అనంతపురం

అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లకు కేరాఫ్ కదిరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, డిసెంబర్ 4: అక్రమ లే ఔట్లకు కేరాఫ్‌గా కదిరి మున్సిపాలిటీ నిలిచిందని చెప్పుకోవచ్చు. మామూళ్లు ఇస్తే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతి లేకుండా యధేచ్ఛగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టవచ్చు. కదిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా షేక్ సురియా భాను బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అక్రమ నిర్మాణాలు, లే ఔట్లు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. దాదాపు 500 పైగా పట్టణంలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతుంటే వాటిలో కేవలం 22 మంది మాత్రమే టౌన్ ప్లానింగ్‌కు దరఖాస్తు చేసుకోగా వారిలో 12 మందికి మాత్రమే అధికారులు అనుమతిచ్చారు. దీన్నిబట్టి అక్రమ నిర్మాణాలకు ఏ స్థాయి లో నిర్మిస్తున్నారో ఇట్టే తెలుస్తోంది. మా మూళ్లు ఇస్తే ప్రభుత్వ స్థలంకైనా టౌన్ ప్లానింగ్ అనుమతులు ఇస్తున్నార న్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. రైల్వే స్టేషన్ రోడ్డులో ప్రభుత్వ స్థలంలో వున్న మరుగుదొడ్లకు ఇటీవల కాలంలో టౌన్ ప్లానింగ్ అధికారులకు అనుమతులు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. పదుల సంఖ్యలో ఇళ్లకు అనుమతిస్తే కొంత మొత్తం డబ్బు వస్తుందని ఆలోచించారేమో ఏకంగా అక్రమ లే ఔట్లకు ప్రోత్సహిస్తూ భారీ మొత్తంలో వారి నుండి ముడుపులు తీసుకొని పరోక్షంగా సహకరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందూపురం రోడ్డులోని వ్యవసాయ పరిశోధన కేంద్రం వద్ద అక్రమంగా లే ఔట్లు వేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. అదే మార్గంలో ఎంపిడిఓ కార్యాలయం పక్కనే ప్రభుత్వ స్థలంను కలుపుకొని అక్రమంగా లే ఔట్లు వేసినా వారి నుండి మామూళ్లు తీసుకొని వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు, పాలకులు వెనుకడుగు వేస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. సామాన్యుడికి ప్రభుత్వం ఇచ్చిన పట్టాలో పునాదులు వేసుకుంటే తమ అనుమతి లేకుండా పునాదులు వేస్తున్నావంటూ అడ్డుకుంటున్న అధికారులు ఏకంగా మున్సిపల్ ఆదాయానికి గండికొట్టి అక్రమంగా లే ఔట్లు వేస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తూ మామూళ్ల మత్తులో అధికారులు, కమీషన్ల మత్తులో పాలకులు ఉన్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. మున్సిపాలిటీలోని మున్సిపల్ పాలకులు కేవలం కాంట్రాక్ట్ పనులు, కమీషన్లు తప్పా లక్షల రూపాయలు మున్సిపల్ ఆదాయానికి అక్రమ లే ఔట్లతో రియాల్టర్లు గండి కొడుతున్నా తమ స్వలాభం కోసం పాలకులు పట్టించుకోలేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. సాధారణంగా వ్యవసాయ భూముల్లో లే ఔట్లు వేయాలంటే ఆ భూమిని కమర్షల్‌గా మార్చుకొని మున్సిపాలిటీకి రాయల్టీని చెల్లించాల్సి వుంటుంది. దీంతోపాటు మున్సిపల్ లే ఔట్ అనుమతి తీసుకుంటే ఆ స్థలంలో దాదాపు 30 అడుగుల వెడల్పు గల రోడ్డు, పార్కు, ప్రభుత్వ భవనాలకు సంబంధించిన కొంత స్థలాన్ని కేటాయించాల్సి వస్తుంది. కానీ రియాల్టర్లు లే ఔట్లకు మున్సిపల్ అనుమతి తీసుకోకుండా ముడుపులు చెల్లించుకొని అక్రమ మార్గంలో తమ పనులు సాఫీగా జరుపుకుంటున్నారు. హిందూపురం రోడ్డులోని వ్యవసాయ పరిశోధనా కేంద్రం సమీపంలో వ్యవసాయ భూమిలో అనుమతి లేకుండా లే ఔట్లు వేసినా మున్సిపల్ అధికారులు ఆవైపు కనె్నత్తి చూసిన పాపాన పోలేదు. ఇదే అదునుగా భావించిన మరో కొంతమంది రియల్టర్లు హిందూపురం రోడ్డులోని ఎంపిడిఓ కార్యాలయం పక్కనే ప్రభుత్వ భూమిని కలుపుకొని లే ఔట్లు వేసినా అధికారులకు కన్పించడం లేదా అని పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ కౌన్సిలర్లు అక్రమ లే ఔట్లకు పరోక్షంగా మద్దతు తెలుపుతుండగా, తామేమి తక్కువ కాదంటూ ప్రతిపక్ష వైకాపా కౌన్సిలర్లు కేవలం కౌన్సిల్‌లో తూతూమంత్రంగా తమ వాణిని విన్పిస్తున్నారేకానీ దీనిపై ఆందోళన కానీ, అధికారులకు ఫిర్యాదులుగానీ చేయడంలేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి అక్రమ లే ఔట్లపై తమ వాణిని కౌన్సిల్‌లో విన్పించి మున్సిపల్ అభివృద్ధికి అవసరమైన రాయల్టీని కట్టిస్తే మున్సిపాలిటీకి లక్షల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం వుంది. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ వెంకటరమణను వివరణ కోరగా.. అక్రమ లే ఔట్లు వేసిన వారికి ఇప్పటికే నోటీసులు పంపామని, అనుమతి తీసుకోకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపిడిఓ కార్యాలయం పక్కన వేసిన లే ఔట్ చాలా వరకు రెవెన్యూ అధికారులకు సంబంధించిందన్నారు.