అనంతపురం

రెండవ రోజు నామినేషన్లు నిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఫిబ్రవరి 14: పట్ట్భద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల శాసనమండలి ఎన్నికలకు సంబందించి మంగళవారం అభ్యర్థులు ఎవరు నామినేషన్లు దాఖలు చెయ్యలేదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. అభ్యర్థలు తమ నామినేషన్లు దాఖలు చేయడంలో అసంపూర్తిగా లేకుండా 4 సెట్ల నామినేషన్లును దాఖలు చేయాలని తెలిపారు. ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లును స్వీకరించబడుతాయని తెలిపారు.
అండర్ 12 టోర్నీ విజేత అనంతపురం జుట్టు
అనంతపురం సిటీ, ఫిబ్రవరి 14: కడపలో జరుగుతున్న ఆంధ్రా సౌత్‌జోన్ అండర్ 12 అంతర్ జిల్లా క్రికెట్ టోర్నీ విజేతగా అనంతపురం జుట్టు నిలిచింది. మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో చిత్తూరు జట్టుతో అనంతపురం జట్టు తలపడగా మొదట బ్యాటింగ్ చేసిన చిత్తూరు జట్టు 40 ఓవర్లులో 146 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయారు. బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు 26.5 ఓవర్లులో 150 పరుగులు సాధించి విజయం సాధించింది. ఈ జట్టు టైటిల్ సాధించడం పట్ల జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షులు మాంఛో ఫెర్రర్, కార్యదర్శి బిఆర్.ప్రసన్న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.
పిఎస్‌ఎల్‌వి-సి 37పై అవగాహన
అనంతపురం సిటీ, ఫిబ్రవరి 14: ఇస్రో నేడు నిర్వహించే పిఎస్‌ఎల్‌వి-సి 37 ప్రయోగంపై ఎస్కేయూలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఎబివిపి ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కరీమ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇస్రో నేడు చేస్తున్న ప్రయోగంతో భారతదేశానికి, కీర్తిప్రతిష్టలు వస్తాయని, ప్రపంచ దేశాల సరసన భారతదేశం ఒకటిగా పేరు వస్తుందని తెలిపారు. మరొక అతిథి ఆచార్య మురళీధర్‌రావు మాట్లాడుతూ ఇతర దేశాల ఉపగ్రహాలకంటే ఇస్రో నేడు ప్రయోగించే ఉపగ్రహం అత్యంత సాంకేతిక, విజ్ఞానం కల్గి వుంటుందని తెలిపారు. ఈ ఉపగ్రహంలో ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపడం అనేది చాలా ప్రయాసతో కూడుకున్నదని తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి నాయకులు హరికృష్ణ, శ్యామ్ సుందర్, సర్పరాజ్, మణికంఠేశ్వర, ఇతర విద్యార్థులు పాల్గొన్నారు.
శాంతినారాయణకు కొలకలూరి పురస్కారం
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 14: కథ, నవలా రచయిత డా.శాంతినారాయణకు కొలకలూరి భాగీరథీ కథానికా పురస్కారం లభించింది. ఆచార్య కొలకలూరి ఇనాక్ భార్య పేర నెలకొల్పిన పురస్కారానికి 2017కుగాను శాంతినారాయణను ఎంపిక చేశారు. మొత్తం ముగ్గురిని ఎంపిక చేయగా అందులో రాష్ట్రం నుండి శాంతినారాయణను, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుండి ఒక్కొక్కరిని చొప్పున ఎంపిక చేశారు. శింగనమల మండలం బండమీదపల్లి గ్రామానికి చెందిన శాంతినారాయణ అధ్యాపక వృత్తి కొనసాగుతూ పదవీ విరమణ చేశారు. ఈయన విద్యార్థి దశలోనే రచనల పట్ల ఆసక్తి చూపేవారు. కథా రచయితగా, నవలా రచయితగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అందించే వివిధ పురస్కారాలను అందుకున్నారు. ఈయన రచనల్లో పల్లేరు ముల్లు, నమ్ముకున్న వాద్యం, కొండచిలువ మొదలైన కథా సంపుటాలు, పెనే్నటి మలుపులు నవలలు ప్రసిద్ధి చెందినవి. కరవు పరిస్థితులు, గ్రామీణుల కష్టాలు, దళితుల పట్ల వివక్ష మొదలైనవి ఈయన రచనల్లో ప్రతిబింబిస్తాయి. ఈ నెల 26న హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో పురస్కార ప్రదానం జరుగుతుందన్నారు.

గడ్డి నిల్వ గిడ్డంగులకు నిధులు మంజూరు
* మార్చి నెలాఖరు నుంచి నిర్మాణాలు

అనంతపురం, ఫిబ్రవరి 14 : జిల్లాకు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ ద్వారా రెండు ఫాడర్ స్టోరేజ్ గోడౌన్లు (గ్రాసం నిల్వ గిడ్డంగులు) మంజూరయ్యాయి. ఇందులో భాగంగా ఒక్కొ గొడౌన్‌కు రూ.2.5 కోట్ల చెప్పున ఆర్‌ఐడిఎఫ్ ద్వారా రూ.5.5 కోట్లు వెచ్చించనున్నారు. వీటిలో బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లిలోని ఫాడర్ సీడ్ మల్టిప్లికేషన్ ఫాం(ఎఫ్‌ఎస్‌ఎంఎఫ్)లో ఒకటి, పెనుకొండలోని షీప్ ఫాంలో మరొకటి నిర్మించనున్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వాలి
అనంతపురం సిటీ, ఫిబ్రవరి 14: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే రాష్ట్రంలో టిడిపి, కేంద్రంలో బిజెపిలకు పతనం తప్పదని బిసి రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సాకే నరేష్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక బిసిఆర్‌పిఎస్ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఎన్నికల ముందు టిడిపి, బిజెపిలు అనేక హామీలు ఇచ్చి వాటిని అమలుచేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుచేస్తామని చెప్పి, అధికారంలో వచ్చి దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నా హామీలను అమలుచేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్, నాయకులు ప్రసాద్, శివ, రాజు, సాయిరాజు పాల్గొన్నారు.