అనంతపురం

నెట్టికంటి ఆలయంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, ఏప్రిల్ 8 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం ఉగాది ఉత్కవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవలో భాగంగా మహాభిషేకం, వజ్రకవచాలంకరణ, బంగారు కిరీట ధారణ, విశేష పుష్పలంకరణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దఎత్తున భక్తులు తరలిరావడంతో గోవిందనామస్మరణలతో ఆలయం మార్మోగింది. మధ్యాహ్నం అర్చన, మహానివేదన, మంగళ హారతి ఇచ్చారు. సాయంకాలం ఆలయ ఇఓ ముత్యాలరావు, వంశ పారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యురాలు సుగుణమ్మ, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆలయ వేదపండితులు పంచాంగ శ్రవణం, సుందరకాండ ప్రవచనం చేశారు. రాత్రి శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయస్వామిల శేషవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.
నేడు రథోత్సవం
ఆంజనేయస్వామి ఉగాది ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆల య అధికారులు తెలిపారు. ఉదయం యథావిధిగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం మహానివేదన, మంగళహారతి, సాయంకాలం రథాంగ హోమం, శ్రీసీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయస్వామి రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారం లంకాదహనం (బాణాసంచా వేడుక) నిర్వహించనున్నట్లు తెలిపారు.
మురడిలో...
డి.హీరేహాల్ : జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురడి ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఆలయ అధికారులు, సర్చంచ్ పద్మనాభరెడ్డి, వైస్ ఎంపిపి గంగాధర, పెద్దమడి ఆనందరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఆలయ గోపురం, ప్రాంగణాలకు వెల్ల వేసి భారీకేడ్లు ఏర్పాటు చేశారు. తాగునీరు, వైద్యం వంటి సేవలను సర్వం సిద్దం చేశారు. శుక్రవారం వేకువజాము నుంచే ఆలయంలో సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, పుష్పాలంకారణ, మహామంగళ హారతి, పంచాంగ శ్రవణం చేశారు. శనివారం 9న కలశ స్థాపన, ముత్యాల పల్లకి ఉత్సవాలు జరగనున్నాయి. ఆదివారం 10న స్వామివారి రథోత్సవం, సోమవారం 11న లంకాదహనంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అధికారి శ్రీనివాసులు తెలిపారు.
భక్తులతో కిటకిటలాడిన పెన్నోబిలం
ఉరవకొండ : దుర్ముఖినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండలంలోని పెన్నోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఇందులో భాగంగా ఆలయంలో తెల్లవారు జామున స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకం, వివిధ పుష్పాలతో అలంకరించారు. అనంతరం ప్రధాన అర్చకులు ద్వారకనాథ్ చార్యుల ఆధ్వర్యంలో అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేసిన అనంతరం పంచాంగ శ్రవణం చేశారు. కాగా స్వామి వారి దర్శనం కోసం కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కుబడులు తీర్చుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. అదేవిధంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలోని దిగువ ప్రాంతంలో ఉన్న ఉద్భవ లక్ష్మీదేవి ఆలయంలో అమ్మవారికి పట్టువస్త్రాలతో అలంకరించి పూజలు చేశారు. మండలంలోని చిన్న ముష్టూరు గ్రామం వద్ద ఉన్న కల్లబండ ఆంజనేయస్వామి ఆలయంలో రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి రథోత్సవాన్ని లాగారు. పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర, చౌడేశ్వరి దేవి, చిన్న చెరువు వద్ద ఉన్న ఆలయంలో పూజలు నిర్వహించారు.
ఘనంగా చౌడేశ్వరిదేవి రథోత్సవం
లేపాక్షి, ఏప్రిల్ 8 : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని చోళసముద్రంలో శుక్రవారం చౌడేశ్వరి దేవి బ్రహ్మరథోత్సవం ఘనంగా జరిగింది. ఆగమికులు సునీల్‌శర్మ నేతృత్వంలో వేద పండితులు చౌడేశ్వరిమాత విగ్రహానికి అభిషేకార్చనలు చేశారు. అనంతరం గణపతి ప్రార్థన, కలశార్చన, అగ్ని ప్రతిష్టాపన, మహా గణపతి, నవగ్రహ, మృత్యుంజయ, చౌడేశ్వరి మూలమంత్ర, కళా, మూర్తి, పతాంగ హోమాలు నిర్వహించారు. రథ సంప్రోక్షణ, కూష్మండబలి కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత గ్రామంలో కలశాలను ఊరేగించారు. ఆలయం నుంచి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి రథంపై ఉంచారు. భక్తజన సందోహం మధ్య రథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కదిరప్ప, ఎంపిపి హనోక్, వైకాపా నాయకులు నారాయణస్వామి, జయప్ప, ప్రభాకర్‌రెడ్డి, గోపీ, చౌడప్ప, ఆలయ కమిటీ సభ్యులు గవిరెడ్డి, నారాయణస్వామి, గోపాలప్ప, హరీష్‌బాబు, చెన్నకేశవప్ప, సోమిరెడ్డి పాల్గొన్నారు.