అనంతపురం

దేశ రక్షణలో విహెచ్‌పి, భజరంగ్‌దళ్ పాత్ర అమోఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, జనవరి 12: దేశ రక్షణలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ పాత్ర అమోఘమని కమలానంద భారతి స్వామి, విహెచ్‌పి అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని హిందూపురం రోడ్డులో వున్న సరస్వతీ విద్యామందిరంలో 5 రోజులపాటు జరిగిన భజరంగ్‌దళ్, విహెచ్‌పి శిక్షణా తరగతులు గురువారం ముగింపు కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కమలానంద భారతి స్వామిజీ మాట్లాడుతూ నేటి తరం యువతలో దేశ భక్తి భావాలు తగ్గి స్వార్థ భావాలు ఎక్కువవుతున్నాయన్నారు. నగరీకరణ ఎక్కువ అవ్వడం వల్ల వింత పోకడలు పాశ్చాత్య సంస్కృతి ఎక్కువగా అలవడుతోందన్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రపంచంలోకెల్లా గొప్ప విశిష్ఠత వుందని, పాశ్చాత్యులు మన సంస్కృతిని ఆచరిస్తుంటే స్వదేశీయులు దేశ సంస్కృతిని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. ఈ సంస్కృతిని పరిరక్షించుకోవడం కోసం ప్రతి ఒక్క యువకుడు హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలని, ధర్మ పరిరక్షణకు, దేశ శాంతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్వామిజీ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు స్వార్థ భావాలు విడనాడి దేశాభివృద్ధికి పాటుపడాలని యువతకు సందేశమిచ్చారు. విహెచ్‌పి అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి మాట్లాడుతూ భజరంగ్‌దళ్ విశ్వహిందూ పరిషత్ దేశ రక్షణకు, సమాజాభివృద్ధికి పాటుపడే యువకులను తయారుచేసి దేశానికి అందించడం తమ లక్ష్యమన్నారు. ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు సేవ చేయడంలో భజరంగ్‌దళ్ కార్యకర్తలు ముందుంటారని తెలిపారు. దేశ రక్షణలో విహెచ్‌పి, భజరంగ్‌దళ్ ముందుంటుందన్నారు. విశ్వహిందూ పరిషత్ దేశ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు ధర్మ పరిరక్షణకు చేస్తోందన్నారు. ఈ దేశ గొప్పతనాన్ని స్వామి వివేకానంద ప్రపంచ దేశాలకు పరిచయం చేశారని తెలిపారు. విశ్వహిందూ పరిషత్ భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో కదిరిలో 5 రోజులపాటు శిక్షణా తరగతులు జరగడం ఆనందించదగ్గ విషయమన్నారు. అంతకుముందు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో వున్న వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ క్షేత్ర సంఘటనా మంత్రి గోపాల్‌జి, ఎపి సంఘటనా మంత్రి వ్యాస్‌జి, దక్షిణ క్షేత్ర భజరంగ్‌దళ్ సంయోజక్ సూర్యనారాయణ, జిల్లా సంయోజక్ వెంకటేష్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, సాయికుమార్, ఈశ్వర్, రామ్మోహన్, జనార్థన్ తదితరులు పాల్గొన్నారు.