అనంతపురం

గుత్తి డీజిల్‌షెడ్‌కు పేరుతెచ్చిన కార్మికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, డిసెంబర్ 5: విధి నిర్వహణలో గుత్తి డీజిల్ షెడ్ కార్మికులు సమర్థవంతంగా పనిచేయడం ద్వారా గుత్తి డీజిల్ షెడ్ కీర్తి ప్రతిష్టలు భారత రైల్వేలో పతాకస్థాయిలో ఉన్నాయని గుంతకల్లు డివిజనల్ రైల్వే మేనేజర్ అమితాబ్‌ఒజా పేర్కొన్నారు. సోమవారం స్థానిక డీజిల్ షెడ్‌లో డీజిల్ షెడ్ 53వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గుత్తి డీజిల్ షెడ్ సీనియర్ డిఎంఇ రామకృష్ణరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. గుత్తి డీజిల్ షెడ్ కార్మికులు ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అద్యాయనం చేస్తూ అవసరమైన మార్పులను అమలుచేస్తూ డీజిల్ లోకోల నిర్వహణలో భారత రైల్వేలలో తమకుతామే సాటి అని తమ సమర్థతను చాటుకుంటున్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గుత్తి డీజిల్ షెడ్ కార్మికులు తమ వైఫల్యాలు లేకుండా లోకోలను నిర్వహించడంలో తమకు తామే సాటి అన్నారు. 1963లో కేవలం 20 లోకోలతో ప్రారంభమైన గుత్తి డీజిల్ షెడ్ అంచెలంచెలుగా తమ సమర్థతను పెంచుకుంటూ నేడు 140 లోకోలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నదన్నారు. వీటితోపాటుగా స్థానిక అధికారులు, డీజిల్ షెడ్ అధికారులు స్నేహపూర్వకమైన వాతావరణంలో షెడ్‌ను నిర్వహించడం శుభపరిణామమని ఎడిఆర్ సుబ్బరాయుడు ప్రసంసించారు. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ చైర్మన్ నారాయణ, ఎంప్లాయిస్ సంఘ్ కార్యదర్శి తిరుమలరెడ్డి, ఆల్‌ఇండియా ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు గద్దల నాగరాజు, ఒబిసి ఉద్యోగుల సంఘం నాయకులు చిన్నబాబులు డిఆర్‌ఎంకు వివిధ సమస్యలను విన్నవించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి సత్వరమైన చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డిఆర్‌ఎం డీజల్ షెడ్‌లో విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన పలువురు కార్మికులను మెమెంటో, ప్రసంసాపత్రాలను ఇచ్చి ప్రత్యేకంగా ప్రసంసించారు. పలువురికి నగదు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్‌ఎస్‌ఇలు రమేష్‌గుప్త, నాగేశ్వరరావు, నారాయణస్వామి, విజయానంద్‌తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు

బాబు నాయకత్వంలో
రాష్ట్రం మరింత అభివృద్ధి
చెనే్నకొత్తపల్లి, డిసెంబర్ 5: రాబోవు కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. సోమవారం చెనే్నకొత్తపల్లిలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని మంత్రి తనిఖీ చేశారు. ఆసుపత్రి నాణ్యత, నిర్మాణాలు, తదితర వాటిపై అధికారులు, కాంట్రాక్టర్లతో మంత్రి చర్చించారు. అలాగే వైద్య సిబ్బంది సకాలంలో విధులకు హాజరవుతున్నారా? లేదా అని మంత్రి ఆరా తీశారు. అనంతరం విలేఖరులతో మంత్రి మాట్లాడుతూ దశల వారీగా జిల్లాలోని చెరువులను నీటితో నింపుతామన్నారు. ముఖ్యంగా గొల్లపల్లి రిజర్వాయర్‌కు సమృద్ధిగా నీటిని నింపాలన్నదే తమ ముందున్న లక్ష్యమన్నారు. అంతేకాకుండా సాగు, తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపై ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్న ఉద్దేశ్యంతో మంత్రి కామినేని శ్రీనివాసరావు ప్రత్యేక చొరవ తీసుకొని చెనే్నకొత్తపల్లిలో రూ.3.55 కోట్లు కేటాయించడం జరిగిదన్నారు. ఆసుపత్రి పనులు పూర్తి అయ్యాయని, త్వరలోనే కామినేని చేతులమీదుగా ఈ ఆసుపత్రి భవనాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రోగులతో సఖ్యతగా మెలిగి వారి ఆరోగ్య విషయమై వైద్యులు కూడా తక్షణం స్పందించాలని వైద్య సిబ్బందికి మంత్రి ఆదేశించారు. గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ఈ ఆసుపత్రికి రోగులు రావడం జరుగుతుందని, 30 పడకల ఆసుపత్రి భవనం నిర్మించుకోవడం చాలా ఆనందకరమన్నారు. అలాగే గ్రామాల్లో జరుగుతున్న నగదు రహిత అవగాహన కార్యక్రమాలపై కూడా మంత్రి అధికారులతో సమీక్షించారు. నగదురహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో నవ్యాంధ్రను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. మంత్రి వెంట ఎంపీపీ అంకే అమరేంద్ర, జడ్పీటీసీ వెంకటరామిరెడ్డి, తహసీల్దార్ ఆదినారాయణ, ఎంపీడీవో రామాంజనేయులు, మార్కెట్‌యార్డు వైస్‌ఛైర్మన్ దండు ఓబులేసు, కన్వీనర్ శ్రీరాములు, అంకే ఆంజనేయులు, తదితరులు ఉన్నారు.