అనంతపురం

బాధిత మహిళల్లో ఆత్మస్థైర్యం నింపుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, జనవరి 31 : భర్త వేధిస్తున్నాడు..సరిగా చూసుకోవటం లేదు.. అత్త మామలు సతాయింపులు, వరకట్న వేధింపులు, ఆడపడుచుల పోరు ఇలా రకరకాల బాధలతో వచ్చే బాధిత మహిళల్లో ఆత్మస్థైర్యం నింపి సత్వరమే వారి సమస్యలు పరిష్కరిద్దామని ఎస్‌పి రాజశేఖర్‌బాబు పిలుపునిచ్చారు. ప్రతి మంగళవారం బాధిత మహిళల కోసం నిర్వహించే మహిళా గ్రీవెన్స్ కార్యక్రమం, దాని విధి విధానాల పట్ల ఎస్‌పి తన క్యాంప్ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్, సైకాలజీ, ఐసిడిఎస్ విభాగాలతోపాటు మహిళా సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వచ్చే వారం నుంచి తన క్యాంప్ కార్యాలయంలో నేరుగా బాధిత మహిళలు ఫిర్యాదు చేయవచ్చునని ఎస్‌పి తెలిపారు. మహిళల సమస్యల పరిష్కార వేదిక తమ కార్యాలయం ముందున్న చిన్నపిల్లల పార్కుకు ఆనుకొని వున్న భవనాన్ని ప్రత్యేకంగా కేటాయించామన్నారు. ఇక్కడ కౌనె్సలింగ్‌కు అవసరమైన వాతావరణాన్ని కల్పించామన్నారు. ఇందులో సైకాలజిస్ట్, లీగల్ అడ్త్వెజర్, మహిళా సిబ్బందితో పోలీస్ అధికారులు వుంటారన్నారు. ఇక్కడ మహిళా సంఘాల ప్రతినిధులకు అవకాశం కల్పించటం జరిగిందన్నారు. అప్పటికీ బాధిత మహిళకు న్యాయ జరగకపోతే బాధితురాలి అభీష్టం మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామన్నారు. బాధితులు అఘాయిత్యా ల బారిన పడకుండా సంప్రదిస్తే న్యాయం చేస్తామన్నారు. సమావేశంలో డీఎస్పీ మల్లికార్జునవర్మ, ఇన్‌స్పెక్టర్లు రాజశేఖర్, ఆంజినేయులు, సైకాలజిస్ డాక్టర్ గిరినాథ్‌రెడ్డి, ఐసిడిఎస్ కౌన్సిలర్ ఉమాదేవి పాల్గొన్నారు.
పెన్నానదికి చేరిన మిడ్ పెన్నార్ నీరు
పామిడి, జనవరి 31: నగర పంచాయతీ ప్రజలకు తాగునీటిని అందించాలన్న ఉద్దేశ్యంతో గత బుధవారం మిడ్ పెన్నార్‌లో అధికారులతో కలిసి చైర్మెన్ గౌస్‌పీర విడుదల చేసిన నీరు ఎట్టకేలకు మంగళవారం పెన్నా నది మూడో కాలువకు చేరింది. వేసవికాలం రాక మునుపే పెన్నా నది పరివాహక ప్రాంతంలో నీటి మట్టం అడుగంటిపోతున్న క్రమంలో నీటి విడుదల కలగానే మిగిలిపోతుందని తాగునీటి కష్టాలు తప్పవని అనుకుంటున్న నేపథ్యంలో గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ చొరవచూపి ఉన్నతాధికారులతో చర్చించి పెన్నాకు రావాల్సిన దానికంటే తక్కువగానైనా నీటిని విడుదల చేయించటం శుభపరిణామమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పెన్నా నదికి నీటిని విడుదల చేయించి మిడ్‌పెన్నార్ నుండి పెన్నా నది వరకూ ఊట కాలువలను పూర్తిగా మూసివేయించి నీటిని పెన్నాకు తీసుకురావటంలో చైర్మెన్ గౌస్‌పీర, కమిషనర్ నాసీర్‌హుసేన్ కృషి అమోఘమని పట్టణ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గుంతకల్లు రైల్వే డివిజన్‌కు
ప్రత్యేక నిధులు కేటాయించాలి
* మాజీ ఎంపి అనంత వెంకటరామిరెడ్డి
ఉరవకొండ, జనవరి 31 : గుంతకల్లు రైల్వే డివిజన్ అభివృద్ధి కోసం బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని మాజీ ఎంపి అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బి వసతి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి రైల్వే డివిజన్‌లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. గుంతకల్లు-గుంటూరు డబ్లింగ్ పనులు, పుట్టపర్తి-కదిరి, బాగేపల్లి-కదిరి, రాయచోటి-కదిరి కొత్త లైన్ల ఏర్పాటుకు సర్వేలు కూడా చేశారన్నారు. అదేవిధంగా గుత్తి-బెంగళూరు విద్యుత్ లైన్, రాయదుర్గం-బెంగళూరు లైన్లకు సైతం గతంలో సర్వే చేశారన్నారు. అదే బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చేయలేదన్నారు. కనుక నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో గుంతకల్లు రైల్వే జోన్ అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఆటో డ్రైవర్ నిజాయితీ
గుడిబండ, జనవరి 31 : మండల పరిధిలోని మేకలఘట్టకు చెందిన ఆటో డ్రైవర్ రమేష్ ఆటోలో ప్రయాణించిన ఓ మహిళకు రూ.45 వేల నగదుతో ప్రయాణిస్తూ మరచిపోయింది. అయితే రమేష్ నగదును పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. రమేష్ మంగళవారం తన ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకుని గుడిబండ నుండి మడకశిరకు వెళ్తుండగా మడకశిర మండలం పాపసానిపల్లికి చెందిన శాంతమ్మ కదిరేపల్లి క్రాస్ వద్ద రూ.45 వేల నగదు కలిగిన బ్యాగ్‌లో ఎక్కింది. అయితే మడకశిరలో దిగిన ఆమె బ్యాగ్‌ను మరచిపోయి వెళ్లిపోయింది. గమనించిన డ్రైవర్ రమేష్ బ్యాగ్‌ను పరిశీలించగా నగదు కనిపించింది. దీంతో బ్యాగ్‌ను పోలీసుస్టేషన్‌లో అప్పగించాడు. నగదు పోగొట్టుకున్న శాంతమ్మ మడకశిరలో ఆటో డ్రైవర్ల వద్ద ఆరా తీయగా రమేష్ అని తెలియడంతో అతని కోసం గుడిబండకు వెళ్లింది. అయితే అప్పటికే రమేష్ ఆ బ్యాగ్‌ను పోలీసుస్టేషన్‌లో అప్పగించడంతో పోలీసులు ఆమెను విచారించి నగదు అందజేశారు. ఆటో డ్రైవర్ నిజాయితీ పట్ల ఎస్సై ఖజాహుసేన్, కానిస్టేబుళ్లు, ఆటో డ్రైవర్లు అభినందించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకని మృతి
నంబులపూలకుంట, జనవరి 31: మండల పరిధిలోని జవుకల గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వి.చంద్రాచారి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చంద్రాచారి స్వగ్రామం కడప జిల్లా చక్రాయపేట మండలం నక్కలదినె్న గ్రామానికి చెందిన వారన్నారు. గౌకనపల్లి నుంచి మండల కేంద్రానికి వస్తున్న సయమంలో ఆటో జవుకల సమీపంలో ఒంటిళ్ళు వద్దకు రాగానే అదుపుతప్పి పడిపోయిందని స్థానికులు తెలిపారు. ఆటో ఆరుగురు ప్రయాణీకులు ఉన్నారని, మిగిలిన వారికి ఎలాంటి గాయాలు కాలేదన్నారు. ప్రమాదంలో గాయపడిన చంద్రాచారిని మెరుగైన వైద్యం కొరకు కడపకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్‌బాబు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
యాడికి, జనవరి 31 : మండల పరిధిలోని రాయలచెరువు గ్రామానికి చెందిన ఇస్మాయిల్ (25) గత రాత్రి ప్రొద్దుటూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ప్రొద్దుటూరు నుంచి తన అత్తగారి ఊరైన తండానదినె్నకు సోమవారం రాత్రి ద్విచక్రవాహనంలో వెళ్తూ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మృతిచెందినట్లు తెలిపారు.
మహిళపై దాడి
బుక్కరాయసముద్రం, జనవరి 31: బుక్కరాయసముద్రం మండలం సంజీవపురం గ్రామంలో మంగళవారం ప్రమీలమ్మ(60)పై అదే గ్రామానికి చెందిన రమేష్ దాడికి పాల్పడ్డాడు. పోలీసులు అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రమీలమ్మ సంజీవపురం గ్రామంలో కిరాణా కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తోంది. అదే గ్రామానికి చెందిన రమేష్ మధ్యాహ్నం 1గంట సమయంలో కొట్టుకు వెళ్లి సిగరెట్లు అడగ్గా సిగరెట్లు ఇచ్చిందని, వెంటనే కూల్‌డ్రింక్ ఇమ్మని అడగడంతో తీసుకురావటానికి ఇంట్లోకి వెళ్లింది. అదే అదునుగా చేసుకున్న రమేష్ ఇంట్లోకి దూరి తన మెడలోని బంగారు గొలుసు ఇవ్వమంటూ అడగడంతో ఆమె అందుకు నిరాకరించడంతో ఆమెను చితకబాదడంతో స్పృహ కోల్పోయింది. అదే సమయంలో సరుకుల కోసం కొట్టుకు ఇతరులు రావడంతో గమనించిన రమేష్ పరారీ అయ్యాడు. స్థానికుల సహాయంతో బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బుక్కరాయసముద్రం ఎస్సై విశ్వనాథచౌదరి సంఘటనా స్థలానికి వెళ్ళి పరిస్థితిని సమీక్షించారు. ఆసుపత్రికి వెళ్ళి ఆమె తెలిపిన వివరాల మేరకు భర్త అశ్వర్థనారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఎటిఎంలో నగదు చోరీకి విఫలయత్నం
అనంతపురం అర్బన్, జనవరి 31: మంగళవారం తెల్లవారుజామున దొంగలు రామచంద్రా నగర్‌లోని ఎటిఎం ధ్వంసం చేసి దోచుకోవటానికి విఫలయత్నం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రామచంద్ర నగర్‌లోని ఎస్‌బిఐ ఎటిఎం దగ్గర రెండు షిఫ్టుల్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో మహేష్ అనే సెక్యూరిటీ గార్డు గత కొద్ది రోజులుగా ఎటిఎం దగ్గర రాత్రివేళ్లలో వెళ్లకుండా వున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇదే అదునుగా భావించిన దొంగలు మంగళవారం తెల్లవారుజామున ఎటిఎంలోకి ప్రవేశించి సిసి కెమెరాలో దొంగలు రికార్డు కాకుండా మెదటిగా వైరును కట్ చేసి దొంగతనానికి విఫలయత్నం చేశారు. కాని ఎటిఎం తెర్చుకోకపోవటంతో దొంగలు ప్రయత్నాలు ఫలించ లేదు. ఎటువంటి నగదు చోరీకి గురికాలేదని బ్యాంక్ అధికారులు తెలిపారు. బ్యాంక్ అధికారుల సమాచారం మేరకు మూడవ పట్టణ పోలీసలు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రెవెన్యూ పారా మీటర్ల ప్రగతిలో
జిల్లా మొదటిస్థానం
* జెసిని అభినందించిన సిసిఎల్‌ఎ
అనంతపురం సిటీ, జనవరి 31: రెవిన్యూ పారా మీటర్ల ప్రగతిలో రాష్ట్రంలోనే జిల్లాను అగ్రస్థానంలో నిలిపినందుకు జూయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతంను సిసిఎల్‌ఎ అనిల్ చంద్ర పునీఠా అభినందించారు. మంగళవారం రెవిన్యూ పారా మీటర్ల అంశాలపై జిల్లా జెసి, డిఆర్‌ఓ, ఆర్‌డిఓలు, తహశీల్దార్లుతో సిసిఎల్‌ఎ వీడియో కాన్ఫరెన్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సిసిఎల్‌ఎ మాట్లాడుతూ నాల్గవ విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో జిల్లాలో ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని వచ్చిన వినతులను కలెక్టర్, జెసి వాటన్నింటిని పరిష్కరించాలని తెలిపారు. దీనిని ఎలా పరిష్కరించారని జెసిను ఆయన అడుగగా, జెసి మాట్లాడుతూ 17,863 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 17,000 దరఖాస్తులను పరిష్కరించామని తెలిపారు. అందుబాటులో వున్న ప్రభుత్వ భూమిని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలను ఇచ్చి పరిష్కార పత్రాలను అందించామని తెలిపారు. రెవిన్యూ పారా మీటర్లు, మీ-సేవా పరిష్కారంలో అనంతపురం జిల్లా అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ఈ వీసిలో జెసి బి.లక్ష్మికాంతంతోపాటు డిఆర్‌ఓ మల్లీశ్వరీదేవి, సర్వే లాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు మశ్చీంద్రనాథ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కష్టపడి చదవితే
ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు

అనంతపురం సిటీ, జనవరి 31: విద్య భవిష్యత్‌కు దిక్సూచిలాంటిదని, విద్యార్థులు విద్యార్థి దశ నుండి కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టు అధికారి ఆచార్య దశరథరామయ్య పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ బాలుర హైస్కూల్ నందు పదవ తరగతి విద్యార్థులకు ఆల్‌మేవా ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పిఓ విద్యార్థులకు పదవ తరగతి మెటీరియల్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పోటీ ప్రపంచానికి తగినట్టుగా విద్యార్థులు సన్నద్ధం కావాలని తెలిపారు. అబ్రహాంలింకన్, అబ్దుల్‌కలాం ఆజాద్‌లాంటి మేథావులను స్ఫూర్తిగా తీసుకుని కష్టపడి చదువుకోవాలన్నారు. పరీక్షల సమయంలో కాలాన్ని వృథా చేయకుండా పరీక్షలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సత్ఫలితాలను సాధించాలన్నార