అనంతపురం

భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, జనవరి 1 : ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నూతన సంవత్సరం ప్రారంభం కావడంతో ఉద్యోగులు, విద్యార్థులు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా స్వామివారికి తెల్లవారుజామున మహాభిషేకం, వజ్రకవచాలంకరణ, బంగారు కిరీటధారణలతో పాటు ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం మహామంగళహారతి నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అదేవిధంగా పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర, పాత రాతి శివాలయం, శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఉరవకొండ : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవలో భాగంగా ఆలయంలో స్వామివారి మూలవిరాట్‌కు అభిషేకం, అలంకరణ, అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. కర్నాటక, ఆంధ్రా తదితర ప్రాంతాల నుండి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆలయ దిగువప్రాంతంలో ఉన్న ఉద్భవ లక్ష్మీదేవి ఆలయంలో అమ్మవారికి పట్టువస్త్రాలతో వివిధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా మండలంలోని బూదగవి గ్రామంలోని సూర్య నారాయణ స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి తెలంగాణ, కర్నాటక, ఆంధ్రా ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు.
ఆంజనేయస్వామి ఆలయంలో...
పట్టణంలోని నెహ్రూ నగర్‌లో నూతనంగా నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే వై విశే్వశ్వరరెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు నాగరాజు, వనజ, ఉపసర్పంచ్ జిలకర మోహన్, ప్రసాద్, ఎర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు.
కెవిపి క్రికెట్ టోర్నీ విజేత ఎల్లో స్టార్స్
కదిరి, జనవరి 1: స్థానిక ఎస్‌టిఎస్‌ఎన్ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన కందికుంట వెంకటప్రసాద్ క్రికెట్ టోర్నీని కదిరి ఎల్లో స్టార్స్ గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఎల్లో స్టార్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టంతో 164 పరుగులు సాధించింది. జట్టులోని బాబ్‌దీన్ 42, నూర్ 30 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కదిరి బ్లూ స్టార్స్ జట్టు 131 పరుగులు మాత్రమే సాధించి ఓటమి చెందింది. బహుమతి ప్రధానోత్సవానికి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేత జట్టుకు ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ వుంటుందన్నారు.