అనంతపురం

పెద్ద నోట్లు రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, నవంబర్ 14:దేశంలో పెద్దనోట్ల చెలామణి వద్దని, వాటిని రద్దు చేసి చిన్న నోట్లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని కోరుతూ పిసిసి అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి సోమవారం మడకశిర స్టేట్ బ్యాంక్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోదీ నల్లధనం వెలికితీయడానికి రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంతో ధనికులు, నల్ల కుబేరులకు ఇబ్బందులు ఏమీ లేదని, కేవలం సామాన్య ప్రజలు మాత్రమే ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ సుబ్రమణ్యంతో రఘువీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ చిన్న నోట్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. నాయకులు మంజునాథ్, అక్రంఖాన్, నాగరాజు, నాగేంద్ర, తిప్పేనరసప్ప, మైలారప్ప, ఈశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు.