అనంతపురం

‘ఉపాధి’ వేతనం పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 8 : మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కూలీలకు ప్రభుత్వం వేతనాలు పెంచుతూ జీవో జారీ చేసింది. ఇప్పటి వరకూ రూ.180గా ఉన్న వేతనాన్ని రూ.194కు పెంచుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి దినేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన వేతనాలను ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. దీంతోపాటు ఈ పథకం కింద నిర్థిష్టంగా పనుల వారీ వేతనాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో ముళ్లపొదల విస్తీర్ణాన్ని బట్టి చదరపు మీటరుకు గతంలో రూ.4.46 నుంచి రూ.16.80కి పెంచగా ఈఏడాది నుంచి రూ.4.81 నుంచి రూ.18.10 పెంచారు. ఇక భూమిలో ఎండిపోయిన మోడులను తీసివేయడానికి గతంలో రూ.130 నుంచి రూ.394.81 చెల్లించగా ఇప్పుడు రూ.140.10 నుంచి రూ.425.48కి పెంచారు. ఇక నీటి గుంతల తవ్వకానికి రూ.5.98 నుంచి రూ.8.17 వరకు కందకాలు, చెరువుల తవ్వకాలు, మొక్కలు నాటే గుంతలకు క్యూబిక్ మీటరుకు రూ.180 నుంచి రూ.194కు పెంచగా ఇతర పనులకు క్యూబిక్ మీటరుకు చెల్లించే వేతనం రూ.108 నుంచి రూ.114.23కు పెంచారు. ఇక చెరువుల తవ్వకాల లోతు ఒక మీటరు కంటే ఎక్కువగా ఉంటే క్యూబిక్ మీటరుకు గతంలో రూ.200 చెల్లించగా ఈసారి రూ.215.54కు, డీసిల్టింగ్‌కు క్యూబిక్ మీటరుకు రూ.106 నుంచి రూ.114.23కు పెంచారు. గట్టి నేలల్లో చేపట్టే వివిధ పనులకు క్యూబిక్ మీటరు వేతనాన్ని రూ.194కు పెంచారు. కందకాలు తవ్వితే గతంలో క్యూబిక్ మీటరుకు రూ.202.47 చెల్లిస్తే ఇప్పుడు రూ.218.20కి, ఒక మీటరు లోతు వరకు రూ.215.54 అంతకంటే మించితే రూ.237.09 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాతి నేలల్లో చేసే పనులకు క్యూబిక్ మీటరుకు రూ.204.76 నుంచి రూ.280.20 వరకు, కాలువలు, డ్రైనేజీ పనులకు క్యూబిక్ మీటరుకు రూ.84.82, ఇసుక నేలల్లో చేసే పనులకు క్యూబిక్ మీటరుకు రూ.64.09 చెల్లిస్తారు. వీటితోపాటు మట్టి, ఇసుక, గ్రావెల్‌ను రవాణా చేసే దూరాన్ని బట్టి వేతనాన్ని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక జిల్లాలో ఇప్పటివరకూ ఉపాధి హామీ కూలీలు కనీస వేతనాన్ని పూర్తిస్థాయిలో అందుకున్న దాఖలాలు లేవు. తాజాగా ప్రభుత్వం పెంచిన వేతనాల ప్రకారమైనా కూలీలకు కనీస వేతనం అందుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది