అనంతపురం

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, జనవరి 21 : గుత్తి రైల్వే జిఆర్‌పి పోలీసు స్టేషన్ పరిధిలోని బసినేపల్లి పెద్దవంక సమీపంలో శనివారం తెల్లవారుజామున వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైల్లో చోరీ జరిగింది. ఈ ఘటన లో ఎస్1 బోగిలో ప్రయాణిస్తున్న కే శమ్మ మెడలో నుంచి రెండున్నర తు లాల బంగారు చైన్ అపహరించుకుపోయారు. ఈమేరకు బాధితురాలు కేశమ్మ తిరుపతి జిఆర్‌పి పోలీసు స్టే షన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో జిఆర్‌పి డిఎస్పి పిఎస్ బాబు ఘటనా స్థ లాన్ని చేరుకుని విచారణ చేపట్టారు. కాచిగూడ నుంచి తిరుపతికి వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు పెండేకల్లు రైల్వే స్టేషన్ దాటి బసినేపల్లి తండా సమీపంలోని వంతెన వద్దకు రాగానే స్టేషన్‌లోకి రావడానికి ప్లాట్‌ఫాం ఖాళీ లేకపోవడంతో అధికారులు అవుటర్‌లో 10 నిమిషాల పాటు నిలిపారు. ఆ సమయంలో రైలులోని ఎస్1, ఎస్7, ఎస్9 బోగిల్లోకి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి ఎస్1 బోగిలో 36వ నెంబర్ బెర్తులో ఉన్న కేశమ్మ మెడలోని రెండున్నర తులాల బంగారు చైన్ లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటూ కేకలు వేసింది. ఒక్కసారిగా రైల్లో అలజడి చెలరేగడంతో బందోబస్తులో ఉన్న కానిస్టేబుళ్లు ఘటనా స్థలానికి చేరుకునేలోపు దుండగులు రైలు దిగి పారిపోయినట్లు సమాచారం. అంతలోపే రైలు కదిలి గుత్తి రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. స్టేషన్‌లో రైలు కేవలం 1 నిమిషం మాత్రమే నిలబడటంతో బాధితులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేకపోవడంతో తిరుపతి రైల్వే స్టేషన్‌లోని జిఆర్‌పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జిఆర్‌పి డిఎస్పీ పిఎస్ బాబు శనివారం గుత్తికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరించారు.
జాతీయ స్థాయి
బండలాగుడు పోటీలు ప్రారంభం
పెద్దవడుగూరు, జనవరి 21 : మండల కేంద్రంలోని గ్యాస్ గోడౌన్ వద్ద ఏర్పాటు చేసిన జాతీయస్థాయి పాలపళ్ల విభాగం బండలాగుడు పోటీలను ఎంపి దివాకర్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ఎద్దుల పోటీలు రైతుల్లో ఆనందం నింపుతాయన్నారు. ఈ పోటీల్లో 24 జతల ఎద్దులు పాల్గొనగా కడప జిల్లా బిఎస్‌ఎఫ్‌రెడ్డికి చెందిన ఎద్దులు ప్రథమస్థానం, అలాగే గుత్తి మండలం బేటాపల్లి గ్రామానికి చెందిన ఆచారి ఎద్దులు ద్వితీయస్థానంలో కొనసాగుతున్నాయి. ఇంకా పోటీలు జరగాల్సి ఉన్నందున విజేతలను ఇంకా ప్రకటించలేదు. ఈ సందర్భంగా వచ్చిన ప్రజలందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు.