అనంతపురం

సంప్రదాయాల మనుగడకోసమే కోడి పందేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడిపత్రి, జనవరి 13:సంక్రాంతి సాంప్రదాయలను పరిరక్షించి భావితరాలకు అందించడమే తమ లక్ష్యమని, సంక్రాంతి సాంప్రదాయాల మనుగడ దృష్ట్య కోడిపుంజుల పోటీలను నిర్వహిస్తున్నామని భారతీయ జనతాపార్టీ జిల్లాఅధ్యక్షులు జంగంరెడ్డి అంకాల్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ప్యారడైజ్ హోటల్ ప్రాంగణములో శుక్రవారం బిజేపి ఆధ్వర్యంలో సంక్రాంతి కోడిపుంజుల పోటీలను బిజేపి జిల్లాఅధ్యక్షులు జంగంరెడ్డి అంకాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి రామకృష్ణారెడ్డిలు కత్తులు కట్టకుండా కోడిపుంజుల పోటీలను ప్రారంభించారు. పోటీలను తిలకించడానికి వీక్షకులు తరలివచ్చారు. ఈసందర్బంగా అంకాల్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల వ్యవసాయ పనులు పూర్తికాగా, పంట చేతికొచ్చాకా రైతులందరూ సంక్రాంతి సంబరాల్లో వినోదం కోసం కోడి పందాలు నిర్వహించేవారన్నారు. గ్రామీణ సంస్కృతిని కొనసాగించాలనే ఉద్దేశ్యంతో కోడిపుంజుల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కోడిపందాలు జూదంగా తయారైందని, ఇది సరికాదాన్నారు. సుప్రీంకోర్టు కత్తులు కట్టకుండా కోడిపుంజుల పోటీలను నిర్వహించుకోవాలని సూచించిందన్నారు. జిల్లా ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో బిజేవైఎం జిల్లాఅధ్యక్షులు హరీష్‌రెడ్డి, మజ్దూర్‌మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు రంగనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంప్రదాయాలను కాపాడుకోవాలి
హిందూపురం టౌన్, జనవరి 13 : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వక్తలు అన్నారు. శుక్రవారం స్థానిక శ్రీకంఠాపురంలో మున్సిపల్ ఉద్యోగ, కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బండి ఆనందరాజు, న్యాయవాది మల్లికార్జున, సర్వేయర్ సురేష్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు వందమందికిపైగా మహిళలు వివిధ రకాల ముగ్గులను వేసి సాంప్రదాయం ఉట్టిపడేలా రంగులు వేసి తీర్చిదిద్దారు. ఇందులో భాగంగా మున్సిపల్ వైస్ చైర్మన్ జెపికె రాము, టిడిపి నాయకులు గ్రీన్‌పార్క్ నాగరాజు తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఏడాది ప్రారంభంలో మొదటిగా వచ్చే పండుగ సంక్రాంతి అని, ఈ సంక్రాంతి పండుగ అందరి ఇళ్లల్లో కాంతులు నింపాలని ఆకాంక్షించారు. యువతకు సంప్రదాయాలు తెలిసేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. నిర్వాహకులతోపాటు స్థానికులు సంప్రదాయ దుస్తులతో ఎద్దులబండిపై వచ్చారు. అనంతరం ఉత్తమ ముగ్గులను ఎంపిక చేయగా నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కాగా సడ్లపల్లిలో సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో కౌన్సిలర్ వెంకటస్వామి, శంకర్, అంజి, మురళీ, గోపీ, మాజీ కౌన్సిలర్ పరిమళవెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.