అనంతపురం

చంద్రబాబు భ్రమలో ఉన్నారు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ, డిసెంబర్ 25 : నల్లధనాన్ని తెల్లడబ్బుగా మార్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తామన్న భ్రమలో ఉన్నారని ఎమ్మెల్యే వై విశే్వశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం మండలంలోని బూదగవి గ్రామంలో నిర్వహించిన గడపగడపకూ వైకాపాలో ఆయన మాట్లాడుతూ సిఎం చంద్రబాబు సంక్షేమ పథకాలు, గ్రామాల అభివృద్ధిపై గొప్పలు చెబుతున్నారన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కారం కాక ప్రభుత్వంపై ప్రజలు పూర్తిగా విసుగు చెందుతున్నారన్నారు. క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలిస్తే అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని, రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం రూ.1000, 500 నోట్లను రద్దు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల కాలంలో ప్రాజెక్టుల నిర్మాణంలో ఇసుక అక్రమ రవాణాల్లో రూ.లక్షల కోట్లు అవినీతి జరుగుతోందన్నారు. పెద్దనోట్ల రద్దు విషయం చంద్రబాబుకు ముందే తెలుసునని, అందుకోసమే రూ.లక్షల కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేశారన్నారు. చంద్రబాబు చేస్తున్న అవినీతి అక్రమాలకు ప్రజలు విసుగుచెంది ఆగ్రహంగా ఉన్నారన్నారు. జన్మభూమి కమిటీలకు అన్ని అధికారాలు ఇచ్చి గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మార్చారన్నారు. చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా కన్వీనర్ నరసింహలు, జడ్పీటీసీ తిప్పయ్య, పట్టణ కన్వీనర్ తిమ్మప్ప, వైకాపా నాయకులు బసవరాజు, ధనుంజయ, రామంజినేయులు, నాగరాజు, శ్రీనివాసులు, సిద్దప్ప, మాబు పాల్గొన్నారు.

మహిళ ఆత్మహత్య
మడకశిర, డిసెంబర్ 25 : భర్త వేధింపులు తాళలేక మొదటి భార్య లక్ష్మీదేవమ్మ (24) గనే్నరు మొగ్గలు దుంచుకుని తిని శనివారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని భక్తరహళ్లికి చెందిన నరసింహమూర్తికి మూడేళ్ల క్రితం తడ గ్రామానికి చెందిన లక్ష్మీదేవితో వివాహమైంది. కొద్దిరోజులుగా నరసింహమూర్తి భార్యను పుట్టింటికి వెళ్లి డబ్బు తీసుకురావాలని వేధించేవాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేరని తెలపడంతో వేధింపులు అధికం కాగా మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మక్బూల్ బాషా తెలిపారు.
తమిళనాడులో రోడ్డు ప్రమాదం..
అయ్యప్ప భక్తుడి మృతి
గోరంట్ల, డిసెంబర్ 25 : తమిళనాడులోని సేలం వద్ద ఆదివారం తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గోరంట్లకు చెందిన అయ్యప్ప భక్తుడు టైలర్ వెంకటేష్ (34) మృతి చెందాడు. అయ్యప్ప మాల ధరించిన వెంకటేష్ తోటి భక్తులతో కలసి ఐదు రోజుల క్రితం పాదయాత్రతో శబరిమలైకు వెళ్లాడు. పాదయాత్ర బృందం సేలం దాటి వెళ్లిన తర్వాత ఆదివారం తెల్లవారుఝామున లారీ ఢీకొనడంతో వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహటిన బయలుదేరి వెళ్లారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రైలు కింద పడి యువకుడి మృతి
ధర్మవరం రూరల్, డిసెంబర్ 25: ధర్మవరం రైల్వే డివిజన్ పరిధిలోని ముదిగుబ్బ మండలం గుంజేపల్లి సమీపంలో ఆదివారం రైలు కింద పడి గుర్తుతెలియని యువకుడు మరణించినట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. సమాచారం తెలుసుకున్న ధర్మవరం రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళారు. ఉదయం ధర్మవరం నుండి తిరుపతికి వెళ్ళే ప్యాసింజర్ రైలు కింద 11గంటల సమయంలో గుంజేపల్లి సమీపంలో యువకుడు పడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. అయితే మృతి చెందిన యువకుని వివరాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
యువతి ఆత్మహత్య
పెద్దవడుగూరు, డిసెంబర్ 25 : మండల కేంద్రానికి చెందిన సూర్యనారాయణరెడ్డి కూతురు శాంతి (25) ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శాంతి డిగ్రీ పూర్తి చేసుకుని వివిధ కాంపిటీటివ్ పరీక్షల్లో విజయం సాధించలేకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విశ్రాంత సర్వేయర్ ఆత్మహత్య
యాడికి, డిసెంబర్ 25 : మండల కేంద్రంలోని ఆసుపత్రి కాలనీలో నివాసం ఉంటున్న విశ్రాంత సర్వేయర్ పీటర్ (65) ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు క్రిస్మస్ పండుగ సందర్భంగా కుటుంబీకులు, పిల్లలు ఎవరూ లేకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.