అనంతపురం

లేపాక్షి ఆలయం అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేపాక్షి, నవంబర్ 14:శిల్పకళారామంగా పేరొందిన లేపాక్షి వీరభద్రాలయాన్ని సోమవారం పురాణ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వర్‌రావు సందర్శించారు. ఆయనకు ఆలయ ప్రధానార్చకులు సూర్యప్రకాశ్ ఆలయ చరిత్రను వివరించారు. ఆయన మాట్లాడుతూ, లేపాక్షి ఆలయంలోని శిల్పాలు, తైలవర్ణ చిత్రా లు, అసంపూర్తి కల్యాణ మంటపం, లత మంటపం, ఏడు పడగల నాగేంద్రుడు, వేలాడే స్తంభం, గర్భగుడి పైకప్పుకు వేసిన 24 అడుగుల వీరభద్రస్వామి తైలవర్ణ చిత్రం మహాద్భుతమని ప్రశంసించారు. ఆయన దుర్గాదేవి, వీరభద్రస్వాములకు ప్రత్యేక పూ జలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో దుశ్శాలువతో సన్మానించారు. లేపాక్షి నంది విగ్రహాన్ని చూసిన వెంటనే ఆనంద పరవశుడై ప్రపంచంలోనే ఇంతటి మహోన్నతమైన నంది విగ్రహం మరెక్కడా లేదని ఆయన అభివర్ణించారు. తహసీల్దార్ ఆనందకుమార్, ఎంపిడిఓ వెంకటలక్ష్మమ్మ, జెఏసి సభ్యులు ఉన్నారు. కాగా కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని తహసీల్దార్ ఆనందకుమార్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వినియోగం గావించారు.