అనంతపురం

ఇంకెన్నాళ్లిలా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 5: పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో తెలీని పరిస్థితి నెల కొంది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవ డంతో నిత్యావసరాలకు డబ్బు కోసం జనం నానా అగచాట్లు పడుతున్నారు. నెల, నెలన్నరలో అన్నీ సర్దుకుంటాయని ఆశించినప్పటికీ.. పరిస్థితి మాత్రం కనుచూపు మేరలో పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు. కరెన్సీ చలామణి తగ్గిన నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలు చేయాలని భారత ప్రభుత్వం, ముఖ్యమంత్రి సహా విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ ఆ దిశగా ఆశించిన పురోగతి కనిపించడం లేదు. అంతేకాకుండా ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్లు, పేటిఎం, స్వైప్ మిషన్లు, ఇతరత్రా వినియోగంలో సైతం సాంకేతికపరమైన సమస్యలు ఎదురువుతున్నట్లు వినియోగదారులు వాపోతున్నారు. ముఖ్యంగా స్వైప్ మిషన్లు కూడా ఆశించిన స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో నగదు కోసం ఎటిఎంలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పని దుస్థితి నెలకొంది. దీంతో నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే దాకా, పలుచోట్ల ఎటిఎంలతో నగదు ఉన్న నేపథ్యంలో రాత్రిళ్లు చలిని సైతం లెక్కచేయక బారులుతీరుతున్నారు. ఒకటో తేదీ నుంచి ఉద్యోగులతోపాటు సామాజిక పింఛన్లు కూడా లబ్ధిదారులు ఖాతాల్లో వేయడంతో బ్యాంకుల వద్ద భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పింఛన్ల కోసం వచ్చిన వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు. ఇంకొందరు ఖాతాలు లేకపోవడంతో కొత్త ఖాతాలు తెరిచేందుకు ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా నగదు లావాదేవీలు చేసేందుకే బ్యాంకుల్లో ఉద్యోగులు సరిపోతుండటం, సమయమంతా అందుకే కేటాయిస్తుండటంతో అదనపు కౌంటర్ల ఏర్పాటు హుళక్కి అయింది. ఉన్న కౌంటర్ల నుంచే విత్‌డ్రాయల్స్, డిపాజిట్లు చేస్తున్నారు. ఉద్యోగులకు అత్యవసరంగా వేసిన రూ.10వేలతోపాటు వారి జీతాల నుంచి అదనంగా డబ్బు డ్రా చేసుకునేందుకు వెసులుబాటు రావడంతో విధులు కూడా మానుకుని బ్యాంకులకు వచ్చి పడిగాపులు కాస్తున్నారు. గంటల కొద్దీ క్యూల్లో నిల్చొంటే తప్ప నగదు చేతికందడం లేదని వాపోతున్నారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు ఏవీ బ్యాంకుల వద్ద కనిపించడం లేదు.
ఎటిఎంలతో నగదు కొరత
జిల్లా కేంద్రంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న వందలాది ఎటిఎంలో నగదు కొరత వేధిస్తోంది. ముఖ్యంగా నగదును చాలా తక్కువగా ఎటిఎంలో ఉంచుతుండటమే ఇందుకు కారణం. దశల వారీగా నగదును కొంచెంకొంచెంగా ఎటిఎంలలో పెడుతుండటంతో ఎప్పుడు నగదు ఉంటుందో, ఎప్పుడు అయిపోతుందో తెలీని అయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధిక సంఖ్యలో క్యూలు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా నగరంలో అన్ని రకాల బ్యాంకుల బ్రాంచ్‌లు కలిపి 200 పైబడి ఎటిఎంలు ఉంటున్నాయి. ఎస్‌బిఐకి సంబంధించి నగరంలో 160 దాకా ఎటిఎంలు ఉన్నాయి. అయితే వాటిలో నగదు అత్యల్పంగా పెడుతున్నారు. ఎస్‌బిఐ ఎటిఎంలలో రోజుకు రూ.10 నుంచి రూ.15 కోట్ల వరకు మాత్రమే పెడుతున్నట్లు బ్యాంకర్ల ద్వారా తెలుస్తోంది. దీంతో గంటల్లోనే నగదు అయిపోతోంది. ఇతర బ్యాంకుల ఎటి ఎంలలో కూడా నగదును కొంచెమే ఉంచుతున్నారు. ఈ పరిస్థితుల్లో నగదు త్వరగా అయిపోతుండటంతో నో క్యాష్ బోర్డులు పెట్టేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అత్యవసరాలకు డబ్బు కావాల్సిన వారు ఓపికున్నంత వరకు ఎన్ని ఎటిఎంలైనా తిరుగుతున్నారు. ఎక్కడైనా నగదు ఉండి, చేతికందితే 3మన అదృష్టం..2 అనుకుంటూ ఆ రోజు గడిపేస్తున్నారు.

నగదు కొరత రాకుండా చూస్తున్నాం
- ఎం.శ్రీనివాస్, ఎజిఎం, ఎస్‌బిఐ మెయిన్ బ్రాంచి, సాయినగర్,
అనంతపురం

ఖాతాదారులకు అవసరమైన నగదు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాము. ఎటిఎంలతో కొంత నగదు తక్కువగాను ఉంటోందన్నది వాస్తవం. బ్యాంకు శాఖలకు వస్తున్న ఖాతాదారులకు నగదు కొరత లేకుండా చూస్తున్నాం. ఒకేసారి రూ.24 వేలు కూడా ఇస్తున్నాం. తక్కువ ఇస్తే అదే వినియోగదారుడు మళ్లీ క్యూలో వస్తాడు. దీంతో ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతుందని భావించి గరిష్ట పరిమితి వరకు నగదు ఇచ్చే ఏర్పాటు చేశాము. పింఛన్లు, ఉద్యోగులకు సంబంధించి ఇబ్బందులున్నా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం.

బాలయ్యపై విమర్శలా..
హిందూపురం, డిసెంబర్ 5: రాష్ట్రంలోనే హిందూపురం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు నందమూరి బాలకృష్ణ కృషి చేస్తుంటే గత ప్రభుత్వంలో మంత్రి పదవులను అలంకరించి అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలు ప్రజా ధనాన్ని మింగిన రఘువీరారెడ్డి తమ ఎమ్మెల్యేపై పొంతన లేని విమర్శలు చేయడం హాస్యాస్పదమని బిసి కార్పొరేషన్ ఛైర్మన్ పామిశెట్టి రంగనాయకులు, టిడిపి నేతలు గ్రీన్‌పార్క్ నాగరాజు, జెఇ వెంకటస్వామి, అమర్‌నాథ్ తదితరులు ఎద్దేవా చేశారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ, శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో కోట్లాది రూపాయలు దండుకొని నాసిరకం పనులు చేయించిన రఘువీరాకు ఆ పథకం గురించి మాట్లాడే హక్కు లేదని ఆరోపించారు. ఎల్‌అండ్‌టి సంస్థతో కుమ్మక్కై హైదరాబాద్‌లో భవంతులను నిర్మించుకున్న రఘువీరా బాలకృష్ణ కుటుంబం నల్లధనం విచారణ సాగించాలని డిమాండ్ చేయడం శోచనీయమన్నారు. ఎన్టీఆర్ కుటుంబం సినిమా తదితర న్యాయబద్ధమైన రంగాల్లో కష్టపడి సొమ్మును సంపాదించుకొందని, మీలాగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయలేదన్నారు. రూ.32 కోట్లతో పిఎబిఆర్ పథకం పైపులైన్‌లను త్వరలోనే మరమ్మతులు చేసి సక్రమంగా నీటిని అందిస్తామన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో వుంచుకొని అధునాతనంగా కూరగాయల మార్కెట్ నిర్మించేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ కృషి చేశారని, అయితే 80 అడుగుల రహదారి ఆ ప్రాంతంలో అనువుగా లేకపోవడం వంటి కారణాల వల్ల ఆయన అనుకున్న నిర్ణయం కార్యరూపం దాల్చలేదన్నారు. అయితే ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యం కింద ఆదర్శవంతమైన కూరగాయల మార్కెట్ భవన సముదాయాన్ని నిర్మించేందుకు త్వరలోనే ఎమ్మెల్యే భూమిపూజ చేస్తారన్నారు. అదేవిధంగా ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫైలు స్థానిక మున్సిపాలిటీకి చేరిందని, ఎమ్మెల్యేతో చర్చించి ఆదర్శవంతమైన కూరగాయల మార్కెట్‌ను నిర్మించి గతంలో అక్కడ వ్యాపారాలు చేసుకున్న వ్యాపారులందరికీ న్యాయం చేస్తామన్నారు. ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి, రోడ్ల విస్తరణ, రహదారులు, మురికి కాలువల నిరా మణం కోసం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకొని రాష్ట్రంలోనే ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రథమస్థానాన్ని పొందారన్నారు. కేవలం ఒక్క మున్సిపాలిటీ పరిధిలోనే రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. దీన్ని ఓర్వ లేక రఘువీరా బాలకృష్ణపై విమర్శలు చేశారన్నారు. గతంలో హిందూపురం ప్రజలను, నాయకులను చీదరగొట్టి పిఎబిఆర్ ద్వారా తాగునీటిని కూడా రాకుండా చేసి అభివృద్ధికి సైతం తిరస్కరించిన రఘువీరా ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చి విమర్శలు చేస్తారంటూ ధ్వజమెత్తారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు మంత్రిగా ఉన్న రఘువీరా హిందూపురం నాయకులకు నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వకుండా తన గుప్పెట్లో పెట్టుకొని వివిధ వర్గాలతో ఇక్కడ లబ్ధి పొందారని ఆరోపించారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు ఆర్‌ఎంఎస్ షఫీవుల్లా, నజీర్ అహ్మద్, డిఇ రమేష్‌కుమార్, శ్రీనివాసరెడ్డి ఉన్నారు.