అనంతపురం

శాంతిభద్రతలపై పటిష్ట చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, డిసెంబర్ 23:జిల్లాలో శాంతిభద్రతలపై పట్టిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజశేఖర్‌బాబు తెలిపారు. శుక్రవారం పొలీసు కాన్ఫరెన్స్‌హాల్‌లో డిఎస్పీలు, సిఐలతో ఎస్‌పి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధుల పట్ల సిబ్బంది పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. నేరాలకు పాల్పడే వారిపట్ల ముందస్తు సమాచారాన్ని సేకరించి వారికి అడ్డుకట్టవేయాలన్నారు. అన్ని ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. డిఎస్పీలు మల్లికార్జునవర్మ, నాగసుబ్బన్న, నరసింగప్ప, చిదానందరెడ్డి, వేణుగోపాల్, సుబ్బారావు, గంగయ్య, రామాంజినేయులు, సిఐలు పాల్గొన్నారు.
బావిలో పడి తల్లీకుమార్తె ఆత్మహత్య
పెనుకొండ, డిసెంబర్ 23 : మండల పరిధిలోని గుట్టూరుకు చెందిన లక్ష్మీరెడ్డి భార్య సరోజ (30), కుమార్తె దివ్యశ్రీ (7) బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఇంట్లో ఘర్షణ పడి తల్లీకుమార్తె ఇల్లు వదిలి వెళ్లిపోయారు. అప్పటి నుంచి సమీప బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకుండా పోయింది. అయితే శుక్రవారం గ్రామ సమీపంలోని బావిలో సరోజ, దివ్యశ్రీలు శవమై కనిపించారు. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు తెలిపారు. సరోజది అదే గ్రామం కాగా మేనమామ లక్ష్మీరెడ్డిని ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పసికందు శవం లభ్యం
కణేకల్లు, డిసెంబర్ 23 : అప్పుడే కళ్లు తెరుస్తూ ప్రపంచాన్ని చూడాలనుకునే పసికందు ప్రపంచాన్ని చూడకనే భూమిపై నూకలు చెల్లిన ఘటన కణేకల్లు మండలంలో శుక్రవారం వెలుగుచూసింది. కణేకల్లు క్రాస్ నుంచి బళ్లారి వెళ్లే ప్రధాన రహదారి పక్కలో మూడు కిలోమీటర్ల దూరంలోని ఓ మోరి కింద ఆడ పసికందును వదిలివెళ్లడంతో శిశువు మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. ఎర్రగుంట గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై యువరాజు సిబ్బందితో చేరుకుని పరిశీలించారు. పసికందు చనిపోయి నేటికి రెండు రోజులై ఉంటుందని ఎస్సై తెలిపారు. పసికందుకు మోకాళ్లపై కుక్కలు తిన్నట్లు ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
గాండ్లపెంట, డిసెంబర్ 23:మండల పరిధిలోని వద్దిరెడ్డిపల్లికి చెందిన శ్రీనివాసులురెడ్డి(47) అనే రైతు శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మృతుడు శ్రీనివాసులురెడ్డి గ్రామ సమీపంలోని తన పొలంలో సాగు చేస్తున్న బొప్పాయి, వంకాయ పంటలకు నీటి తడులు అందించేందుకు పొలం వద్దకు వెళ్లాడు. విద్యుత్ వచ్చిన విషయం తెలుసుకుని విద్యుత్ మోటారు ఆన్ చేసేందుకు స్టార్టర్ వద్దకు వెళ్లాడు. అయితే విద్యుత్ స్టార్టర్‌కు కరెంట్ సరఫరా అవుతున్న విషయం తెలియని శ్రీనివాసులురెడ్డి స్టార్టర్‌ను ఆన్ చేసేందుకు పట్టుకోగా విద్యుదాఘాతంతో అక్కడే పడిపోయాడు. మోటారు ఆన్‌చేసి వస్తానని వెళ్లిన తన భర్త ఎంతసేపటికీ రాకపోవడంతో అతని భార్య రాధమ్మ మోటారు వద్దకు వెళ్లింది. అయితే షాక్‌కు గురై కిందపడిన శ్రీనివాసులురెడ్డిని చూసి ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో సమీపంలో పొలం పనులు చేసుకుంటున్న రైతులు, కూలీలు పరుగు పరుగునా అక్కడికి చేరుకున్నారు. శ్రీనివాసులురెడ్డిని పరిశీలించగా అప్పటికే ఆ రైతు మృతి చెందాడు. వెంటనే విషయాన్ని తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్‌ఐ రాజశేఖర్‌ల దృష్టికి తీసుకెళ్లగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీ వద్ద రైతు మృతదేహాన్ని పరిశీలించి కుటుంబాన్ని ఓదార్చారు. ప్రభుత్వం నుండి కుటుంబాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో వైకాపా సమన్వయకర్త డా.పి.వి సిద్దారెడ్డి రైతు పొలం వద్దకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి రైతు కుటుంబాన్ని పరామర్శించారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
పెనుకొండ, డిసెంబర్ 23 : పట్టణంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో షంషాద్ (35) మృతి చెందింది. ద్విచక్ర వాహనంలో అక్కాచెల్లెళ్లు షబానా, షంషాద్ హిందూపురం నుంచి పెనుకొండ దర్గాకు వస్తున్న సమయంలో షబానా అదుపుతప్పి కిందకు పడిపోగా వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. షబానా తీవ్రగాయాలకు గురైంది. వెంటనే ఆమెను పెనుకొండ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం హిందూపురం తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వేర్వేరు ఘటనల్లో ఇద్దరి ఆత్మహత్య
పెనుకొండ, డిసెంబర్ 23 : మండల పరిధిలోని గుట్టూరు రైల్వేస్టేషన్ సమీపంలోని కొత్తచెర్వు మండలం తలమర్లకు చెందిన రంగారెడ్డి (40) శుక్రవారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. హిందూపురం రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా పెనుకొండ మండల పరిధిలోని కురుబవాండ్లపల్లికి చెందిన ఈరచిన్నప్ప (28) శుక్రవారం గ్రామ సమీపంలో చెట్టుకు ఉరేసుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొనే్నళ్లుగా మూర్చ వ్యాధితో బాధ పడుతూ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కౌలు రైతు ఆత్మహత్య
బొమ్మనహాల్, డిసెంబర్ 23 : మండల పరిధిరోని గోనేహాల్ గ్రామానికి చెందిన కౌలు రైతు వడ్డే శివరాజ్(55) శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శివరాజ్ మూడు సంవత్సరాల నుంచి కౌలుకు భూమి తీసుకుని సాగు చేస్తున్నాడు. అయితే సకాలంలో వర్షాలు రాక కనీసం పెట్టిన పెట్టుబడులు సైతం రాకుండా పోయాయి. ఈనేపథ్యంలో రుణదాతల నుంచి ఒత్తిళ్లు అధికం కావడంతో మనస్థాపానికి గురైన శివరాజ్ శుక్రవారం పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న శివరాజ్‌ను గ్రామస్థులు గుర్తించి వైద్యచికిత్స నిమిత్తం బళ్లారికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై భార్య రాధమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని బళ్లారి విమ్స్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకని మృతి
అనంతపురం అర్బన్, డిసెంబర్ 23:టవర్‌క్లాక్ సమీపంలో వున్న ప్లై ఓవర్ ప్రతినిత్యం ప్రమాదాలకు కేరాఫ్‌గా మారుతోంది. అత్యంత రద్దీగా వుండే ఈ ప్లై ఓవర్ దగ్గర కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ట్రాఫిక్ పోలీసులు కనిపించరు. దీంతో ఇక్కడ నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటునే ఉంటాయి. శుక్రవారం రుద్రంపేటకు చెందిన తలారి గోవింద్‌రాజులు(58) పిటిసి సమీపంలోని ప్లై ఓవర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మృతుడు ఉదయం నగదుకోసం ఎటియమ్‌కు వచ్చి తీసుకుని తన ద్విచక్రవాహనంలో ఇంటికి వెలుతుండగా పిటిసి సమీపంలో డివైడర్‌కు ద్విచక్రవాహనం తగిలి కిందపడటంతో తలకు బలమైన గాయం అయ్యింది. తక్షణమే ఆసుపత్రికి తరలించినప్పటికి ప్రయోజనంలేకుండాపోయింది. ప్రమాదం జరిగిన గంటలోనే మృతిచెందాడు మృతునికి భార్యతో పాటు కొడుకు, కూతురు వున్నారు. వీరు దక్షణాఫ్రికాలో ఉన్నట్లు తెలిసింది. ట్రాఫిక్ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.