అనంతపురం

28న జెఎన్‌టియూ స్నాతకోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, డిసెంబర్ 9:జెఎన్‌టియూ అనంతపురం 8వ స్నాతకోత్సవం ఈ నెల 28న నిర్వహించనున్నట్లు జెఎన్‌టియూ విసి ఆచార్య ఎంఎంఎం సర్కార్ తెలిపారు. ఈ స్నాతకోత్సవం జెఎన్‌టియూ అడిటోరియంలో 28న ఉదయం 10 గంటల ప్రారంభమవుతుందని తెలిపారు. గోల్డ్ మెడల్స్ అందుకునే ప్రతి విద్యార్థి 9 గంటలలోగా ఆడిటోరంలో ఉండాలని, 27న ఆడిటోరియంలోకి వచ్చేందుకు పాస్‌లు సంబందిత ఆచార్యుల నుండి పొందాలన్నారు. జెఎన్‌టియూ పరిధిలోని బి.టెక్, బి.్ఫర్మసీ, ఇతర విభాగాల్లో మంచి మార్కులు సాధించి విద్యార్థులకు ప్రతి సంవత్సరం అందించే గోల్డ్‌మెడల్స్‌ను ఈ సంవత్సరంలో 30 మంది విద్యార్థులను ఏంపిక చేసినట్లు తెలిపారు. అందులో బి.టెక్ విభాగంలో నాగిరెడ్డి హరిబాబు, వెంకటరామిరెడ్డి, చంద్రశేఖరన్, షేక్‌బాష, ఎం.సయ్యద్ బాషపీర్, ఆర్.అనంత, గోవర్థన్‌రావు, సుబ్రమణ్యం, శివశంకర్‌రెడ్డిలకు, బి.్ఫర్మసీలో మాకి విజితకు, ఎస్‌బిహెచ్ గోల్డ్‌మెడల్ ఫర్ బెస్ట్ అకడమిక్ ఫర్‌ఫార్మర్‌గా పులివెందుల కళాశాలకు చెందిన విద్యార్థిని సుంకు స్రవంతికి, ఎండోమెంట్ గోల్డ్‌మెడల్(బి.టెక్) విభాగంలో 2015-16 సంవత్సరానికిగాను గుంటూరు సుమశ్రీ, పన్నూర్ సుప్రి య, వేమిరెడ్డి అధిత్య వైష్ణవి, ఎం.వర్షిత, శ్రీహర్ష, పల్లె స్నేహభారతిలకు, ఎం డోమెంట్ గోల్డ్‌మెడల్స్(ఎం.టెక్) విభాగంలో టి.మునిజాహ్నవి, పిజి.మధుసూధన్‌రెడ్డి, ఆర్.నాగస్వాతిలకు అందజేస్తున్నారు. అలాగే 2015-16లో బి.టెక్ యూనివర్సిటీ టాపర్‌లో సివిల్ విభాగంలో పొన్నూర్‌రు సుప్రీయ, ఈఈఈలో గుంటూరు సుమశ్రీ, మెకానికల్‌లో ఎం.వర్షత, ఈసిఈలో గుత్తా వౌనిక, కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో వేమారెడ్డి అథిత్య వైష్ణవి, కెమికల్ ఇంజనీరింగ్‌లో పల్లె స్నేహభారతిలకు అందజేయనున్నట్లు తెలిపారు. వీటితో పాటు బెస్ట్ అకడమిక్ బాలికల విభాగంలో వేమారెడ్డి అథిత్య వైష్ణవికి, బాలుర విభాగంలో క్రాంతి వినీత్‌రెడ్డికి అందజేయనున్నట్లు తెలిపారు.
గుట్టుగా బిల్లుల జారీ!
అనంతపురంటౌన్, డిసెంబర్ 9: కార్పొరేషన్‌లో డిపార్ట్‌మెంట్, నామినేషన్ బిల్లులు తప్పించి టెండర్, గ్రాంటు బిల్లులు మాత్రమే జారీ చేస్తానన్న అంశంపై భీష్మించుకు కూర్చున్న కమిషనర్ సోమన్‌నారాయణ బదిలీపై వెళ్తూ గురువారం రాత్రి గుట్టుచప్పుడు కాకుం డా రూ. కోటి వరకు బిల్లులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కొన్ని డిపార్ట్‌మెంట్ బిల్లులు కూడా ఉన్నాయని సమాచారం. రూ. కోటి బిల్లుల వివరాలు అడిగినా అకౌంట్స్ సెక్షన్ పెదవి విప్పకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. గడచిన 2 నెలల కాలంగా బిల్లుల కోసం ప్రాధేయపడుతున్నా కమిషనర్ పెడచెవిన పెట్టారని పలువురు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్తే సమానంగా అన్ని బిల్లులు ఇవ్వాలని కోరినా విజిలెన్స్ బూచిగా చూపి జాప్యం చేశారన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమక్షంలో సైతం డిపార్ట్‌మెంట్, నామినేషన్ వర్కుల బిల్లులు చెల్లించే ప్రసక్తి లేదని తెగేసి చెప్పారు. చెత్త ట్రాక్టర్లకు 36 లక్షలు, అలాగే కొంతమంది అధికారుల డిపార్ట్‌మెంట్ బిల్లులు కూడా ఇచ్చారని తెలుస్తోంది. ఈ సమాచారం తెలపాలని కోరినా అధికారవర్గాలు పెదవి విప్పటం లేదు. చేసిన పనులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని ప్రాధేయపడుతున్నా ఉన్నతాధికారికి కరుణ కలుగ లేదని కాంట్రాక్టఠ్లు వాపోతున్నా రు. మొదటి నుంచి బిల్లులు ఇవ్వటానికి కుంటిసాకులు చెబుతూ వచ్చిన కమిషనర్ సోమన్‌నారాయణ బదిలీపై వెళ్తూ రాత్రికిరాత్రి ఏకంగా కోటి రూపాయల మొత్తంలో బిల్లులు ఇచ్చి వెళ్ళటం చర్చనీయాంశం గా మారింది. కాగా శుక్రవారం మేయర్ స్వరూప, ఎఫ్‌ఏసి కమిషనర్ సురేంద్రబాబు మాట్లాడుతూ కమిషనర్ అంచనాలకు మించి అభివృద్ధి పనుల బిల్లులు జారీ చేశారన్న వార్తల్లో వాస్తవం లేదని పేర్కొనటం విశేషం.
రాయల స్ఫూర్తితోనే అభివృద్ధి
పెనుకొండ, డిసెంబర్ 9:శ్రీకృష్ణదేవరాయల పాలన స్ఫూర్తితోనే తాము అభివృద్ధి పనులు చేపట్టామని పిసిసి అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలో జరిగిన శ్రీకృష్ణదేవరాయల పట్ట్భాషక మహోత్సవ వేడుకల సభలో ఆయన ప్రసంగించారు. అలనాడు రాయలు చేపట్టిన వ్యవసాయ, పరిపాలన వంటి అంశాల ఆధారంగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. రాయల కాలంలో సాంకేతిక పరిజ్ఞానం కొరవడినప్పటికీ ఎన్నో చెరువులు, కాలవలు నిర్మించారన్నారు. అదే స్ఫూర్తితో కాంగ్రెస్ హయాంలో నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి డ్యాంలు నిర్మించినట్లు తెలిపారు. ఇటీవల హంద్రీనీవా పథకం ద్వారా శ్రీశైలం నుండి జీడిపల్లి వరకు కృష్ణా జలాలు తీసుకువచ్చామన్నారు. అదే విధంగా గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీటిని అందించేందుకు 80 శాతం పనులు పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం రూ.1200 కోట్లతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి జేబులు నింపుకుందని ఆరోపించారు. ఇటీవల చంద్రబాబునాయుడి పర్యటనకు రూ. 4 కోట్లు ఖర్చు చేయడం దురదృష్టకరమన్నారు. 80 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టుకు అనంత వెంకటరెడ్డి పేరు పెట్టి ఉండగా టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత నామమాత్రపు పనులు చేసి ఎన్టీఆర్ సాగర్‌గా పేరు మార్చడం హేయమైన చర్య అన్నారు. టిడిపి చేపడుతున్న సంక్షేమ పథకాలు, నీరు-చెట్టు వంటి వాటి ద్వారా తూతూమంత్రంగా మరమ్మత్తులు చేపట్టి కోట్లాది రూపాయల బిల్లులు చేసుకొంటున్నారని ఆరోపించారు. పెనుకొండ కొండపైకి రూ.5.5 కోట్లతో రహదారి నిర్మించామన్నారు. అదే విధంగా లక్ష్మినరసింహస్వామి దేవాలయ నిర్మాణం, పర్యాటక రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వాలు ప్రజలకు అవసరమైన పనులు చేయాల్సి ఉందన్నారు. నల్లధనం పేరిట రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన మోదీ ప్రభుత్వం నల్లధనాన్ని వెలికితీయడం చేతకాకపోగా పేదలకు కష్టాలు మిగిల్చినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. కుబేరుల వద్ద ఇప్పటికే కోట్లాది రూపాయల్లో రూ.2 వేల నోట్లు లభ్యం కావడం ఇందుకు నిదర్శనమన్నారు. సభలో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ దూరదృష్టితో నీటి ప్రాజెక్టులు చేపట్టడం వల్లే రాష్ట్రంలో సంక్షోభం తలెత్తకుండా ఉందన్నారు. గత నాలుగు దశాబ్దాల క్రితమే హంద్రీనీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. మోదీ ప్రభుత్వం కుబేరుల వద్ద ఉన్న నల్లధనాన్ని వెలికితీసేందుకు కృషి చేయాలన్నారు. డిసిసి అధ్యక్షులు కోటా సత్యం మాట్లాడుతూ, టిడిపి నాయకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించారన్నారు. స్వప్రయోజనాలకు చేకూర్చే పనులకు మక్కువ చూపుతున్నారని విమర్శించారు. కాగా పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల పట్ట్భాషేక ఉత్సవాలు రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. చివరి రోజు పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద రాయల పతాకాన్ని రఘువీరా, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిలు ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించి రాయల విగ్రహానికి పూలమాలలు వేశారు. పట్టణంలో ర్యాలీ అంబేద్కర్, తెలుగుతల్లి, వైఎస్‌ఆర్ సర్కిళ్ల గుండా కొనసాగింది. ర్యాలీలో గొరవయ్యలు, కోలాటాలు, లంబాడీల నృత్యాలు, రాయల జెండాలు ప్రదర్శించారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు సుధాకర్, నాగారాజారెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కెటి శ్రీ్ధర్, నాయకులు చిన్న వెంకట్రాముడు, మహేశ్వర్‌రెడ్డి, నారాయణరెడ్డి, చంద్రకాంతమ్మ, సిపిఐ నాయకులు శ్రీరాములు, సిపిఎం నాయకులు హరి, ఉత్సవ కమిటీ సభ్యులు సుదర్శన్‌రెడ్డి, ఈశ్వరయ్య, రమణారెడ్డి, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
20 నుండి క్రిస్మస్ కానుక పంపిణీ
అనంతపురం సిటీ, డిసెంబర్ 9:రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 నుండి చౌకధరల దుకాణాల్లో తెల్లకార్డు కలిగిన క్రైస్తవులకు క్రిస్మస్ కానుకను, మిగిలిన వర్గాల వారికి జనవరి 1వ తేదీ నుండి సంక్రాంతి కానుకలు ఉచితంగా పంపిణీ అందజేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మంత్రి నివాసంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా పంపిణీ చేయనున్న సరకుల నాణ్యతను మంత్రి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ పంపిణీ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండి అర్హులందరికి ఉచిత సరకులు అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికి పండుగ నాడు పేదలు మరింత ఆనందంగా ఉండాలనేది రాష్టమ్రుఖ్యమంత్రి చంద్రబాబు అభిమతం అని తెలిపారు. ఇందుకుగాను చంద్రన్న కానుకల పేరుతో 6 రకాల వస్తువులను ఉచితంగా పేద ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. తెలగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి సర్వమత సమానతను పాటిస్తూ క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ పండుగలకు కానుకలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఒక కోటి 35 లక్షల కార్డుదారులకు 350కోట్ల ఖర్చులతో ఆరు రకాల సరకులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఒక్కొక్క కార్డుదారునికి 250విలువైన సరకులను ఒక బ్యాగ్‌లో పెట్టి అందజేయడం జరగుతుందని తెలిపారు. కందిపప్పు, శనగపప్పు, బెల్ల అరకిలో, పామోలిన్ ఆయిల్ అరలీటరు, కిలో గోధుమ పండి, నెయ్యి 100 గ్రామాలు ఒక బ్యాగ్‌తో కలిపి అందజేయడం జరుగుతుందన్నారు. ప్రజ సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పేద ప్రజల పట్ల ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మూడవసారి చంద్రన్న కానుకలను అందింజడం జరుగుతుందన్నారు. జిల్లా పౌరసఫరాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

డిజిటల్ గ్రామాల వైపు వేగంగా అడుగులు

అనంతపురం, డిసెంబరు 9:పెద్దనోట్ల రద్దుతో రోజువారీ ఖర్చుల కోసం జనం పడుతున్న పాట్ల నుంచి ఉపశమనం కలిగించి డిజిటల్ ట్రాన్సాక్షన్ వైపు వారిని మల్లించేందుకు జిల్లా యంత్రాంగం ముమ్మర యత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా జన్‌ధన్ ఖాతాలు మొదలు, పదేళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించేందుకు కలెక్టర్ కోన శశిధర్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్, జెసి-2తో పాటు రెవెన్యూ యంత్రాంగం, బ్యాంకుల అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆన్‌లైన్, డిజిటల్ లావాదేవీలకు ప్రజల్ని అలవాటు చేసే దిశగా అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలపై దృష్టిని కేంద్రీకరించారు. ఈ నెల 30 నాటికి పదేళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలని, అందరూ మొబైల్ బ్యాంకింగ్, ఇ-వ్యాలెట్ యాప్స్ ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు రూపే కార్డులను ఉపయోగించి లావాదేవీలు నిర్వహించేలా సమాయత్తం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించిన నేపథ్యంలో జిల్లాలో డిజిటల్ (నగదు రహిత) లావాదేవీలు పెంచేందుకు కృషి జరుగుతోంది. ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఖాతాలు లేని వారెందురున్నారన్న విషయంపై సర్వే శర వేగంగా సాగుతోంది. ఇందుకోసం జిల్లా కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి ఖాతాలు ఎంతమంది తెరిచారన్న విషయాన్ని విధిగా నమోదు చేస్తున్నారు. అధికారిక గణాంకాల మేరకు జిల్లాలో ప్రస్తుతం జనాభా లెక్కల మేరకు 40లక్షల మంది జనాభా ఉంది. ఈ నెల 1 నుంచి సామాజిక పింఛనుదారులకు సైతం పింఛన్‌ను వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. అంతేకాకుండా ప్రతి గ్రామం, నగరం, పట్టణంలో ఎంత మందికి అకౌంట్లు లేవన్న విషయాన్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా సర్వే చేశారు. వీరిలో 5.88 లక్షల మందికి బ్యాంకు అకౌంట్లు ఉన్నట్లు తేలింది. మరో 4.84 లక్షల మందికి అసలు బ్యాంకు ఖాతాలు లేవు. దీంతో అధికారులు వేగవంతంగా బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. ప్రత్యేకంగా అధికారుల్ని నియమించి దరఖాస్తుల్ని అక్కడికక్కడే పూరించి, ఇంట్రడ్యూజర్‌గా అధికారి సంతకం చేసి వెంటనే వాటిని బ్యాంకుకు చెందిన ఓ లైజన్ అధికారి ద్వారా పంపి ఖాతాలు తెరిపిస్తున్నారు. ఈ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా వేగవంతంగా సాగుతోంది. కాగా జిల్లా వ్యాప్తంగా అమ్మకం, కొనుగోళ్లు సాగించడానికి అవసరమైన స్వైప్ మిషన్ల కొరత భారీగా ఉంది. దీంతో వ్యాపార లావాదేవీలు పుంజుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 13,864 పోస్(స్వైప్) మిషన్లు అవసరమని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు కేవలం 604 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇంకా వేలాది స్వైప్ మిషన్లు రాకపోవడంతో వ్యాపార కార్యకలాపాలను స్వైప్ మిషన్ల ద్వారా సాగించాలనుకున్న అనేక మంది నిరాశ పడుతున్నారు. అక్కడక్కడా స్వైప్ మిషన్లు ఉన్న వారు కొందరు వాటిని అద్దెకు ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది. కాగా మరో 13వేల స్వైప్ మిషన్లు అందుబాటులోకి వస్తే చిన్నాచితకా వ్యాపారులు సైతం లావాదేవీలు చేసుకునే వీలుంది. కాగా స్వైప్ మిషన్ల కోసం ఇప్పటి వరకు 2261 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో కార్పొరేట్, నేషనల్ బ్యాంకులు మొత్తం 455 ఉన్నాయి. వీటిన్నింటికీ కలిసి మొత్తం 557 ఎటిఎంలు ఉన్నాయి. వీటిలో ఈ నెల 8న కేవలం 361 ఎటిఎంలు పని చేశాయి. సుమారు 200 వరకు ఎటిఎంలు మూతపడ్డాయని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా శుక్రవారం సైతం ఇదే పరిస్థితి కొనసాగింది. కొన్ని బ్యాంకుల ఎటి ఎంల వద్ద క్యూలు భారీగా దర్శనమిచ్చాయి. నగదు కొరతతో చాలా చోట్ల ఎటి ఎంలు మూత పడ్డాయి. పలు బ్యాంకులు కూడా నో క్యాష్, క్యాష్ నిల్ బోర్డులు తగిలించాయి. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కొన్ని బ్యాంకులు ఏకంగా తాళం వేసేసి తర్వాత తెరిచారు. కాగా శుక్రవారానికి జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోనూ కలిపి జన్‌ధన్ ఖాతాలు 5లక్షల 80 వేల 475, ఎస్‌బి, కరెంట్ అకౌంట్లు తదితరాలన్నీ కలిపి 48 లక్షల 87 వేల 842 ఖాతాలు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో కొత్త ఖాతాలను తెరిపించేందుకు చర్యలు వేగవంతంగా సాగుతున్నాయి.
శరవేగంగా బ్యాంకు ఖాతాలు
* నేటితో ఖాతాలు పూర్తి.. నేరుగా నగదు ‚

అనంతపురం, డిసెంబర్ 9:పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సామాజిక భద్రతా పథకం కింద పింఛను పొందే లబ్ధిదారుల సౌకర్యార్థం బ్యాంకుల్లో ఖాతాలు తెరిచే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. శనివారానికి జిల్లా వ్యాప్తంగా అందరు పింఛనుదారులకు ఖాతాలు తెరవడం పూర్తకానుంది. ఈ నెల 1 నుంచి ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద లబ్ధి పొందుతున్న వారందరికీ ఖాతాలు తెరిచి వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ముమ్మర చర్యలు చేపట్టారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 3,82,551 మంది పింఛనుదారులుండగా, ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు దాదాపు 3,39,394 మందికి నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వారి సమీప బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. శుక్రవారం ఒక్క రోజే 32వేలకు పైబడి ఖాతాలు తెరిచారు. మరో 12వేల మందికి ఖాతాలు తెరిచే ప్రక్రియ శర వేగంగా సాగుతోంది. గ్రామాలు, పట్టణాలు, అనంతపురం నగరంలోని వార్డుల్లో సంబంధిత ఎంపిడిఒలు, అధికారులు స్వయంగా లబ్ధిదారుల నుంచి బ్యాంకు ఖాతాల తెరిచేందుకు దరఖాస్తులు పూర్తి చేయిస్తున్నారు. ఆ వెంటనే శర వేగంగా వారికి ఖాతా నంబర్లు కేటాయించి అందులో పింఛను డబ్బు జమ చేస్తున్నారు. దీంతో బ్యాంకుల వద్ద పింఛను దారులు క్యూ కడుతున్నారు. అయితే నగదు నిల్వలు లేక పోవడంతో బ్యాంకుల వద్ద వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో గంటల తరబడి క్యూలో నిల్చొనలేక అవస్థలు పడక తప్పడం లేదు.
పెన్షన్ కోసం వెళ్తూ వృద్ధుడి మృతి
బుక్కరాయసముద్రం, డిసెంబర్ 9: ప్రభుత్వం అందించే రూ.1000 పెన్షన్ కోసం బ్యాంకు వద్దకు బయలుదేరిన బుక్కరాయసముద్రం మండలం చెదుళ్ల గ్రామానికి బండి కొండన్న(70) మార్గమధ్యంలోనే కింద పడి మృతి చెందాడు. ఈ విషయంపై స్థానికులు, గ్రామ సర్పంచ్ గుర్రప్ప, యంపిటిసి నారాయణస్వామిలు అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 3 రోజుల నుండి ప్రభుత్వం అందించే రూ.1000 పింఛను కోసం మండల కేంద్రంలోని బ్యాంకు వద్దకు తిరుగుతున్నాడు. గురువారం క్యూ లైనులో వెళ్లి డబ్బులుకి అందుతాయన్న సమయానికి బ్యాంకు అధికారులు నీ దగ్గర రూ.1000 ఉంటే ఇవ్వు నీకు రూ. 2వేలు ఇస్తామంటూ అనడంతో చేసేదేమీ లేక వెనుతిరిగాడు. తిరిగి ఉదయానే్న బ్యాంకు వద్దకు వెళ్తూ గ్రామ శివారులో కొండన్న పడి ఉన్నట్లు కుటుంబీకులకు సమాచారం అందింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న బండి కొండన్న మృతి చెందడంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
సర్వేను పరిశీలించిన జడ్పీ సిఇఓ
రొళ్ళ, డిసెంబర్ 9:మండలంలోని రత్నగిరి దళిత వాడలో జరుగుతున్న నగదు రహిత సర్వేను శుక్రవారం జడ్పీ సిఇఓ రామచంద్ర పరిశీలించారు. నగదు రహిత లావాదేవీలు సులభంగా ఉంటాయని, వాటిని అందరూ ఉపయోగించుకోవాలన్నారు. రూపే కార్డు, ఆన్‌లైన్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రాయితీలను అందిస్తున్నట్లు తెలిపారు. ఖాతాలు లేని ప్రజలు వెంటనే సమీపంలోని బ్యాంకుల్లో ఖాతాలు తెరచి రూపే కార్డులను పొందాలన్నారు. అనంతరం ఆయన రత్నగిరి కొల్హాపురి మహాలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఎంపిడిఓ సరస్వతి, ఇఓఆర్‌డి చంద్రశేఖర్, ఎంపిపి జిఎస్ పాండురంగప్ప, కార్యదర్శి నాగేంద్ర, మాజీ ఎంపిపి కిష్టప్ప పాల్గొన్నారు.
రేపటి నుండి భక్తరహళ్ళి
లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
మడకశిర, డిసెంబర్ 9:జిల్లాలో ప్రసిద్ధి గాంచిన భక్తరహళ్ళి లక్ష్మినరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయస్వామి దేవాలయాలు భక్తుల కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా వెలుగొందుతున్నాయి. మార్గశిర శుద్ధ త్రయోదశి ఆదివారం ఈనెల 11 నుండి 17వ తేదీ వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 1147-1539 మధ్య వ్యాసరాయులు శిష్య బృందంతో దక్షిణ దిశ నుండి ఉత్తర దిశగా ప్రయాణం చేస్తూ భక్తరహళ్ళి వద్ద పూజా సమయం కావడంతో తమ వద్ద ఉన్న లక్ష్మినరసింహస్వామి సాలగ్రామును ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. అప్పటి నుండి స్థానికులు ఇక్కడ పూజలు చేస్తూ వచ్చారు. అదే విధంగా భక్తరహళ్ళి సమీపంలో జిల్లేడుకుంటలో 1447-1539 మధ్యకాలంలో వ్యాసరాయ యతేంద్రులు జీవితకాలంలో 732ప్రాణ దేవుళ్ళను (ఆంజనేయస్వామి విగ్రహాలను) ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఆయా గ్రామాలు భక్తుల కొంగు బంగారంగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు స్వామి వార్లను దర్శించుకోవడానికి విచ్చేస్తుంటారు. బ్రహ్మోత్సవాల కోసం దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు మడకశిర, హిందూపురం ఆర్టీసీ డిపోల నుండి ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. కాగా భక్తరహళ్ళి లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భూతప్ప ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. వివిధ రోగాలతో బాధ పడుతున్న రోగులు, సంతానం లేని మహిళలు భూతప్పల కాలి స్పర్శ్య తగిలితే కోర్కెలు తీరుతాయన్నది భక్తుల విశ్వాసం. భక్తులు జ్యోతుల ఉత్సవం రోజు ఉపవాస దీక్షలతో చన్నీటి స్నానం ఆచరించి తడి దుస్తులతో నేలపై పడుకొంటారు. భూతప్పలు నాట్యం చేస్తూ ఆయా భక్తులపై నుండి నడుచుకొని వెళతారు.
ఈ నెల 11 నుండి 17వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. 11న ధ్వజారోహణం, అంకురార్పణ, హనుమాన్‌వ్రతం, అభిషేకాలు, 12న కళ్యాణోత్సవం, 13న బ్రహ్మరథోత్సవం, 14న జ్యోతులు, భూతప్పల ఉత్సవాలు, 15న పూల పల్లకి, గరుడోత్సవం, 16న నరసింహస్వామికి హారతులు, 17న వసంతోత్సవం, చక్రస్నానం వంటి పూజలు జరుగుతాయన్నారు.
అవినీతి రహిత భారతాన్ని నిర్మిద్దాం
అనంతపురం అర్బన్, డిసెంబర్ 9:ప్రతి ఒక్కరూ ప్రశ్నించే నైజం అలవరుచుకున్నప్పుడే అవినీతికి అడ్డుకట్ట పడుతుందని, అందరూ కలిసి అవినీతి రహిత భారతావనికి శ్రీకారం చుడతామని ఎయస్‌పి మాల్యాద్రి, ఎసిబి డియస్‌పి భాస్కర్‌రెడ్డి తెలిపారు. శనివారం నగరంలోని అవినీతి వారోత్సవాల ముగింపుకార్యక్రమం యస్‌యస్. బియన్ డిగ్రీ కళాశాలో నిర్వహించారు. అనితీని నిరోధకశాఖ డియస్‌పి భాస్కర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. సీనియర్ సివిల్ జడ్జీ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కమలాకర్‌రెడ్డి, ఎయస్‌పి మా ల్యాద్రి ముఖ్య అథితులుగా హాజరయ్యారు. ఎయస్‌పి మాల్యాద్రి మా ట్లాడుతూ యువతతోనే అవినీతి వ్యతిరేఖ సమాజం సాధ్యమవుతుందన్నా రు. దీనికి యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. సమాజంలో అన్ని రంగాల్లో అవినీతి పట్టిపీడిస్తుందన్నదని ఆవేధన వ్యక్తం చేశారు.
కమలాకర్‌రెడ్డి మాట్లాడుతూ నైతిక వలువలకు పట్టంకట్టే మనభారతదేశంలో అవినీతి వుండడం భాధకరం అన్నారు. ఆన్‌లైన్ కంప్యూటరైజడ్ ద్వారా ప్రజలు సేవలను పొందినట్లైతే అవినీతి రూపుమాపవచ్చాన్నారు. ప్రస్తుతం వీటివైపు ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయాన్నారు. ఎసిబి డిఎస్పీ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ నేటి యువత రాజ్యంగ పరంగా వున్న చట్టాలు, ప్రభుత్వ నియమ నిబంధనలపై కొంతమేరకైనా అవగాహన కలిగి వండాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లలకు, విద్యార్థులకు నైతిక విలువలు గురించి బోధించాలన్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారితో అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. వ్యాసరచన పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. గతంలో లంచగోండిలను పట్టించిన కొందరిని అభినందిస్తు వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పీపుల్స్ ఎగెనెస్టు కరప్షన్ (కొయంబత్తుర్) అధ్యక్షులు శ్రీకాంత్‌రెడ్డి, అవినీతి వ్యతిరేఖ సంఘాల నాయకులు షౌకత్ అలీ, కొండయ్య, ఇమ్రాన్‌ఖాన్, కళాశాల ప్రిన్సిపాల్ నాగత్రిశూలపాణి, పాల్గొన్నారు.
ఒప్పంద అధ్యాపకుల నిరసన
అనంతపురం సిటీ, డిసెంబర్ 9:కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను పరిష్కారం కోరుతూ గత వారం రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం మద్దత ఇవ్వడంతో స్థానక టవర్‌క్లాక్ వద్ద మానహారంతో నిరసన వ్యక్త చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల మనుగడ కొనసాగుతున్నదంటే కాంట్రాక్టు లెక్చరర్స్ వలననేని తెలిపారు.కాంట్రాక్టు లెక్చరర్స్ జెఎసి నాయకులు ఎర్రప్ప, రామాంజినేయులు, షాలెంరాజు, హనుమంతరెడ్డి, రవిరాజు, వేణుగోపాల్, అక్బర్, నాగరాజునాయక్, రమణ, సుబ్రమణ్యం, మైథిలి, శైలజ, రేణుకాదేవి, ఎఐఎవైఎఫ్ నాయకులు ప్రసాద్, కార్యదర్శి రమణ, చాంద్‌బాషా పాల్గొన్నారు.

కేరళలో
రోడ్డు ప్రమాదం..వైకాపా యువనేత మృతి
ధర్మవరంరూరల్, డిసెంబర్ 9: అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్తూ తమిళనాడులోని దిండిగళ్ వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు ధర్మవరం యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ధర్మవరం మండలం రేగాటిపల్లి గ్రామానికి చెందిన రాష్ట్ర వైకాపా విద్యార్థివిభాగ్ ఫ్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి(28), పట్టణంలోని ఎర్రగుంట కాలనీకి చెందిన కారుడ్రైవర్ మోహన్‌రెడ్డి(25) ఉన్నారు. అమరనాథ్‌రెడ్డి, వినయ్‌గౌడ్, శ్రీకాంత్‌రెడ్డికి గాయాలయ్యాయి. బంధువులు, మిత్రులు తెలిపిన సమాచారం మేరకు గురువారం ఉదయం పట్టణంలోని అయ్యప్ప దేవాలయం వద్ద వీరు ఐదుగురు ఇరుముడులు కట్టుకుని అయ్యప్ప దర్శనానికి ఇండిగోకారులో వెళ్లారు. దిండిగళ్ వద్ద ముం దువెళ్తున్న వాహనం డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఇండిగోకారు దూసుకెళ్లి ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ మోహన్‌రెడ్డితో పాటు ముందు కూర్చున్న నరసింహారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. అర్దరాత్రి సమయంలో పిడుగులా వచ్చిన వార్తతో నరసింహారెడ్డి తల్లిదండ్రులు భాస్కర్‌రెడ్డి, శివమ్మ విలపించారు. వైసీపీ విద్యా ర్థి విభాగం నాయకుడు నరసింహారెడ్డితో పాటు అమరనాథ్‌రెడ్డి, వినోద్‌గౌడ్ విద్యార్థివిభాగంలోనే చురుగ్గా పాల్గొంటుండడంతో పట్టణంతో పాటు జిల్లాకేంద్రంలోని విద్యార్థిసంఘాల నాయకులు, ప్రముఖులు వీరి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఎటిఎంకు పిండం!
అనంతపురం సిటీ, డిసెంబర్ 9:దేశంలో కరెన్సీ సంక్షోభానికి కారకులైన ప్రధాని నరేంద్రమోదీ భవిష్యత్తులో ప్రజలు పిండం పెడతారని ఎఐవైఎఫ్ నాయకులు హెచ్చరించారు. శుక్రవారం స్థానిక రెండవ రోడ్డులోని డబ్బులేని ఎటిఎంలకు ఎఐవైఎఫ్ నాయకులు పిండ ప్రధానం చేసి వినూత్న నిరసన తెలిపారు. ఎఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ మాట్లాడుతూ నల్లకుబేరులు, అవినీతి పరులను అణచివేస్తామని గత నెల 8న ప్రధాని పెద్దనోట్లను రద్దు చేశారన్నారు. నెలరోజులు పూర్తియినా సామాన్య ఫ్రజలు కరెన్సీ కోసం బ్యాంకుల ముందు రోజుల తరబడి క్యూలలో నిలబడుతున్నారని తెలిపారు. క్యూలలో నిలబడి కొంత మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మరణాలకు ప్రధాని మోదీ బాధ్యత వహించి, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కరెన్సీ కష్టాలు త్వరితగతిన తీర్చేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, నాయకులు చాంద్‌బాషా, సంతోష్, దుర్గాప్రసాద్, నాగరాజు, కేశవ్, మన్సూర్, రాకేష్ పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
గుడిబండ, డిసెంబర్ 9:ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కెకె పాళ్యం ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల చనువుగా ఉంటూ లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియడంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి ఆ ఉపాధ్యాయుడిని మందలించి దేహశుద్ధి చేసినట్లు సమాచారం.
వాహనాల తనిఖీ
ఓబుళదేవరచెరువు,డిసెంబర్ 9:ఓడి చెరువులో శుక్రవారం కదిరి మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ శేషాద్రి వాహనాలు సీజ్‌చేసి జరిమానాలు విధించారు. లైసెన్సు లేని వాహనాలు, అధిక లోడ్, పర్మిట్లు లేని వాహనాలను సీజ్ చేశామన్నారు. లైసెన్స్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడిపితే అలాంటి వారిని గుర్తించి వారికి శాశ్వతంగా లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. ఆటోల్లో అధికలోడు వేసుకోరాదన్నారు.