అనంతపురం

న్యాయ సేవాసదన్ కోర్టుకు హాజరుకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జనవరి 3 : నగరంలోని సాయినగర్ ఎస్‌బిఐ వద్ద వాతావరణ శాఖలో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మాధవరెడ్డిని విచక్షణా రహితంగా కొట్టి గాయపర్చిన కేసులో సిఐ మాధవరెడ్డి, మరికొందరు పోలీసులను విచారణ నిమిత్తం ఈనెల 10న ఉదయం 10.30 గంటలకు అనంతపురం న్యాయ సేవా సదన్ కోర్టు ఎదుట హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. బాధితుడికి అండగా నవజ్యోతి హ్యూమన్ రైట్స్ ప్రొటక్షన్ అర్గనైజేషన్ అధ్యక్షుడు బాలమద్దిలేటి అలియాస్ బాలు ఏపి హైకోర్టులో ఫిర్యాదు చేశారు. పరిశీలించిన న్యాయస్థానం పోలీసు అధికారులను విచారణ నిమిత్తం హాజరు కావాలని ఆదేశించినట్లు బాలు మీడియాకు తెలిపారు. అలాగే ఈ నోటీసులు తనకూ అందాయని తెలిపారు.

ఎంపీ దివాకర్‌రెడ్డికి మతి భ్రమించింది
* వైకాపా ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి
అనంతపురం అర్బన్, జనవరి 3: కర్నూలు జిల్లాలో సోమవారం ముచ్చమర్రి ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రారంభోత్సవం సందర్భంగా వైఎస్‌ఆర్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం పార్లమెంట్ సభ్యులు జెసి దివాకర్‌రెడ్డి తీరుపై ఉరవకొండ వైకాపా ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి, అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం స్థానిక వైకాపా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి మాట్లాడుతూ వయస్సు పైబడితో సరికాదని, సభ్యత, సంస్కారం వుండాలని హీతోపదేశం చేశారు. జెసి దివాకర్‌రెడ్డి ఉన్మాద స్థితిలో వున్నారన్నారు. ఏమి ఆశించి తెదేపాలోకి చేరారో సెలవివ్వాలన్నారు. సొంత పనులు చక్కబెట్టుకోవడానికి పార్టీ మారిన జెసి దివాకర్‌రెడ్డి తన నోటిని అదుపులో వుంచుకోవాలన్నారు. తెదేపాలో వూంటూనే ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలను విమర్శించిన జెసి దివాకర్‌రెడ్డి ప్రస్తుతం మానసిక పరిస్థితి పూర్తిగా క్షీణించినట్లు తెలుస్తుందన్నారు. తాము కూడా ఇలాంటి పదాలు వాడగలమని, సభ్యత, సంస్కారం వున్నాయి కాబట్టి వాటికి జోలికి వెళ్లడం లేదన్నారు.