నారు. ఎంత తప్పుడు నిర్ణయం తీసుకొన్నామో ప్రభుత్వానికి త్వరలోనే పూర్తి స్థాయిలో తెలుస్తుందన్నారు. దేశానికి సంబంధించిన విషయంపై ఇంత నిర్లక్ష్యాన్ని చూపించటం నిజంగా దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కోటా సత్యం, పిసిసి సభ్యులు రమణ తదితరులు పాల్గొన్నారు.
16న నారా లోకేష్ రాక
* ఏర్పాట్లు పరిశీలన
అనంతపురం కల్చరల్, నవంబర్ 13: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌బాబు ఈ నెల 16న జిల్లాకు రానున్నట్లు టిడిపి జిల్లా అధ్యక్షులు బికె.పార్థసారథి ప్రకటన ద్వారా ఆదివారం తెలిపారు. ఈ నెల 16న ఉదయం నగరానికి చేరుకుని పివికెకె కళాశాలలో జరిగే విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. తర్వాత రాంనగర్ 80 ఫీట్ రోడ్‌లో గల ఎస్‌ఆర్ కనె్వన్షన్ హాల్‌లో మధ్యాహ్నం 12.15 నుండి 2.30 వరకు పార్టీ ద్వారా ఇన్సూరెన్స్ పొందిన లబ్దిదారులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారని, వారితో కలసి 2.30 నుండి 3.00 గంటల వరకు సహపంక్తి భోజనం చేస్తారని తెలిపారు. అనంతరం 3.00 నుండి 3.45 వరకు జన చైతన్య యాత్రలు, సభ్యత్వ నమోదుపై జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారన్నారు. ఆ తర్వాత సాయంత్రం 4.00 నుండి 5.30 వరకు రాప్తాడు నియోజకవర్గంలోని బండమీదపల్లి గ్రామంలో జరిగే జన చైతన్య యాత్రలో లోకేష్ పాల్గొంటారని ఆయన తెలిపారు. నారా లోకేష్ రాక కోసం జరుగుతున్న ఏర్పాట్లను పార్టీ నాయకులు ఆదివారం పరిశీలించారు.

అర్హులందరికీ రేషన్‌కార్డులు, పింఛన్లు
* రూ.500 కోట్లతో చంద్రన్న కానుకలు * మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి
మడకశిర, నవంబర్ 13 : రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్‌కార్డులు, పింఛన్ లు అందజేస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఆదివారం మడకశి ర మండలం గోవిందపురంలో నిర్వహించిన జన చైతన్యయాత్రలో ఆయ న మాట్లాడుతూ టిడిపి అధికారం చేపట్టిన 29 నెలల్లో ఎన్నో ప్రజాభ్యుదయ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. వాటి గురించి ప్రజలకు తెలియజేసేందుకు యాత్రలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో సమస్యలు తెలుసుకుని మరో 31 నెలల్లో పరిష్కరిస్తామన్నారు. వచ్చే సంక్రాంతికి రూ.500 కోట్లతో చంద్రన్న సంక్రాంతి కానుకలు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 43.50 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, ఈ సంఖ్యను మరింత పెంచనున్నట్లు తెలిపారు. చంద్రన్న బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ రూ.15 చెల్లించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టిడిపి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తోందని, రైతులకు విత్తనాలు, ఎరువులు తదితర వాటిని రాయితీతో అందజేస్తున్నట్లు చెప్పారు. భూగర్భజలాలు పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన చెరువులు, కుంటల మరమ్మతుల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందచేస్తామని తెలిపారు. దేశంలో ఎవరూ చేయని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో హంద్రీనీవా కాలువను 2017 నాటికి పూర్తి చేసి నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీరు అందిస్తామన్నారు. జిల్లాలో 5 వేల కిలోమీటర్ల సిమెంటు రహదారులను నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ధి చేసే వారికి ప్రజలు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న, నాయకులు రామాంజినేయులు, ఎల్లోటి ఆదినారాయణ, రామక్రిష్ణ, నాగలింగాచారి, ప్రత్తికుంట జయసింహ, పలువురు సర్పంచ్‌లు, ఎపీటీసీ పాల్గొన్నారు.