అనంతపురం

వేడుకగా తొండపాడు రంగనాథస్వామి రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, ఫిబ్రవరి 10 : మండల పరిధిలోని తొండపాడులో వెలసిన రంగనాథస్వామి రథోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. రథం లాగుతున్న సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో గుమికూడడంతో అదుపు చేయడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. ఆలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన రథోత్సవం ఆలయ సమీపంలోని ఆర కిలో మీటర్ వరకు లాగారు. గోవింద నామ స్మరణంతో భక్తులు పులకరించిపోయారు. ఆలయ ప్రాంగణం పరిధిలోని మిద్దెలు, ఇతర భవనాలపైకి ఎక్కి భక్తులు రథోత్సవాన్ని తిలకించారు. ఇప్పటికే స్వామివారికి మొక్కుబడులు ఉన్న భక్తులు తమ ఎద్దులను రథానికి కట్టి వాటిచేత లాగించారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో తొండపాడు కిటకిటలాడింది. అంతకుముందు తెల్లవారుజామున 3 గంటలకు రంగనాథస్వామికి ఆలయ అర్చకులు కల్యాణం నిర్వహించారు. తాడిపత్రి డిఎస్పీ చిదానందరెడ్డి, గుత్తి సిఐ మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఘనంగా
లక్ష్మీ వేంకటేశ్వరస్వామి రథోత్సవం
అమరాపురం, ఫిబ్రవరి 10 : మండల కేంద్రంలో వెలసని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మ రథోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తెల్లవారుఝాము నుంచే స్వామివారికి అర్చనలు, హోమాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను గోవింద నామస్మరణ నడుమ మోసుకొచ్చి రథంపై కూర్చోబెట్టి పురవీధుల గుండా ఊరేగించారు. మహా మంగళ హారతి అనంతరం భక్తులకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో లడ్డూ, అన్నదాన ప్రసాదం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రత్నమ్మతోపాటు అనేక మంది భక్తులు పాల్గొన్నారు.
లక్ష్మీ నవనారసింహస్వామి రథోత్సవం
రాయదుర్గం, ఫిబ్రవరి 10 : పట్టణానికి దగ్గరలోని విప్రమలై కొండ ప్రాంతంలో వెలసిన శ్రీ లక్ష్మీనవనరసింహస్వామి రథోత్సవం శుక్రవారం ఎంతో వైభవంగా జరిగింది. ఈనెల 8 నుంచి జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం అడియాన్ శ్రీ రామ్మూర్తి స్వామిజీ అధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్‌ఐ మహానంది బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బిఎన్‌టి తిప్పేస్వామి, ధర్మారెడ్డి, గురురాఘవేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా మెట్టబండ
ఆంజనేయస్వామి రథోత్సవం
మడకశిర, ఫిబ్రవరి 10 : పట్టణ సమీపంలోని మెట్టబండ ఆంజనేయస్వామి బ్రహ్మరథోత్సవం శుక్రవారం భక్తజన సందోహం నడుమ వైభవంగా ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం ఆలయంలో ఆరాధన, కలశ స్థాపన, పంచామృతాభిషేకం, హోమాలు, రథాంగ హోమం వంటి పూజలు నిర్వహించారు. మూలవిరాట్‌ను వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడమ ఉత్సవ విగ్రహాలను మోసుకొచ్చి రథంపై కూర్చోబెట్టారు. అనంతరం రథాన్ని లాగారు. భక్తులు రథంపై అరటిపండ్లు, ధవనం వంటివి వేసి మొక్కుబడులు తీర్చుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, నగర పంచాయతీ ఛైర్మన్ ఓబన్న తదితరులు పాల్గొన్నారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం, ప్రసాద పంపిణీ చేపట్టారు.