అనంతపురం

రైతులకు మెరుగైన సేవలందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఫిబ్రవరి 14: రైతుల సంక్షేమానికి, అధిక దిగుబడి సాధించేందుకు మెరుగైన సేవలను అందించాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. మంగళవారం రైతు శిక్షణ కేంద్రంలో 2017 ఖరీఫ్ కాలానికి సాగుకు సమాయత్తం-కార్యాచరణ ప్రణాళికపై వర్క్‌షాపు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ గడిచిన సంవత్సరం ఎదురైన అనుభవాలను దృష్టిలో వుంచుకుని ఈ సంవత్సరం వాటిని అధికమించి రైతులకు మేలు చేసే చర్యలను తీసుకోవాలన్నారు. ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికలను రూపొందించుకుని పనిచేయాలని ఆదేశించారు. గత సంవత్సరం సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించచుకుని పారదర్శకంగా విత్తనాలను రైతులకు పంపణీ చేశామని, అయితే సకాలంలో వర్షాలు పడకపోవడంతో రెయిన్ గన్ల ద్వారా రక్షక తడులను అందించామన్నారు. 3-4 మాసాల్లోపు హంద్రీనీవాను పూర్తి చేసి మారాల, చెర్లోపల్లి రిజర్వాయర్లను నీటితో నింపుతామన్నారు. బుక్కపట్నం చెరువును నింపుతామని, అలాగే మడకశిరకు నీటిని తీసుకొని వెళ్లి మధ్యలో వున్న 250 చెరువులను నింపుతామన్నారు. గత సంవత్సరం పంపిణీ చేసిన రెయిన్‌గన్లు, స్ప్రింక్లర్లు, పైపులు, ఆయిల్ ఇంజన్లు ఇంకా ఎవరైనా రైతుల వద్ద వుంటే వెంటనే వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆయా మండల గోదాముల్లో నిల్వ చేయాలని ఆదేశించారు. ఈసారి వేరుశెనగ విత్తనాలతోపాటు బహు ధాన్యాలను పంపిణీ చేయాలన్నారు. మొత్తం 5 లక్షల ఎకరాల్లో రాగులు, సజ్జలు, జొన్నలులాంటి బహు ధాన్యాలను రైతులు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో లక్ష ఎకరాలు స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా, మరో 4 లక్షల ఎకరాలను వ్యవసాయ శాఖ ద్వారా సాగయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వున్న 6.90 లక్షల పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు. జిల్లాలో 53 మండలాల్లో 63 గోదాములను వ్యవసాయ శాఖ ద్వారా నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం గ్రామ పంచాయతీ స్థాయిలో రేషన్ షాపుల ద్వారా విత్తనాలను పంపిణీ చేసేందుకు చర్యలను చేపట్టాలని ఆదేశించారు. ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకుని, వాటికి అనుగుణంగా సూక్ష్మ పోషకాలను వాడాల్సి ఉంటుందని తెలిపారు. 2014-15 సంవత్సరానికి ఇంకా ఇన్‌పుట్ సబ్సిడీ అందుకోని రైతులు ఎవరైనా వుంటే ఆధారాలు జాబితాతో వస్తే వారికి ఇన్‌పుట్ సబ్సిడీని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెసి-2 సయ్యద్‌ఖజామొహిద్దీన్, జెడి శ్రీరామ్మూర్తి, రైతు శిక్షణ కేంద్రం ఉప సంచాలకులు జయచంద్ర, ఆత్మ పిడి నాగన్న, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఉపగ్రహాల ప్రయోగం
విజయవంతం కావాలని బైక్ ర్యాలీ
* జాతీయ జెండాలతో శాస్తవ్రేత్తలకు సంఘీభావం
హిందూపురం టౌన్, ఫిబ్రవరి 14 : ఇస్రో ఆధ్వర్యంలో నేడు నిర్వహిస్తున్న 104 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ మంగళవారం పట్టణంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగాస్థానిక సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించారు. ప్రతి బైక్‌కు పెద్దపాటి జాతీయ జెండా కట్టుకుని జయహో భారత్ అంటూ నినాదాలు చేశారు. పొట్టి శ్రీరాములు సర్కిల్, ఎంఎఫ్ రోడ్డు, పరిగి బస్టాండ్, కెఎల్‌రోడ్డు, అంబేద్కర్ సర్కిల్, సద్భావనా సర్కిల్, గురునాథ్ సర్కిల్ మీదుగా మేళాపురం సర్కిల్‌లో ఉన్న తెలుగుతల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు మాట్లాడుతూ దేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మరింత అభివృద్ధి చెంది వాటి ఫలాలు సామాన్యులకు అందాలన్న ఉద్దేశంతో శాస్తవ్రేత్తలు పరిశోధనలు చేయడం హర్షణీయమన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా 104 ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశ పెడుతుండగా గర్వ కారణమన్నారు. ప్రతి భారతీయుడు ఇందుకు గర్వ పడాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, అనధికారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, మాజీ సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సర్వమత ప్రార్థనలు
భారత అంతరిక్ష కేంద్రం ఆధ్వర్యంలో చేపడుతున్న 104 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ మంగళవారం స్థానిక అంబేద్కర్ సర్కిల్‌లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నాయకులు, మత పెద్దలు, ఎన్‌జిఓ సంఘం నాయకులు, ప్రజాసంఘాల సభ్యులు అన్ని మతాల పెద్దలతో ప్రార్థనలు చేయించి ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
గల్ఫ్ బాధితులకు విముక్తి
కదిరి, ఫిబ్రవరి 14: ఉపాధి కోసం గల్ఫ్ దేశం నుండి అక్కడి సేఠ్‌ల వద్ద నరకయాతన పడుతున్న ఇరువురు భార్య భర్తలకు కదిరి పోలీసులు విముక్తి కలిగించారు. పట్టణ సిఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో కదిరి డిఎస్పీ వెంకట రామాంజినేయులు వివరాలు తెలియజేశారు. తనకల్లు మండలం కొక్కంటికి చెందిన ఖాదర్‌బాషా ఉపాధి కోసం బ్రోకర్లు అయూబ్, హిదాయతుల్లా మాయమాటలు విని గల్ఫ్ దేశానికి వెళ్లారన్నారు. ఖాదర్‌బాషా భార్యను కూడా ఈ ఇరువురు ఏజెంట్లే గల్ఫ్‌కు పంపారని, అక్కడ వారు నరకయాతన పడ్డారన్నారు. సేఠ్‌ల వేధింపులకు తాళలేక తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఏజెంట్లకు తెలిపితే వారు పట్టించుకోలేదన్నారు. దీంతో ఆ దంపతుల కుమారుడు ఫయాజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా హ్యూమెన్ ట్రాఫికింగ్ వింగ్ సిఐ లక్ష్మణ్, ఎస్‌ఐ జైపాల్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఇన్‌చార్జ్ రూరల్ సిఐ శ్రీనివాసులు విచారణ చేసి బాధితులను సౌదీ నుండి రప్పించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా గల్ఫ్ బాధితులు ఖాదర్‌బాషా, షాహీనాలు మాట్లాడుతూ సేఠ్‌ల బాధలు తాళ లేక తాము అక్కడే చచ్చిపోతామేమోనని, తమ పిల్లలను కూడా చూడలేము ఏమోనని అక్కడ జరిగిన బాధలను వివరించారు. ఏజెంట్లకు తమ బాధలు చెబితే పట్టించుకోలేదని, తమకు జీతాలు కూడా ఇవ్వకుండా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేశారని వాపోయారు. తమకు భారతదేశానికి రప్పించిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పట్టణ సిఐ శ్రీనివాసులు, హ్యూమెన్ ట్రాఫికింగ్ వింగ్ సిఐ లక్ష్మణ్, తనకల్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.