అనంతపురం

కాస్టింగ్ యంత్రాన్ని ఢీకొన్న లోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, డిసెంబర్ 27 : కాస్టింగ్ యంత్రాన్ని రైలు ఇంజిన్ ఢీకొన్న ఘటన గుంతకల్లు స్టేషన్‌లోని ఆర్‌సిడి పాయింట్ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కంకర, సిమెంట్ కలిపే కాస్టింగ్ యంత్రం నుజ్జునుజ్జయింది. గుంటూరు, తిరుపతికి సంబంధించిన కోచ్‌లను లూప్‌లైన్‌లో వదిలి, తిరిగి రెండు ఇంజిన్‌లను తీసుకుని వెనుక నుంచి రైలు లోకో బయలుదేరింది. అదే సమయంలో ఒకటవ నెంబర్ ప్లాట్‌ఫారంలో అఫ్రా న్ పనులు జరుగుతున్నాయి. దీంతో పనులకు సంబంధించిన కంకర కలిపే యంత్రం (కాస్టింగ్‌మిషన్)ను రైల్వే ట్రాక్ మీదుగా ఒకటవ నెంబర్ ప్లాట్‌ఫారం వైపు తరలించేందుకు డ్రైవర్ సురేంద్ర ట్రాక్ మీదకు తీసుకొచ్చాడు. దీంతో అప్పటికే అక్కడకు చేరుకున్న లోకో ఇంజన్లు కంకర కలిపే యంత్రాన్ని ఢీకొన్నాయి. ఈఘటనలో ముందు వైపు వున్న లోకో ఒకటి పట్టాలు తప్పడంతోపాటు కంకర మిషన్ నుజ్జునుజ్జయింది. డ్రైవర్ సురేంద్ర స్వల్పంగా గాయపడ్డాడు. గాయపడిన అతన్ని వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం అందుకున్న గుంతకల్లు రైల్వే డివిజినల్ మేనేజర్ అమిత్‌ఓజా, ఎడిఆర్‌ఎం సుబ్బరాయుడు, సీనియర్ డిఎంఇ గోపాల్, డిఎంఇ వెంకటరమణ, రైల్వే అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని
హోంగార్డు మృతి
నల్లచెరువు, డిసెంబర్ 27 : మండల పరిధిలోని పాత రైల్వే స్టేషన్ దగ్గర జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని గోపాల్‌నాయక్(40) మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న గోపాల్ నాయక్ మంగళవారం రాత్రి విధులను ముగించుకుని స్వగ్రామమైన బాలినేపల్లి దిగువతండాకు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా పాత రైల్వే స్టేషన్ దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ ప్రసాద్‌బాబు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రైలు కింద పడి వ్యక్తి మృతి
పామిడి, డిసెంబర్ 27: రైలు కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం పామిడి స్టేషన్ సమీపంలోని 242/2/3 మధ్యన చోటు చేసుకుంది. రైలు పట్టాల మధ్యన వ్యక్తి చనిపోయి ఉండటాన్ని గమనించిన కొందరు అక్కడకెళ్లి పరిశీలించి నేమళ్ళపల్లి ఇమాన్‌సాబ్ (35)గా గుర్తించారు. మృతదేహం గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఒంటిపై దుస్తులు లేకుండా పడివుందని సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జిఆర్‌పి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇమాన్‌సాబ్ మృతికి గల కారణాలు తెలియరాలేదు.

47వ డివిజన్‌లో పర్యటించిన మేయర్
* నీటి వృథాపై ట్యాప్ ఇన్‌స్పెక్టర్‌కు మెమో
అనంతపురంటౌన్, డిసెంబర్ 27: నగరంలోని 47వ డివిజన్ పరిధిలోని రంగస్వామి నగర్, సునీతా నగర్, రామాంజనేయ నగర్ కాలనీలలో పర్యటించి పారిశుద్ధ్యం పనులను పరిశీలించారు. పబ్లిక్ కొళాయిలలో వృథాగా నీరు పోతుండటం గమనించి ట్యాప్ ఇన్‌స్పెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాప్ ఇన్‌స్పెక్టర్ రామ్మోహన్‌కు మెమో జారీ చేయాలని ఆదేశించారు. పబ్లిక్ కొళాయిలను వెంటనే తొలగించి నీటి వృథాను అరికట్టాలని సూచించారు. పబ్లిక్ కొళాయిలపై ఆధారపడకుండా స్వంత కొళాయిలను వేయించుకోవాలని అన్నారు. మురుగు కాల్వలు శుభ్రం చేయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మేస్ర్తికి మెమో జారీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సురేంద్రబాబు, హెల్త్ఫాసర్ గంగాధరరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ గంగిరెడ్డి, జానయ్య, డిఇఇలు కిష్టప్ప, సురేంద్రనాథ్, ఎఇ మహదేవప్రసాద్ పాల్గొన్నారు.
ప్రైవేటు స్కూల్స్ క్యాలెండర్ ఆవిష్కరణ
అనంతపురం సిటీ, డిసెంబర్ 27: జిల్లా ప్రైవేటు పాఠశాలల సంఘం నూతన క్యాలెండర్‌ను మంగళవారం స్థానిక డిఇఓ కార్యాలయంలో డిఇఓ కె శామ్యూల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ నూతన క్యాలెండర్ అనేది ప్రతి ఒక్కరి అవసరమని, ఇందులో విద్యా విషయాలు అనేకమందికి ఉపయోపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలల సంఘం నాయకులు ప్రైవేటు పాఠశాలల ఎదుర్కొంటున్న సమస్యలను డిఇఓ దృష్టికి తీసుకెళ్లగా డిఇఓ సానుకూలంగా స్పందించి పరిష్కరానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గుత్తి, పెనుకొండ డిప్యూటి డిఇఓలుగా బాధ్యతలు చేపట్టిన డిప్యూటి డిఇఓలు చాంద్‌బాషా, నాగభూషణంలకు మర్వాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.గోపాల్‌రెడ్డి, నాయకులు రమణారెడ్డి, రవిచంద్రారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దారెడ్డి, భాస్కర్‌రెడ్డి, రంగనాథ్, రఫి, జానకిరాములు, బత్తలపల్లి లక్ష్మినారాయణ, పోతులయ్య, రామమమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.