అనంతపురం

కలిసిపోతున్న కందికుంట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జనవరి 16:అలకలు, విభేదాలను కాస్త పక్కన పెట్టి, పార్టీలో తనకంటూ ఉన్న గుర్తింపును చాటుకునేందుకు కదిరి మాజీ ఎమ్మె‚ ల్యే, ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి కందికుంట వెంకటప్రసాద్ తాజా అడుగులు వేస్తున్నారు. జన్మభూమి-మా ఊరు గ్రామ సభల్లో మాటామంతీ లేకపోయినా ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాతో కలిసి గ్రామ సభల వేదికపై కనిపించారు. అలాగే పరిటాల రవీం ద్ర అనుచరుడిగా కొనసాగిన ఆయన మంత్రి పరిటాల సునీతను వీడకుండా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో సోమవారం జిల్లాకు చెందిన మరో మంత్రి పల్లె రఘునాథరెడ్డిని అనంతపురం కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా వ్యక్తిగతంగా, పార్టీ పరంగా పలు విషయాలపై వారు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీలో రెబల్‌గా ముద్ర పడటాన్ని తుడిచి వేసుకునే ప్రయత్నం కందికుంట చేస్తున్నట్లు దీన్నిబట్టి తెలుస్తోంది. సిఎం చంద్రబాబునాయుడు సూచనతోనే ఓ మెట్టు దిగితే తన ఇమేజ్‌కు ఏ డ్యామేజీ ఉండదని భావించి కలుపుగోలుతనంతో వ్యవహరిస్తున్నట్లు స మాచారం. పార్టీ పరంగా కూడా ఇప్పటి వరకు తనకు ఏ పదవీ ఇవ్వాలని అడగకున్నా, గతంలో పార్టీకి చేసిన సేవల్ని దృష్టిలో పెట్టుకుని సిఎం కూడా జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి ముందు కలిసి పోవాలని సూచనప్రాయంగా తెలిపినట్లు పార్టీ వర్గాల కథనం. అంతేకాకుండా ప్రజలకు సంబంధించిన ఏ విషయంపైనైనా జిల్లా అధికారుల సహకారం కూడా ఉంటుందని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా టిడిపిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలతో పాటు ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి నేతల నడుమ పలు నియోజకవర్గాల్లో విభేదాల కుంపట్లు పలు సందర్భాల్లో బహిరంగమవుతుండటం పరిపాటి. అయితే విభేదాల సెగలు ఎన్నున్నా.. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కోసం ఇటీవల ఎవరికి వారు కృషి చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వ పథకాల ప్రచారం, సొంత నియోజకవర్గాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు మంత్రులు, ఎంపి లు, ఎమ్మెల్యేలు ఎవరి వారు కృషి చేస్తుండటం విశేషం. అక్కడక్కడ నియోజకవర్గ ఇన్‌చార్జులకూ స్థానిక ఎమ్మెల్యేలకు మధ్య కూడా అంతరాల అగాధాలు లేకపోలేదు. జిల్లా టిడిపిలో నెలకొన్న సమస్యలపై జిల్లా పార్టీ ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్రకు జిల్లా స్థాయి సమావేశాల్లో ఫిర్యాదులు అందడం రివాజుగా మారిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మభూమి-మీ కోసం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించడంతో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ సమన్వయకర్తలు సామరస్య ధోరణితో ముందుకు సాగాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టిడిపిలో గత ఏడాది వైకాపా నుంచి చేరిన కదిరి ఎమ్మెల్యే అత్తార్‌చాంద్‌బాషాతో సహా మొత్తం 13 అసెంబ్లీ, ఉన్న రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. రానున్న ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో మొత్తం 2 పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలు గెలిపించుకోవడమే లక్ష్యంగా ఐక్యత అవసరమని సిఎం స్పష్టం చేస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో కదిరి టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కందికుంట సైతం తన పంథాను మార్చుకుని పార్టీ నేతలతో కలిసి పోతున్నారు. ముఖ్యంగా జిల్లాలో హిందూపురం పార్లమెంటులో కదిరి ఎమ్మెల్యే అత్తార్‌చాంద్ భాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు, ఎంపి నిమ్మల కిష్టప్ప, పెనుకొండ ఎమ్మెల్యే బికే.పార్థసారథి మధ్య, మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ పిసి గంగన్నకు, రాప్తాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పరిటాల సునీతకు, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి నడుమ విభేదాలు ఏదో ఒక సందర్భంలో బహిర్గతమవుతూనే ఉన్న విషయం విదితమే. అలాగే అనంతపురం పార్లమెంట్ పరిధిలో ప్రధానంగా ఎంపి జెసి దివాకర్‌రెడ్డి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరికి మధ్య ఇంకా విభేదాల మంటలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరి ప్రాభల్యాన్ని వారు చాటుకునే క్రమంలోనూ, అనుయాయులు, అనుచరుల వర్గాలుగా విడిపోవడంతో టిడిపికి సైతం తలనొప్పి తప్పడం లేదు. జిల్లాలోని మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలతో పార్టీ శ్రేణులు పట్టింపులతో ఉండటం పరిపాటిగా మారింది. ఈ తరుణంలో సిఎం చంద్రబాబు తాగు, సాగునీటిని జిల్లాకు రప్పించి ప్రజల మన్ననలు పొందేందుకు కృషి చేస్తూ, పలుమార్లు జిల్లాలో పర్యటిస్తుండటం విశేషం.

డబ్బులేవీ...

అనంతపురం, జనవరి 16:పెద్ద నోట్ల రద్దుతో నేటికీ కొనసాగుతున్న నగదు సంక్షోభాన్ని నిరోధించడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విత్‌డ్రాయల్స్‌పై పరిమితిని పెంచింది. ఇది ఆనందించాల్సిన విషయమే అయినా అదనపు నగదు నిల్వలు మాత్రం ఇంకా అందలేదు. దీంతో ఎటిఎంలలో రూ.10వేలు డ్రా చేయాలంటే తగినంత నగదు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు ఎటిఎంలలో రూ.4,500 మాత్రమే డ్రా చేసుకునే వీలుండేది. అలాగే కరెంటు అకౌంట్‌లో వారానికి ప్రస్తుతం ఉన్న రూ.50వేలను రూ.లక్షకు పెంచింది. ఎస్‌బి అకౌంట్‌లో మాత్రం వారానికి రూ.24వేలు డ్రా చేయడంలో మార్పు చేయలేదు. ఈ నేపథ్యంలో ఎటిఎంల ద్వారా డబ్బు డ్రా చేసుకునేందుకు, బ్యాంకులపై పడుతున్న రద్దీ భారాన్ని తగ్గించేందుకు ఆర్‌బిఐ నగదు పెంపునకు చర్యలు తీసుకున్నా ఇప్పట్లో ప్రయోజనం ఏమీ ఉండే అవకాశం లేదు. జిల్లాలో జాతీయ, కమర్షియల్, కార్పొరేట్, గ్రామీణ బ్యాంకులు అన్నీ కలిపి మొత్తం 35 రకాలున్నాయి. వీటన్నింటికీ కలిపి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 455 బ్యాంకు శాఖలున్నాయి. అలాగే మొత్తం ఎటిఎంలు 557 ఉన్నాయి. ఇప్పటికే వీటిలో 60 శాతం పైగా ఎంటి ఎం కేంద్రాలు మూత పడుతున్నాయి. నగదు తగినంత లేకపోవడం, ఉంచిన నగదు కూడా కొన్ని గంటల్లోనే ముందు వచ్చిన వారే డ్రా చేసుకోవడం, అలాగే ఒక్కొక్కరు రెండు, ఆ పైన ఎటిఎం కార్డులతో డ్రా చేస్తుండటం వంటి కారణాలతో నగదు త్వరగా అయిపోతూ ఖాళీ అవుతున్నాయి. గత ఏడాది నవంబరు 8వ తేదీ పెద్ద నోట్ల రద్దు చేసినప్పటి నుంచి నగదు కొరత వేధిస్తూనే ఉంది. నవంబరు 9న రూ.240 కోట్లు, తర్వాత డిసెంబరు 3న రూ.160 కోట్లు, ఆ తర్వాత మరో రూ.72 కోట్లు మేరకు నగదు జిల్లాకు అందింది. తర్వాత కొత్తగా నగదు అందలేదు. ప్రస్తుతం నగదు కొరత వేధిస్తున్నా, జనం క్రమంగా అలవాటు పడిపోతున్నారు. నగదు రహిత లావాదేవీలు సుమారు 20 శాతం పెరిగినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో ఎటిఎంలలో కొంత భారం తగ్గింది. అయితే ఉన్న మొత్తం బ్యాంకుల్లో ఇప్పటికీ సుమారు 300 కేంద్రాల వరకు క్యాష్ లేకుండా పోతున్నాయి. కొన్ని చోట్ల నో క్యాష్ బోర్డులు పెడుతున్నా, చాలా చోట్ల ఆ బోర్డులు కూడా పెట్టకుండా ఖాళీ ఎటిఎంలే తెరిచి ఉంచుతున్నారు. దీంతో తెరిచి ఉంచిన ఎటిఎంలతో నగదు ఉంటుందేమోనని ప్రజలు భ్రమ పడుతూ అక్కడికెళ్లి పరిశీలించి ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. ఇపుడు ఎటి ఎంలతో నగదు డ్రా చేసుకోవడాన్ని పెంచినా అసలు డబ్బే లేకుంటే ఎలా డ్రా చేసుకునేది అంటూ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రధాన బ్రాంచుల వద్ద ఎటిఎం కేంద్రాల్లో అధికంగా నగదు ఉంచి, ఆ శాఖలపై భారం పడుకుండా ఎస్‌బిఐ, కెనెరా బ్యాంకు, ఎస్‌బి హెచ్ వంటివి చర్యలు తీసుకుంటున్నా, గ్రామీణ బ్యాంకులు, కార్పొరేట్ బ్యాంకు శాఖల ఎటి ఎంలతో నగదు కొరత వేధిస్తూనే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నగదు లేక పోవడం మరింతగా వేధిస్తోంది. సంక్రాంతి పండుగ సమయంలో పట్టణాల్లోని పేదలు సహా, గ్రామీణులందరూ నగదు తగినంత లేక ఇబ్బందులు పడ్డారు. ఇపుడు మరో మూడు, నాలుగు రోజులు గడిస్తే గానీ ఆర్‌బి ఐ నుంచి అదనంగా నగదు నిల్వలు అందే పరిస్థితి లేదు. ఈ నెల ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించేశామని, ఇపుడున్న నగదు టర్నోవర్ ద్వారా చలామణికి అంతగా ఇబ్బంది ఉండదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అయితే పూర్తిగా సమస్య పరిష్కరించే అవకాశం ఉందని మాత్రం వారు చెప్పడం లేదు. అంతేకాదు.. జిల్లాకు ఎంత నగదును ఆర్‌బిఐ పంపుతుందో తమకు తెలియదని కూడా వారు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఐదు కరెన్సీ చెస్ట్‌లు ఉన్నాయి. వీటికి గతంలో వచ్చిన మొత్తాలే రోటేషన్ అవుతున్నాయి. ఇపుడు కొత్తగా నగదు రాకపోతే విత్‌డ్రా పరిమితి పెంచినా ఎటి ఎంలను ఆశ్రయించే వారి ఆశలు అడియాశలే అవుతాయి. కరెంట్ అకౌంట్‌కు రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచడంతో ఎక్కువ మొత్తాలు వారికే సరిపోయేలా ఉన్నాయి. దీంతో ఎటి ఎంలలో నగదు ఉంచినా ముందుగా వచ్చిన వారు డ్రా చేసుకుంటే వెనుకున్న వారికి అందడం గగనంగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా జిల్లాకు ఎంత నగదు అవసరమన్న విషయాలు తమ పరిధిలో లేవని బ్యాంకుల ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆర్‌బి ఐ నుంచి ఎంత నగదు వస్తుందో తెలీదంటున్నారు. ఇక రూ.2వేలు, రూ.500 నోట్లు కొత్తవి ఎన్ని ఉంటాయో నగదు వచ్చినా చెప్పలేమని వారంటున్నారు.

ఈ కార్యాలయాలకు మోక్షమెన్నడో...!
హిందూపురం టౌన్, జనవరి 16:కోట్లాది రూపాయలు వెచ్చించి సౌకర్యాలతో భవనాలు నిర్మించారు. వాటి నిర్మాణాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో ఇబ్బందులు పరిష్కారమవుతాయి. ఎన్నో ఏళ్ల క్రితమే నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం నిర్మాణాలు పూర్తయి ఏళ్లు గడుస్తున్నాయి. అయినా ప్రారంభానికి మా త్రం నోచుకోవడం లేదు. జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇదీ హిందూపురం పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రాంతీయ రవాణా శాఖ, రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ల పరిస్థితి. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి అన్ని ప్రాం తాలకు రవాణా శాఖ కార్యాలయం హిందూపురంలో ఉంది. ఇది మొదటి నుండి కనీస సౌకర్యాలు లేని అద్దె భవనంలో నడుస్తోంది. మారిన కాలానుగుణంగా నూతన ట్రాక్‌తోపాటు అన్ని హంగులతో కూడిన భవనాన్ని విశాలమైన ప్రాంగణంలో బైపాస్ రోడ్డు ప్రక్కనే సర్వాంగ సుందరంగా నిర్మించారు. ఇందుకోసం కోట్లలో నిధులు వ్యయం చేశారు. ఈ భవనం ప్రారంభోత్సవం అదిగో, ఇదిగో అం టూ ఏడాది కాలంగా కాలయాపన కొనసాగుతూనే ఉంది. రవాణా శాఖ ఉన్నతాధికారులకు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన తేదీలకు సమన్వయం కుదరకపోవడంతో ప్రారంభోత్సవం వాయిదా పడుతూనే వస్తోంది. దీంతో అన్ని సౌకర్యాలు ఉన్నా పాత కార్యాలయంలోనే విధు లు నిర్వహిస్తున్నారు. పాత కార్యాలయ సమీపంలో గతంలో ఖాళీ స్థలం ఉండటంతో వాహనాలను అ క్కడ నిలిపి ఉంచి వాటి రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల జారీ, ఫిట్‌నెట్ పరిశీలన తదితర పనులు చేసేవారు. అయితే అక్కడ ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలు జరగడంతో ఖాళీ స్థలం లేకుండా పో యింది. దీంతో వాహనాలన్నింటిని ప్రస్తుతం కొత్తగా నిర్మించిన కార్యాలయ ఆవరణలోని విశాలమైన స్థలానికి తీసుకువస్తున్నారు. అయితే రికార్డుల నిర్వహణకు పాత కార్యాలయానికే పంపుతున్నారు. దీంతో వాహనదారులు రెండు, మూడుసార్లు దాదాపు 10 కిలోమీటర్ల మేర తిరగాల్సి వస్తోంది. చిన్న పనికి అటు, ఇటు తిరగడం వాహనదారులకు శాపంగా మారుతోంది. రికార్డుల నిర్వహణ, వాహనాల పరిశీలన రెండు ఒకేచోట ఉంటే ఇంత సమస్య ఉండేది కాదు. అవి ఒకచోట, ఇవి ఒక చోట ఉండటంతో తలెత్తుతున్న ఇబ్బందులను రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. మరో వైపు రెండో పట్టణ పోలీసుస్టేషన్ భవనం లేకపోవడంతో కోట ప్రాంతంలో చిన్నపాటి భవనంలో కొనసాగిస్తున్నారు. రెండో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో రహమత్‌పురం ప్రాంతం సమస్యాత్మక ప్రాం తం కావడంతో ఈ ప్రాంతంలోనే స్టేషన్ ఉంటే కొంతవరకు సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చని పోలీసు శాఖ గుర్తించింది. ఇందుకు అనుగుణంగా రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ను రహమత్‌పురం సమీపంలో నిర్మించారు. భవన నిర్మాణ పనులు పూర్తి అయ్యా యి. ప్రారంభోత్సవానికి పూర్తిగా సిద్ధమయింది. అయితే ప్రారంభోత్సవ కార్యక్రమం మాత్రం నిర్వహించలేకపోతున్నారు. ఈ భవనం పరిస్థితి రవాణా శాఖ వారి పరిస్థితి లాగానే కనిపిస్తోంది. ప్రజలకు అత్యవసరమైన సేవలను అందించే రెండు ముఖ్య శాఖల భవనాలు ప్రారంభానికి నోచుకోకపోవడం హిందూపురం వాసులకు శాపంగా మారింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కాస్త దృష్టి సారించి ప్రజల ఇబ్బందులను గమనించి భవనాల ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టడంతోపాటు కార్యాలయాలను పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
అనంతపురం సిటీ, జనవరి 16: జిల్లాలోని అన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం లో జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం 10వ తరగతి ఉత్తీర్ణతలో జిల్లా మంచి ఫలితాలను సాధించేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఇందుకుగాను ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిఇఓను ఆదేశించారు. ప్రత్యేక తరగతులు తీసుకోవాలని, హాస్టల్స్ విద్యార్థులకు ట్యూటర్లతో క్లాసులను చెప్పించాలన్నారు. ఎవరి పిల్లలు వారి తల్లిదండ్రులకు చదువు చెప్పించడమే చిట్టి గురువుల కార్యక్రమమని, దీని జిల్లాలో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని పాఠశాలల్లో డిజిటలిజేషన్ చేశారని డిఇఓను అడుగగా 36 పాఠశాలల్లో అని సమాధానం ఇచ్చారు. అదనపు తరగతి గదులు, కాంపౌండ్ వాల్స్, టాయిలెట్స్ అవసరమో మండలాల వారిగా ఆ పాఠశాలల జాబితాను సిద్ధం చేయాలన్నారు. 15 లక్షల 34 వేల మందిని చంద్రన్న బీమా పథకంలో చేర్పించామని, వెయ్యి క్లైమ్స్‌ను సెటిల్ చేశామని కార్మిక శాఖ ఉప కమిషనర్ రేఖవాణి మంత్రి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ పథకం చాలా మంచి పథకమని అసంఘటిత రంగంలో ఉన్న వారందరినీ ఇందులో చేర్పించాలని మంత్రి ఆదేశించారు. సోలార్, విండ్ మిల్స్ జిల్లాలో ఎన్ని ఉన్నాయి, వాటి ద్వారా ఎనర్జీ ఎంత ఉత్పత్తి అవుతుందనీ నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. డిఆర్‌డిఏ పిడి వెంకటేశ్వర్లు, ఎస్‌ఎస్‌ఏ పిఓ దశరథరామయ్య, ఆర్ అండ్ బి ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పేదోడి సొంతింటి కల సాకారమయ్యేనా..!
కదిరి, జనవరి 16: ఎన్టీ గృహకల్ప కింద పేదలకు మంజూరైన ఇళ్లను నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ముందుకు వస్తున్నా అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా పేదోడికి సొంతింటి కల సాకారమయ్యేనా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని కదిరి, గుంతకల్లు, తాడిపత్రి, హిందూపురం, అనంతపురం నగర పాలక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభు త్వం మున్సిపాలిటీకి వెయ్యి ఇళ్లు చొప్పున హౌస్ ఫర్ ఆల్ పథకం కింద గత ఏడాది ఏప్రిల్ నెలలో అంబేద్కర్ జయంతి సందర్భంగా మంజూరు చేసింది. దాదాపు ఏడు నెలలపాటు లబ్దిదారుల ఎంపిక పేరుతో నత్తనడకన సాగిన ఈ పథకం డిసెంబర్ మొదటి వారంలో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. రూ. 3.5 లక్షలతో ప్రభుత్వం పక్కా గృహాన్ని మంజూరు చేయగా ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ. 1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. లక్ష, లబ్ధిదారుని మూలధనం రూ. 25 వేలతోపాటు బ్యాంకు నుండి మరో రూ. 75వేలు రుణంగా ఇప్పించడం జరుగుతుందని హౌసింగ్ అధికారులు తెలిపారు. అయితే పేదవాడు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వ నిబంధనలు తెలియజేయడంలో హౌసింగ్ అధికారులు, మున్సిపల్ అధికారుల మధ్య సమన్వయ లోపం పేదవానికి శాపం గా మారింది. మొదట లబ్ధిదారులు ఖాళీ స్థలంలో హౌసింగ్ అధికారులచే జియోట్యాగింగ్ చేయించుకుని, అనంతరం ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ఇంజినీర్‌చే ప్లానింగ్ వేయించుకుని మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులతో అనుమతులు తీసుకున్న అనంతరమే ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాల్సి వుంది. ఈ నిబంధనతోనే సామాన్యునికి కష్టాలు మొదలయ్యాయి. ఇంతవరకు అనంతపురం నగరపాలక సంస్థకు తప్ప మున్సిపాలిటీలకు పక్కా గృహాల నిర్మాణానికి అనుమతిచ్చేలా ఉత్తర్వులు జిల్లా అధికారుల నుండి రాకపోవడంతో ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిలిచిపోయింది. మార్చి నెలలోగా పక్కా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్న జిల్లా అధికారులు గత ఏడాది డిసెంబర్‌లోనే ఆదేశాలిచ్చారు. అయితే ప్రభుత్వ నిబంధనలను లబ్ధిదారులకు తెలియజేయడంలో హౌసింగ్ అధికారులు పూర్తిగా విఫలం కావడం, మున్సిపల్ అధికారులు అనుమతుల మంజూరులో జాప్యం చేయడంతో పక్కా గృహాల నిర్మాణం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ భవానీప్రసాద్‌ను వివరణ కోరగా తాను కొత్తగా వచ్చానని, అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానన్నారు.
రైతులకు బోనస్ చెల్లించాలి
* రూ.2 వేల నోట్లు రద్దు చేయాలి * పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి
మడకశిర, జనవరి 16:దేశంలో పెద్ద నోట్లు రద్దు తర్వాత నష్టపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే బోనస్ ప్రకటించి ఆదుకోవాలని పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ మడకశిరలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ, గత నవంబర్‌లో ప్రధాని నరేంద్రమోదీ రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రకటన చేసి అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఈ నోట్ల వల్ల ధనవంతులు పాత నోట్లను ఇచ్చి కొత్త నోట్లను తీసుకొని సుఖంగా ఉన్నారే తప్ప సామాన్య, మధ్య తరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ నష్టపోయారన్నారు. నోట్ల రద్దుపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ ఐదు ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పాలని కోరితే ఇప్పటి వరకు ఎలాంటి జవాబు రాలేదన్నారు. నోట్ల రద్దు వల్ల రైతులు పండించిన పంటలు విక్రయాలు జరగక నష్టపోయారని, అంతేకాక వాటికి మద్ధతు ధర దొరక్క ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలు తమ నగదును బ్యాంక్‌ల్లో ఉంచుకొంటే ఉపసంహరణకు పరిమితి విధించడం సమంజసం కాదన్నారు. నగదు ఉపసంహరణ పరిమితి వల్ల అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతినడం జరిగిందన్నారు. ఉపాధి కూలీలు ఉపాధి అందక నష్టపోయారన్నారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంక్ జారీ చేసిన రూ.2 వేల నోట్ల వల్ల దేశంలో మరింత అవినీతి పెరిగిపోతుందని, వెంటనే వాటిని రద్దు చేయాలన్నారు. నగదు ఉపసంహరణ పరిమితిని వెంటనే ఎత్తి వేయాలని, బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన ప్రతి మహిళకు రూ.25 వల నగదు జమ చేయాలన్నారు. డిసిసి అధ్యక్షులు కోటా సత్యం, మాజీ ఎమ్మెల్యే సుధాకర్, నాయకులు కెటి శ్రీ్ధర్, సొరంగాల నాగరాజు, రమణ, అక్రంఖాన్, మంజునాథ్, నాగేంద్ర, దొడ్డయ్య, డాక్టర్ రవిశంకర్, గంగళవాయిపాళ్యం ప్రభాకర్‌రెడ్డి, నరసింహమూర్తి, లోకేష్, ఈశ్వరప్ప, రంగనాథ్, నాగభూషణం, వెంకటేష్, శివశంకర్, మైలారప్ప తదితరులు పాల్గొన్నారు.
తాగునీటికి ప్రాధాన్యత
అనంతపురం సిటీ, జనవరి 16: రాష్ట్ర ప్రభుత్వం తాగునీటికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రుద్రంపేటలో 1.25 కోట్ల అంచనాతో నిర్మించనున్న జిఎల్‌ఎస్‌ఆర్(మంచినీటి ట్యాంకు) నిర్మాణానికి అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో కలసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో మనది ఒక జిల్లా అని తెలిపారు. రాబోయే వేసవిని దృష్టిలో వుంచుకుని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి నుండే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 3 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించనున్న ఈ ట్యాంకు పూర్తయితే రుద్రంపేట పంచాయతీలోని దాదాపు 35వేల మంది ప్రజలకు మంచినీటి సమస్య తలెత్తదని తెలిపారు. మరో 14 కోట్లతో ఇఎల్‌ఎస్‌ఆర్‌ను నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా సిఆర్‌ఎఫ్, నాన్ సిఆర్‌ఎఫ్ కింద 26 కోట్లు మంజూరు చేయాలని సిఎంకి విన్నవించామని తెలిపారు. ఎన్‌టిఆర్ సుజల స్రవంతి పేరుతో మినరల్ వాటర్‌ప్లాంట్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. హంద్రీనీవా కాలువను పూర్తి చేసి ఇప్పటి దాకా దాదాపు 20 టిఎంసిల నీటిని జిల్లాకు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుచూపుతో ఇది సాధ్యపడిందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడడమే ప్రభుత్వ ముఖ్యోద్దేశ్యమని తెలిపారు. ట్యాంకు నిర్మాణంలో నాణ్యతలో రాజీ పడేది లేదని, మంచి నాణ్యతతో త్వరితగతిన ట్యాంకును పూర్తిచేయాలన్నారు. నగరంలో 550 కోట్ల అంచనాతో నిర్మించనున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుండి వౌఖికంగా అనుమతులు వచ్చాయని తెలిపారు. నగర మేయర్ మదమంచి స్వరూప, రుద్రంపేట సర్పంచ్ కాలేనాయక్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
ఎన్‌టిఆర్ వర్ధంతికి తరలిరండి
* మంత్రి పరిటాల సునీత
రామగిరి, జనవరి 16: టిడిపి వ్యవస్థాపకులు ఎన్‌టిఆర్ వర్ధంతి ఈ నెల 18న అనంతపురంలోని అరవింద నగర్‌లో నిర్వహించడం జరుగుతోందని, వర్ధంతికి టిడిపి శ్రేణులు, పరిటాల అభిమానులు తరలిరావాలని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. సోమవారం స్థానిక రామగిరిలోని టిడిపి కార్యాలయంలో మంత్రి విలేఖరులతో మాట్లాడారు. ఎన్‌టిఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం, అన్నదానం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎన్‌టిఆర్ టిడిపిని ఏర్పాటుచేసి బడుగు, బలహీన వర్గాలకు, మహిళల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చారని ఆమె కొనియాడారు. కూడు, గూడు, గుడ్డ నినాదంతో పేదల గుండెల్లో నిలిచిపోయారన్నారు. ప్రతి గ్రామంలో కూడా ఆయనను స్మరిస్తూ ఆయన చిత్రపటానికి వర్ధంతి రోజున నివాళులు అర్పించాలని తెలిపారు. అనంతరం రామగిరిలో మోడల్‌గా ఏర్పాటుచేసిన వాటర్‌ప్లాంటు వద్దకు వెళ్ళి నిర్వహణపై ఆరా తీశారు. అక్కడ పరిశుభ్రత గురించి తెలుసుకున్నారు. రోజూ ఎంతమంది నీళ్లు తీసుకెళ్తున్నారో విచారించారు. కాయిన్‌లు వేసి తీసుకెళ్తున్నారా? లేక నగదు రహితంగా తీసుకెళ్తున్నారా? అని నిర్వాహకునితో విచారించారు. సమావేశంలో మాజీ జెడ్‌పిటిసి రామ్మూర్తినాయుడు, మండల కన్వీనర్ పరంధామయాదవ్, రామగిరి సర్పంచ్ శ్రీనివాసులు, కోనాపురం సర్పంచ్ ముకుంద, స్థానికులు, టిడిపి నేతలు పాల్గొన్నారు.
రిజిస్టర్‌లో సంతకాలు చేయని
పదిమంది మున్సిపల్ ఉద్యోగులకు మెమో
* సిబ్బందితీరుపై కమిషనర్ ఆగ్రహం
అనంతపురంటౌన్, జనవరి 16: మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్యాలయ పనివేళల్లో ఆలస్యంగా విధులకు హాజరవుతూ అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేయని వివిధ విభాగాల సిబ్బంది పదిమందికి సోమవారం కమిషనర్ సురేంద్రబాబు మెమో జారీ చేయాలని ఆదేశించారు. సిబ్బంది పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం 11 గంటల సమయంలో పరిపాలనా విభాగంలో అడుగుపెట్టిన కమిషనర్‌కు సీట్లు చాలావరకు ఖాళీగా కనిపించాయి. విధులకు హాజరైన వారు సైతం అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేయకుండా ఉండటం గుర్తించారు. ఆఫీసులో విధులు నిర్వహించేవారు వచ్చిన వెంటనే అటెండెన్స్‌లో సంతకాలు చేయాలన్న ఆలోచన రాదాయని ప్రశ్నించారు. ఇంతవరకూ విధులకు హాజరుకాని వారికి మెమోలు ఇవ్వాలని ఆదేశించారు. మంగళవారం నుంచి కార్యాలయానికి హాజరైన వెంటనే అటెండెన్స్‌లో సంతకాలు చేయని వారికి ఆబ్సెంట్ మార్క్ వేస్తామని హెచ్చరించారు. ఆ రోజు జీతం కట్ చేయటం కూడా జరుగుతుందన్నారు. ఉద్యోగులు క్రమశిక్షణ, సమయ పాలన పాటించాలని సూచించారు. వివిధ విభాగాల ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్టర్లను తెప్పించి పరిశీలించారు. ఫీల్డ్ వర్క్స్‌కు వెళ్లే డిఇఇలు, ఎఇలు తప్పనిసరిగా హాజరుపట్టీలో సంతకాలు చేసి వెళ్ళాలని సూచించారు.
కరణం రామకృష్ణను
తహశీల్దార్ ముందు హాజరుపరచిన పోలీసులు
* అదృశ్యం, కబ్జాపై వాంగ్మూలం
పుట్టపర్తి, జనవరి 16: పుట్టపర్తి పట్టణంలో కోట్ల విలువ చేసే ఆస్తులు కబ్జా, కరణం రామకృష్ణ అదృశ్యం కేసు విచారణ రెవెన్యూ అధికారుల వద్దకు చేరింది. సోమవారం రామకృష్ణ, కుటుంబ సభ్యులను పుట్టపర్తి పోలీసులు తహశీల్దార్ సత్యనారాయణ ముందు హాజరుపరిచారు. మున్సిపల్ చైర్మన్ పిసి.గంగన్న వారికి అండగా సమస్యలను అధికారులకు వివరించారు. సుమారు రూ.50 కోట్లకు పైగా విలువ చేసే ఆయన ఆస్తులను సైతం కబ్జా చేసి భయభ్రాంతులకు లోను చేయడం వల్లే తాను అదృశ్యమైనట్లు తహశీల్దార్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. తాను ఎవ్వరికి తన ఆస్తులను విక్రయించలేదని, దొంగ పత్రాలను సృష్టించి ఫోర్జరీ సంతకాలతో తన ఆస్తులను కబ్జా చేశారని, తగిన విచారణ జరిపి న్యాయం చేయాలని తహశీల్దార్‌ను ఆయన విన్నవించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పిసి.గంగన్న, డిప్యూటీ తహశీల్దార్ ప్రసాదరావు, రామకృష్ణ కుటుంబ సభ్యులు చంద్రస్వామి, సర్వేశ్వరరావు, సుబ్రమణ్యంరావు తదితరులు వున్నారు.
కానిస్టేబుల్‌పై దాడి
ముదిగుబ్బ, జనవరి 16: మండల పరిధిలోని రాళ్ళ అనంతపురం వద్ద ఆదివారం రాత్రి ముదిగుబ్బ పోలీస్ కానిస్టేబులు హరినాయక్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన జరిగింది. ఇందుకు సంబందించిన వివరాలు ఇలా వున్నాయి. రాళ్ళ అనంతపురం వద్ద ప్రధాన రహదారిపై ఓ మినీ వ్యాన్, కారుకు సంబందించిన వ్యక్తులు వాదులాడుకుంటుండగా కానిస్టేబులు సర్దిచెప్పబోగా అతనిపై కారుకు సంబందించిన వ్యక్తులు దాడి చేసి కొట్టినట్లు తెలిసింది. కాగా వాదులాడుకోరాదని చెప్పిన తనపై కారుకు సంబందించిన వ్యక్తులు బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లికి చెందిన ప్రభాకరరెడ్డి, శంకర, రామపురంకు చెందిన కేశవలపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు పోలీసుల సమాచారం.
వివాహిత ఆత్మహత్యాయత్నం
గార్లదినె్న, జనవరి 16:మండల పరిధిలోని పెనకచర్ల గ్రామానికి చెందిన ఎల్లమ్మ అనే వివాహిత మహిళ సోమవారం వాస్మయిల్ తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఎల్లమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయం చూచి వాస్మయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గమనించిన స్థానికులు 108 వాహనం ద్వారా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మయత్నానికి కారణాలు తెలియరాలేదు.
కానిస్టేబుల్‌పై దాడి
ముదిగుబ్బ, జనవరి 16: మండల పరిధిలోని రాళ్ళ అనంతపురం వద్ద ఆదివారం రాత్రి ముదిగుబ్బ పోలీస్ కానిస్టేబులు హరినాయక్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన జరిగింది. ఇందుకు సంబందించిన వివరాలు ఇలా వున్నాయి. రాళ్ళ అనంతపురం వద్ద ప్రధాన రహదారిపై ఓ మినీ వ్యాన్, కారుకు సంబందించిన వ్యక్తులు వాదులాడుకుంటుండగా కానిస్టేబులు సర్దిచెప్పబోగా అతనిపై కారుకు సంబందించిన వ్యక్తులు దాడి చేసి కొట్టినట్లు తెలిసింది. వాదులాడుకోరాదని చెప్పిన తనపై కారుకు సంబందించిన వ్యక్తులు బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లికి చెందిన ప్రభాకరరెడ్డి, శంకర, రామపురంకు చెం దిన కేశవలపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు పోలీసుల సమాచారం.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
గుత్తి, జనవరి 16:పెద్దవడుగూరు మండలం కిష్టపాడు గ్రామ సమీపంలో ద్విచక్రవాహనం బోల్తాపడిన సంఘటనలో హాజీవలి, రజియాబేగంలు తీవ్రంగా గాయపడ్డారు. కిష్టిపాడుకు చెందిన వారిరువురు ద్విచక్ర వాహనంలో గుత్తికి వస్తుండగా కిష్టపాడు మలుపు వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. సంఘటనలో వారిరువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహటీన గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై గుత్తి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఘర్షణలో ఇద్దరికి గాయాలు
గోరంట్ల, జనవరి 16:పంట పొలాన్ని గొర్రెలు మేశాయని ఇరు వర్గాలు మద్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలకు గురైనట్లు పోలీసులు తెలిపారు. మండల పరిధిలోని గంగంపల్లికి చెందిన గొర్రెల కాపరి నరసింహులుకు చెందిన గొర్రెలు కిష్టప్ప వరి పొలంలో మేస్తుండగా ఇరువురు ఘర్షణకు దిగారు. దీంతో వీరి బంధువులు కూడా ఘర్షణ పడి తీవ్రంగా కొట్టుకున్నారు. దాడిలో నరసింహులు, నారాయణప్ప తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి ఇరు వర్గాలకు చెందిన తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
గ్రీవెన్స్‌సెల్‌కు 14 ఫిర్యాదులు
అనంతపురంటౌన్, జనవరి 16: కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో సోమవారం కమిషనర్ సురేంద్రబాబు నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు 14 ఫిర్యాదులు అందాయి. కార్పొరేటర్ లాలెప్ప మాట్లాడుతూ డివిజన్‌లో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. దీనిపై కమిషనర్ సురేంద్రబాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థ బడ్జెట్ మైనస్‌లో నడుస్తోందన్నారు. ఈ సమయంలో అత్యసరమైతే తప్పా టెండర్లు, నామినేషన్లు, డిపార్ట్‌మెంట్ పనులు చేపట్టడం జరగదని స్పష్టం చేశారు. దీనిపై లాలెప్ప అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోట్ల రూపాయల పనులు చేపడుతున్నారని, అభివృద్ధి పనులే జరగని తమ డివిజన్‌లో సమస్యల పరిష్కారానికి అభివృద్ధి పనులు చేపట్టాలంటే మైనస్ బడ్జెట్ అంటూ చెప్పటం సరికాదని అన్నారు. ఉమానగర్ పరిధిలోని ఆరు డివిజన్లకు రక్షిత తాగునీటిని అందించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహణలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేయాలని మాజీ కార్పొరేటర్ వెంకటప్రసాద్ అర్జీని అందచేశారు. అలాగే పెన్షన్లు మంజూరు చేయాలని, మురుగు కాల్వలు నిర్మించాలని కోరుతూ పలువురు అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డిఇఇ కిష్టప్ప, ఎఇ మహదేవప్రసాద్, టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ ఇషాక్, హెల్త్ఫాసర్ గంగాధరరెడ్డి, శానిటరీ సూపర్‌వైజర్ గంగిరెడ్డి, టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.
హంద్రీనీవా ఆయకట్టుకు నీరివ్వాలి
అనంతపురం సిటీ, జనవరి 16: హంద్రీనీవా ఆయకట్టుకు నీరివ్వాలని, అందుకు అవసరమైన డిస్ట్రిబ్యూటరీ పనులు వెంటనే చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆయన విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌ఎల్సీ, హంద్రీనీవా ద్వారా ఈ ఏడాది జిల్లాకు 28 టిఎంసిల నీరు అందినా సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం విఫలమైందన్నారు. జిల్లాలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్న తరుణంలో జిల్లాను ఆదుకోవడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు వైఫల్యం చెందారన్నారు. హంద్రీనీవా నీటితో జిల్లాలోని 49 చెరువులను పూర్తిస్థాయిలో నీటిని నింపాలని, రైతులకు వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీని ఇవ్వాలనే డిమాండ్లతో ఈ నెల 31వ తేదీన వామపక్షాలు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని వామపక్షాల నాయకులు కలసి వచ్చి మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జాఫర్, పి.నారాయణస్వామి, వైకాప నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, సిపిఎం జిల్లా నాయకులు బిహెచ్ రాయుడు ఇతర నాయకులు పాల్గొన్నారు.