అనంతపురం

అధినేత వద్ద అసమ్మతి చిట్టా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 17 : జిల్లా టిడిపి సమన్వయ కమిటీతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు విజయవాడలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో ఏర్పాటు చేసిన సమీక్షలో భాగంగా నేటి మధ్యాహ్నం 4 గంటలకు సమయమిచ్చారు. ఈ సమావేశంలో జిల్లాలో పార్టీ స్థితిగతులు, భవిష్యత్ కార్యచరణ, పార్టీ పటిష్టత, ఐక్యత ప్రాధాన్యత, విభేదాలు, అసమ్మతులు తదితర అంశాలపై సిఎం లోతుగా చర్చించే అవకాశం ఉంది. సమన్యయ కమిటీ సభ్యులుగా ఉన్న టిడిపి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే బికె.పార్థసారధి, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, ఎంపిలు జెసి దివాకర్‌రెడ్డి, నిమ్మల కిష్టప్పతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, నగర పాలక సంస్థ మేయర్, మున్సిపల్ చైర్మన్లు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జులు, రాష్ట్ర అర్గనైజింగ్ సెక్రటరీ, రాష్ట్ర సెక్రటరీలు, ఎక్స్ అఫిషియో సభ్యుడు, జిల్లా పార్టీ ప్రచార కార్యదర్శితోపాటు బిసి, వడ్డెర కో ఆపరేటివ్ ఫైనాన్స్, ఫెడరేషన్ల చైర్మన్లు తదితరులు సుమారు 30 మంది సమావేశానికి హాజరు కానున్నారు. వీరితోపాటు బిసి సంక్షేమం, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర పార్టీ నేతలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పార్టీ స్థితిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లాలో పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు, అసమ్మతులపై ఘాటుగా హెచ్చరించే అవకాశం ఉంది. ఇప్పటికే సిఎం వద్ద జిల్లా పార్టీ నేతల రచ్చలపై చిట్టా మొత్తం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా అనంతపురం, కదిరి, ధర్మవరం, తాడిపత్రి, పెనుకొండ తదితర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపిలు, పార్టీ నేతల మధ్య రగులుతున్న విభేదాల కుంపట్లపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే అనంతపురంలో రోడ్ల విస్తరణ, అనంతపురం, హిందూపురం, ధర్మవరం (అహుడా) పట్టణాభివృద్ధి అథారిటీ, అనంతపురం నుంచి రాజధానికి ఏర్పాటు చేయనున్న ఫోర్ లేన్, సిక్స్ లేన్ ఎక్స్‌ప్రెస్ వేపైనా చర్చించే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
స్థానిక సంస్థల
ఎమ్మెల్సీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి?
* నేడు అధికారిక ప్రకటన!

అనంతపురం, ఫిబ్రవరి 17 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుణపాటి దీపక్‌రెడ్డినే ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీపక్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. నేడు రాజధానిలో జరగనున్న జిల్లా సమన్వయ కమిటీ సభ్యుల సమావేశంలో దీపక్‌రెడ్డి పేరు ఖరారు చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మెట్టు గోవిందరెడ్డి కొనసాగుతున్న విషయం విధితమే. సమావేశానికి దీపక్‌రెడ్డిని కూడా సిఎం ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కాగా సిట్టింగ్ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి కూడా ఈసారి మళ్లీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఉబలాటపడుతున్నారు. దీనికితోడు చీఫ్‌విప్ కాలవ సైతం మెట్టుకే ఇవ్వాని సిఎంకు విన్నవించినట్లు సమాచారం. అయితే రాయదుర్గం నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జిగా ఉన్న దీపక్‌రెడ్డి 2014 ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఆశించినా దక్కలేదు. దీంతో భవిష్యత్తులో ఏదో ఒక అవకాశం ఇస్తామని, ఆ స్థానానికి కాలవ శ్రీనివాసులును పోటీకి నిలిపారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో తమ మేనల్లుడైన దీపక్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని తాడిపత్రి ఎమ్మెల్యే జెసి.ప్రభాకరరెడ్డి, ఎంపి జెసి దివాకర్‌రెడ్డి సిఎంను కోరినట్లు తెలుస్తోంది. ఇదే సందర్భంలో పలువురు ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీలు కూడా దీపక్‌రెడ్డికే మద్దతు ఇచ్చినట్లు సమాచారం. దీపక్‌రెడ్డి సన్నిహితులు, పలువురు ఎమ్మెల్యేలు ఇటీవల సిఎం చంద్రబాబును కలిసి ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో జిల్లాలో టిడిపి మరింత పటిష్టంగా ఉండాలంటే బలమైన నాయకుడు అవసరమైన నేపథ్యంలో దీపక్‌రెడ్డికి అవకాశం ఇస్తే, ఇద్దరు మామలు (జెసి సోదరులు), జిల్లాలోని మెజార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ ఎమ్మెల్సీలు సంపూర్ణ మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. దీపక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడం వల్ల రానున్న 2019 ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని సిఎం కూడా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు కథనం. కాగా రాయదుర్గం నియోజకవర్గంలో పార్టీ పటిష్టతను దిపక్‌రెడ్డి విశేష కృషి చేయడం కూడా ఎమ్మెల్సీగా అవకాశం దక్కడానికి కలిసి వచ్చే అంశమని పేర్కొంటున్నారు.
హోదా కన్నతల్లి..ప్యాకేజీ సవతితల్లి!
* పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి
అమడగూరు, ఫిబ్రవరి 17: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కన్నతల్లి లాంటిదని, ప్రత్యేక ప్యాకేజీ సవతితల్లి వంటిదని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా అమడగూరు మండలం మహమ్మదాబాద్‌లో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తాము కన్నతల్లి లాంటి ప్రత్యేక హోదానే కోరుతున్నామన్నారు. అయితే టిడిపి ప్రభుత్వం సవతితల్లి లాంటి ప్యాకేజీ కోసం పాకులాడుతోందని ఆరోపించారు. ప్రత్యేక హోదావల్ల ప్రజలకు అనేక లాభాలున్నాయన్నారు. ప్యాకేజీ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలుపొందారని, అనంతరం వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. దాదాపు 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు అందులో ఏఒక్కటీ నెరవేర్చలేదన్నారు. రైతుల రుణమాఫీకి రూ. 87 వేల కోట్లు అవసరం కాగా, కేవలం రూ. 8 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ, ఉచిత విద్యుత్‌ను అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అందించారని గుర్తుచేశారు. బెల్టుషాపుల రద్దు కోసం మొదటి సంతకం చేసిన చంద్రబాబు ప్రభుత్వం రద్దుకు ప్రయత్నించకపోగా ఊరూరా షాపులు ఎక్కువైనా పట్టించుకోవడం లేదన్నారు. యుపి ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ రుణమాఫీకి హామీ ఇచ్చారన్నారు. ఎపిలో కూడా రుణమాఫీకి ముఖ్యమంత్రి ప్రధానిపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పనితీరుపై చెప్పేందుకు ప్రత్యేకంగా ఏమీ లేదన్నారు. ప్రచార ఆర్భాటం తప్ప చేస్తున్నదేమీలేదని ఎద్దేవాచేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే నాగరాజారెడ్డి, పిసిసి కార్యదర్శి షాన్‌వాజ్, జిల్లా అధ్యక్షులు కోటా సత్యం తదితరులు ఉన్నారు.

18కి చేరిన ఎమ్మెల్సీ నామినేషన్లు
అనంతపురం సిటీ, ఫిబ్రవరి 17 : పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారానికి 18 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో భాగంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు బచ్చల పుల్లయ్య, కత్తి నరసింహారెడ్డి, గొల్ల గంగాధర్, ఓంటెరు శ్రీనివాసరెడ్డి, గ్రాడ్యుయేట్‌లకు సంబంధించి ఎం.గేయానంద్, బొగ్గుల గుర్రప్ప, ఈ.మహేష్, కె.జనార్ధన్‌రెడ్డి, ఇల్లూరు ఉమాకాంత్‌రెడ్డి, టి.నాగార్జునరెడ్డి, రవికుమార్ శుక్రవారం నగరంలో ర్యాలీగా నామినేషన్లు వేశారు. నాలుగు రోజుల్లో 18 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నగరంలో ర్యాలీలు, కోలాహలంగా నామినేషన్లును దాఖలు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నలుగురు, గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీకి ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల సహా రిటర్నింగ్ అధికారిణి, డిఆర్‌ఓ మల్లీశ్వరీదేవి తెలిపారు. ఒక్కొక్కరు నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు.
వెనక్కు తగ్గని ‘పురం’ అసంతృప్తనేతలు
* ‘దూత’ వచ్చినా లేపాక్షిలో తూతూమంత్రంగా సమావేశం
హిందూపురం, ఫిబ్రవరి 17 : నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తనేతలు కొలిక్కి రావడం లేదు. ఎందుకంటే లేపాక్షిలో శుక్రవారం జరిగిన సమావేశమే ఇందుకు నిదర్శనం. కొద్దిరోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కృష్ణమూర్తిని పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ కోసం వచ్చిన కృష్ణమూర్తిని పంపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు సిసి వెంకట్రాముడు, అబ్ధుల్‌ఘనీ, రాష్ట్ర బిసి కార్పొరేషన్ చైర్మన్ పామిశెట్టి రంగనాయకులు, టిడిపి నేత అంబికా లక్ష్మీనారాయణను గురువారం ప్రత్యేకంగా కలిసి మంతనాలు సాగించారు. అయినప్పటికీ లేపాక్షిలో జరిగిన సంస్థాగత ఎన్నికలకు పదుల సంఖ్యలో కూడా హాజరుకాకపోవడం చర్చనీయాంశమవుతోంది. మార్కెట్‌యార్డు చైర్మన్ కిష్టప్ప, ఎంపిపి హనోక్ తదితర సాధారణ నాయకులు తప్ప తదితర మండల స్థాయి ముఖ్య నాయకులు హాజరు కాకపోవడం అసమ్మతిని మరోమారు స్పష్టం చేస్తోంది. ఇదిలాఉండగా శుక్రవారం సాయంత్రం చిలమత్తూరు జడ్పీటీసీ లక్ష్మినారాయణరెడ్డి తోటలో ఆ మండలానికి చెందిన అసంతృప్తి నాయకులతో కృష్ణమూర్తి సమావేశం కాగా ఎంపిపిని తప్పించేంత వరకూ తాము భాగస్వాములు కామని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదే వైఖరిని లేపాక్షి మండలంలో కూడా నిర్వహించిన సమావేశంలో మెజార్టీ అసంతృప్త నాయకులు తెలియజేస్తూ హాజరు కాలేదని తెలుస్తోంది. ఏదేమైనా సంస్థాగత ఎన్నికల కోసం నియమితులైన కృష్ణమూర్తి అసంతృప్తి నేతలతో సమావేశమైనా కొలిక్కి రాకపోవడం చర్చనీయాంశమవుతోంది.
గోవును రాష్టమ్రాతగా గుర్తించాలి
* పూజ్యశ్రీ గోపాలమణి మహరాజ్
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 17 : గోవును రాష్టమ్రాతగా ప్రభుత్వం గుర్తించాలని పూజ్యశ్రీ గోపాలమణి మహరాజ్ కోరారు. గోప్రతిష్ఠ భారతయాత్ర నిర్వహిస్తూ శుక్రవారం నగరానికి వచ్చిన ఆయనకు భారతీయ గో క్రాంతి మంచ్, ఇస్కాన్, గోసంరక్షణ సేవా సమితి, హిందూ చైతన్య వేదిక, ధర్మజాగరణ సమితి తదితర సంస్థ లు ఘనస్వాగతం పలికాయి. ఇందు లో భాగంగా నగరంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి సప్తగిరి సర్కిల్, టవర్‌క్లాక్, బసవన్నకట్ట మీదుగా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న గోశాల వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గోశాలలో ఏర్పాటు చేసిన సభలో గోపాలమణి మాట్లాడుతూ అమ్మ శబ్ధ ం చాలా శక్తివంతమైందన్నారు. అమ్మ ప్రపంచానికి ఆవునిచ్చిందన్నారు. భారతదేశంలో 80 కోట్లమందికి తల్లి అయిన గోవును ప్రభుత్వం పశువులా చూస్తోందన్నారు. తల్లిలాంటి గోవును పశువుగా ఎప్పటికి చూస్తామో అప్పటి వరకు గోహత్యను నివారించలేమన్నారు. 70 సంవత్సరాలుగా గో హత్యను నివారించాలని అరుస్తున్నా ఎందుకు ఆపలేకున్నామంటే గోవును పశువుగా చూస్తున్న కారణంగానే అని అన్నారు. హిందూ సంస్కృతిలో గోమాతను ఏనాడూ పశువుగా చూడలేదన్నారు. గోవు పేడతో ఇల్లు పవిత్రమవుతుందని, గోమూత్రం తాగితే పంచభూతాలతో కూడిన శరీరం పవిత్రమవుతుందన్నారు. సనాతన హిం దూ ధర్మం గోవును గాయత్రీదేవిగా చూస్తోందన్నారు. ఇకపోతే హిందువు ల్లో మతమార్పిడులు జరగడాన్ని దుర్దశగా స్వామి పేర్కొన్నారు. తల్లిలాంటి గోవును బజారుకు వదిలి, గుడిలో ప్రతిమను పూజిస్తున్నామన్నారు. 4 లక్షలకు పైగా హిందూ ఆలయాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తన ఖజానా నింపుకుంటోందన్నారు. గోవుకు దేశంలో తల్లిస్థానం దక్కకపోతే అమెరికా, పాకిస్తాన్‌లో దక్కుతుందా అని ప్రశ్నించారు. భారత్‌లో నివశించాలంటే గోవును గౌరవించాల్సిందేనన్నారు. గోరక్షణకు శివాజీ బాల్యంలోనే నడుం బిగించాడన్నారు. ప్రభుత్వం ఎందుకు గోరక్షణ చేయడం లేదన్నారు. సంస్కారాలన్ని గోవుతోనే ప్రారంభమవుతాయన్నారు. గోరక్షణ, సంరక్షణకోసం ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలన్నారు. గోచర భూముల్ని ప్రకటించాలన్నారు. ఇప్పటి వరకు 361 జిల్లాల్లో యాత్ర పూర్తయిందని, 2018 ఫిబ్రవరి 18 నాటికి 676 జిల్లాల్లో యాత్ర పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం అందరిచేత స్వామి ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో ఇస్కాన్ మేనేజర్ దామోదర గౌరంగదాస్ ప్రభు, శ్రీపాదవేణు, ఇల్లూరు ఉమాకాంతరెడ్డి, రంగారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, రంగారెడ్డి, శంకర్‌లాల్, గౌతం, విజయకుమార్, అశోక్, రాజస్థాన్ సమాజ్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో గో భక్తులు పాల్గొన్నారు.
పట్టు పరిశ్రమ అభివృద్ధి కృషి
* రూ.95 కోట్లతో ప్రతిపాదనలు
* రాష్ట్ర కమిషనర్ చిరంజీవ్ చౌదరి
హిందూపురం రూరల్, ఫిబ్రవరి 17 : రాష్ట్రంలో పట్టు పరిశ్రమ అభివృద్ధి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ కమిషనర్ చిరంజీవ్‌చౌదరి తెలిపారు. శుక్రవారం స్థానిక పట్టుగూళ్ల విక్రయ కేంద్రాన్ని సందర్శించి పలు అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017-18 సంవత్సరానికి రూ. 95కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. పట్టు పరిశ్రమలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే దేశంలోనే పట్టు ఉత్పత్తుల్లో ప్రథమస్థానం పొందవచ్చన్నారు. అనంతరం ట్విస్టర్లు, రీలర్లను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు విన్న అనంతరం కమిషనర్ స్పందిస్తూ పట్టు పరిశ్రమలో ప్రభుత్వం ఇప్పటికే పలు రాయితీలు అందిస్తోందని, అదనంగా ఇవ్వాలంటే సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వ పరిశీలకులను పంపాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో పట్టు పరిశ్రమ అభివృద్ధికి 13 క్లస్టర్లగా విభజించామన్నారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో చైనా సాంకేతిక సహకారంతో ఆటోమేటిక్ రీలింగ్ యంత్రాలను స్థాపిస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం 75శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. నోట్ల రద్దు అనంతరం నగదు లావాదేవీల విషయంలో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయని, వీటిని పరిష్కరించడానికి అవగాహనా సదస్సు ఏర్పాటు చేస్తామన్నారు. నాణ్యతా ప్రమాణాలు పెంపొందించడానికి శాఖాపరంగా శిక్షణ ఇచ్చి క్షేత్రస్థాయిలో పట్టుగూళ్ల అధిక దిగుబడులకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. పట్టు పరిశ్రమలో రైతులు, రీలర్లు, ట్విస్టర్లు తమ తమ వృత్తిలో నాణ్యత పెంపొందించడం ద్వారా మెరుగైన ఉత్పత్తులు వస్తాయన్నారు. తద్వారా ఆర్థిక స్తోమత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమశాఖ జెడి అరుణకుమారి, అదనపు డైరెక్టర్ నజీర్ సాహెబ్, ఎడిలు రామలింగారెడ్డి, శోభారాణి, నాగరంగయ్య, వెంకటరమణ, బ్యాంకు ఆఫ్ బరోడా మేనేజర్ కరుణాకర్, వేణుగోపాల గుప్త, రత్నం, అక్బర్, రీలర్లు, ట్విస్టర్లు పాల్గొన్నారు.
పట్టుగూళ్ల ఉత్పాదక నిర్వహణపై సమీక్ష
స్థానిక ఆంధ్రప్రదేశ్ పట్టు పరిశోధన, శిక్షణ కేంద్రంలో రాయలసీమ జోన్ పట్టు పరిశ్రమశాఖ అధికారులతో బైవోల్టీన్ పట్టుగూళ్ల ఉత్పాదక సామర్థ్యం పెంపుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నాణ్యమైన బైవోల్టీన్ పట్టుగూళ్ల ఉత్పత్తి, నాణ్యత పెంపు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 83 వేల ఎకరాల్లో పట్టు తోటలు పెంచుతున్నట్లు తెలిపారు. ఈ విస్తీర్ణాన్ని మరింత పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యమైన పట్టుగూళ్ల ఉత్పత్తి ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయన్నారు. తద్వారా వారి ఆర్థిక స్తోమత పెరుగుతుందన్నారు. అదేవిధంగా శాస్తవ్రేత్తల సహకారంతో నూతన వంగడాలను రైతుల వద్దకు తీసుకెళ్లి వారిలో సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా పట్టు తోటల పెంపకానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టు పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాజు, అదనపు డైరెక్టర్ నజీర్ సాహెబ్, చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, ప్రకాశం, ఒంగోలు జిల్లాల పిడిలు అరుణకుమారి, సుమన, కుల్లాయిరెడ్డి, సదాశివరెడ్డి, చిత్తరంజన్‌శర్మ, సత్యారావు, వివిధ జిల్లాల ఎడిలు తదితరులు పాల్గొన్నారు.
టిడిపి అసంతృప్తవాదులతో
పర్యవేక్షకుడి మంతనాలు
చిలమత్తూరు, ఫిబ్రవరి 17: మండలంలోని తెలుగుదేశం పార్టీ అసంతృప్తివాదులతో నియోజకవర్గ సంస్థాగత ఎన్నికల పర్యవేక్షకులు క్రిష్ణమూర్తి శుక్రవారం జడ్పీటీసీ లక్ష్మినారాయణరెడ్డి తోటలో మంతనాలు సాగించారు. ఈ సందర్భంగా పలువురు మం డలంలో ప్రస్తుతం ఎంపిపి వర్గీయులు పార్టీ అభివృద్ధిపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తుండటంతో ఓర్వలేక అసంతృప్తివాదులుగా మారాల్సి వచ్చిందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా పలు రకాలుగా మండల ప్రజలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారన్న విషయాలు ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి వెళ్లలేదని, దీంతో అక్రమాలు పెచ్చుమీరిపోయాయ ని పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై బహిరంగ సభ ను ఏర్పాటు చేయాలని భావిస్తే 144 సెక్షన్, 30 పోలీ సు యాక్టు విధించి తమను విడగొట్టాలని చూశారని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. అయితే ఎంపిపి వర్గీయులు ర్యాలీలు, ధర్నాలు చేసుకోవచ్చా అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తాము టిడిపికి వ్యతిరేకం కాదని విధేయులమేనని చెప్పినట్లు సమాచారం. ఈ సమావేశంలో జడ్పీటీసీ లక్ష్మినారాయణరెడ్డి, మాజీ ఎంపిపి శివప్ప, ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, నాయకులు రంగారెడ్డి, పాపన్న, లక్ష్మినారాయణ యాదవ్, గౌరీశంకర్, బ్రహ్మానందరెడ్డి, చెర్లోపల్లి నరసింహారెడ్డి, బాలాజీ పాల్గొన్నారు.
అవమానించినందుకే హత్య
* లాయర్ హత్య కేసు నిందితుల లొంగుబాటు
కణేకల్లు, ఫిబ్రవరి 17 : అవమానించినందుకే లాయర్ సునీతను హత్య చేశామని నిందితులు ఒప్పుకున్నారు. ఈనెల 15న పట్టణంలో జరిగిన సునీ త హత్యకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడు హనుమంతరావు తహశీల్దార్ వెంకటశేషు ఎదుట లొంగిపోయాడు. ఈసందర్భంగా స్థానిక పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిఐ చలపతిరావు మాట్లాడుతూ 2015లో మంగలి లక్ష్మమ్మ, లాయర్ సునీత, భర్త హరీష్‌ను కలిసి బెంగళూరులో చదువుతున్న తన కుమారుడు చదువు కోసం రూ.50వేలు అప్పు ఇవ్వమని కోరింది. ఇందుకు తమ దగ్గర డబ్బు లేదని, వేరేవారి వద్ద ఇప్పిస్తామని అ యితే ఏదైనా భూమి తనఖా పెట్టాలని లాయర్ సునీత చెప్పింది. ఇందుకు మంగళి లక్ష్మమ్మ, కుమారుడు హనుమంతరావు భూమి తాలూకా పత్రాలను తీసుకెళ్లి ఇచ్చారు. అయితే డబ్బులు ఇచ్చేవారు ఈరోజు రాలేదని, రేపు వస్తారని చెప్పి భూమిపత్రాలను రూ.50, 100 ఖాళీ స్టాంపుల పత్రాలపై సంతకాలు చేయాలని సునీత చెప్పింది. ఆమెపై నమ్మకంతో ఖాళీ స్టాంప్‌లపై సంతకాలు చేశామన్నారు. మరుసటిరోజు వచ్చి డబ్బును అడగ్గా వారు ఇంకా ఇవ్వలేదని చాలాసార్లు చెప్పింది. ఈనేపథ్యంలో ఓ రోజు లక్ష్మమ్మ, కుమారుడు హనుమంతరావు గట్టిగా అడగడంతో తమకు డబ్బు ఇంకా రాలేదని సునీతా గట్టిగా చెప్పింది. ఈ ఘటన తర్వాత రెండు రోజులకు జిల్లా కోర్టు నుంచి లక్ష్మమ్మ, హనుమంతరావు భూమి రూ. 29,22,000కు కొనుగోలు చేసినట్లు, ఇందుకు సంబందించి రూ.15లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చామని, మిగిలిన పైకం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని నోటీసులు పంపించారన్నారు. దీంతో కంగారు పడిన బాధితులు లాయర్ సునీతను నిలదీశారు. ‘మీకు చేతనైంది చేసుకోండి’ అని సునీత తెగేసి చెప్పింది. ఊరులో పెద్దమనుషుల దగ్గరికి వెళ్లి పంచాయితీ అడగ్గా ఈ కేసు వల్ల తమకు రూ.1.70 లక్షలు ఖర్చైందని, ఆ డబ్బు ఇస్తే పత్రాలు ఇస్తామని సునీత చెప్పింది. అప్పట్లో పెద్దమనుషులు రూ. 1.50 లక్షలకు ఒప్పందం కుదిర్చారన్నారు. ఈనేపథ్యంలో ఈనెల 15న హనుమంతు బెంగుళూరు నుంచి కణేకల్లుకు వచ్చాడు. లాయర్ సమీపంలో ఇంటి వద్ద నిలబడి ఉండగా లాయర్ సునీత ‘ఏం చేసుకుంటావో చేసుకో’ అంటూ సైగలతో రెచ్చగొట్టింది. ఇది అవమానకరంగా భావించిన హనుమంతరావు స్నేహితుడు వరప్రసాద్‌కు విషయం చెప్పాడు. దీంతో లాయర్‌తో మాట్లాడుదామని హత్య జరిగిన రోజు సాయంత్రం 4.30కు సునీత ఇంటికెళ్లి భర్త హరీష్‌తో మాట్లాడుతుండగా ‘నాభర్తతో మీకేం పని’ అంటూ సునీత వారించింది. ఈసమయంలోనే వరప్రసాద్ సునీతతో మాట్లాడుతుండగా హనుమంతరావు వెనుకి నుంచి జుట్టు పట్టుకుని చికెన్ సెంటర్ నుంచి తెచ్చిన కత్తితో గొంతు కోశాడు. చనిపోయిందో లేదనే అనుమానంతో అక్కడే ఉన్న పదునైన రాడ్‌తో గొంతులో పొడిచాడు. మృతి చెందిందని తెలియడంతో అక్కడి నుండి పరారైనట్లు నిందితులు ఒప్పుకున్నారన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను కోర్టుకు హాజరుపరచినట్లు తెలిపారు.
మయూర వాహనంపై శివపార్వతులు
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 17 : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోడ్డు శ్రీ కాశీవిశే్వశ్వర కోదండ రామాలయంలో శివపార్వతులు శుక్రవారం మయూర వాహనంపై విహరించారు. బ్రహోత్సవాల ప్రారంభం సందర్భంగా సుప్రభాతసేవ, గణపతిపూజ, మహన్యాస పారాయణము, ఏకాదశవార రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను అత్యంత సుందరంగా అలంకరించిన మయూర వాహనంపై ఊరేగించారు. అనంతరం మొదటి, రెండోరోడ్లలో నగరోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీ సంరక్షిత మహిళా మండలి భజన బృందం భజన, కోలాటం, తరిమెల శ్రీ వేంకటేశ్వర భజన మండలి భజనలు, టిటిడి పురాణ పండిట్ వేణుగోపాల్‌చే పురాణ ప్రవచనం భక్తులను అలరించాయి. ఈకార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
ప్రశాంతి నిలయంలో సాయి గానామృతం
పుట్టపర్తి, ఫిబ్రవరి 17 : భగవాన్ సత్యసాయి బాబా సన్నిధి ప్రశాంతి నిలయంలో నిర్వహించిన సాయిగానామృతం ఆహూతులను అలరించింది. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లురుకు చెందిన విఖ్యాత వీణ విద్వాంసుడు శ్రీరామ్ పార్థసారధి, గురుమూర్తి, అనిరుద్ బృందం సంగీత కచేరి నిర్వహించారు. ఇళయరాజ, ఏఆర్.రెహమాన్, రవీంద్రజైన్, దక్షిణామూర్తి, కేవి.మాధవ్‌లాంటి ప్రముఖ సంగీత దర్శకుల వద్ద 500 సినిమాలకు పైగా వీణావాయిద్యాలు అద్భుతంగా ప్రదర్శించిన శ్రీరామ్ పార్థసారధి తను ఆరాధించే సత్యసాయి సన్నిధిలో ఈ సదవకాశం రావడం మహదానంగా అభివర్ణించారు.
చిన్మయ జగదీశ్వరాలయంలో
కన్నులపండువగా విగ్రహ ప్రతిష్ఠ
* హాజరైన చిన్మయ మిషన్ అంతర్జాతీయ అధ్యక్షుడు తేజోమయానంద
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 17 : నగరంలోని తపోవనంలో చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ చిన్మయ జగదీశ్వరాలయంలో విగ్రహ ప్రతిష్ఠ శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. అత్యంత సుందరంగా నిర్మించిన ఆలయంలో మూడురోజుల పాటు ప్రతిష్ఠ మహోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి చిన్మయ మిషన్ అంతర్జాతీయ అధ్యక్షులు పూజ్యశ్రీ తేజోమయానంద హాజరై శివుని విగ్రహంతోపాటు శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈసందర్భంగా మూలవిగ్రహాలకు ఇరువైపుల ప్రణవ గణపతి, పార్వతీదేవి విగ్రహాలు, ఆలయం చుట్టూ ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, తేజోమయానంద పర్యవేక్షణలో భక్తుల శివనామస్మరణ మధ్య విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ అనంతరం పూర్ణాహుతితో పూజలు సమాప్తమయ్యాయి. తేజోమయానంద పూర్ణాహుతి సమర్పించారు. దీక్షావ్రతులకు తేజోమయానంద బ్రహ్మచర్యాదీక్ష ప్రసాదించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జీవుల్లోని చైతన్య స్వరూపమే శివుడు
* పూజ్యశ్రీ తేజోమయానంద
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 17 : జీవులలోని చైతన్య స్వరూపమే శివుడని చిన్మయ మిషన్ అంతర్జాతీయ అధ్యక్షులు పూజ్యశ్రీ తేజోమయానంద అన్నారు. తపోవనంలో నూతనంగా నిర్మించిన చిన్మయ జగదీశ్వరాయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శుక్రవారం సాయంత్రం త్యాగరాజ సంగీత సభలో జరిగిన కార్యక్రమంలో భక్తులనుద్దేశించి ప్రసంగించారు. శివ మహిమలు వర్ణణాతీతమని, శివునికి అనేక అంశలున్నాయన్నారు. శివ అనే శబ్ధానికి మంగళప్రదమైన అని అర్థమన్నారు. ప్రతి ఒక్కరిలో జీవం ఉన్నప్పుడే మంగళప్రదం అవుతుందని, జీవం లేకపోతే శవం అనబడుతుందన్నారు. శవాన్ని శివంగా మార్చేది జీవమేనన్నారు. శుద్దచైతన్యం అంతర్గతంగా, ప్రకృతి శక్తితో కూడినప్పుడే ఆయన జగదీశ్వరుడవుతాడన్నారు. పరమాత్మను వేదాలలో ఓంకార స్వరూపంగా చూస్తారన్నారు. శివుని యొక్క శక్తిని పార్వతి, ఉమ అని అంటారన్నారు. ఉమ అనే పదం ఓంకారంలో ఉన్నదని, అదేవిధంగా పార్వతి శివునిలో ఉన్నదన్నారు. శివుడు కేవలం లయకారుడు కాదని, సృష్టికంతా ఈశ్వరుడని అన్నారు. దుర్గుణాలను తొలగించుకునేందుకు శక్తికావాలన్నారు. హాలాహలాన్ని సేవించగల శక్తి ఉన్న శివునికి మాత్రమే దుర్గుణాలను తొలగించ గల శక్తిప్రసాదించే శక్తి ఉందన్నారు. సమాజంలోని దుర్గుణాలను తొలగాలంటే శక్తి స్వరూపుడైన శివుని పూజించాలన్నారు. ఈకార్యక్రమంలో స్వామి ఆత్మవిదానంద, స్వామిని ప్రపుల్ల మాతాజీ, తాళంకి కృష్ణమూర్తి, తాళంకి శ్రీ్ధర్, చంద్రహాసరెడ్డి, మురళీమోహన్‌రెడ్డి, చలపతిరెడ్డి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మద్దలచెరువులో బొప్పాయి చెట్ల నరికివేత
* భయాందోళనలో ప్రజలు
ధర్మవరం, ఫిబ్రవరి 17 : కనగానపల్లి మండలంలోని మద్దలచెరువు గ్రామంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు టిడిపి మద్దతుదారుడు రామాంజనేయులుకు చెందిన దాదాపు వందకు పైగా బొప్పాయి చెట్లను నరికివేశారు. ఈ ఘటనతో ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఎలాంటి కక్షలు రేగుతాయోనని గ్రామస్థులతోపాటు ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రామాంజనేయులు టిడిపిలో క్రియాశీలక కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఈనేపథ్యంలో చెట్లు నరికివేత ఘటన ఎలాంటి మలుపులు తిరుగుతుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెసుకున్న వెంటనే ఎస్‌ఐ రామారావు శుక్రవారం ఉదయం సిబ్బందితో వెళ్లి విచారించారు. గ్రామంలో ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు నెలకొన్న దాఖలాలు లేవని తెలిపారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అలాగే మండల టిడిపి నాయకులు నెట్టెం వెంకటేసు, ముకుందంనాయుడు, రైతు రామాంజనేయులుతో కలిసి ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. రైతు రామాంజనేయులుకు వ్యక్తిగత కక్షలున్న వారు నరికివేశారా? పార్టీలోని వ్యతిరేక వర్గం వారు చేశారా?, అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
పెనుకొండ, ఫిబ్రవరి 17 : పట్టణ సమీపంలో పాత ఆర్టీఓ చెక్‌పోస్టు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి దినేష్ (17) మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం రొద్దం మండలం తురకలాపట్నం కాగా కళాశాలకు పట్టణానికి వచ్చాడు. మధ్యాహ్నం భోజన సమయంలో అదే కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు రమేష్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై భోజనానికి వెళ్ళాడు. అనంతరం తిరిగి వస్తుండగా హిందూపురం వైపు నుండి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దినేష్ తీవ్ర గాయాలకు గురయ్యాడు. వెంటనే అతన్ని పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండగా మార్గమధ్యలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఆసుపత్రికి చేరుకొని సంతాపం తెలియచేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
హిందూపురం రూరల్, ఫిబ్రవరి 17 : మండల పరిధిలోని కిరికెర వద్ద ప్రదాన రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మురళి (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ తీవ్ర గాయాలపాలయ్యాడు. గౌరిబిదనూరుకు చెందిన వీరు హిందూపురం నుండి గౌరిబిదనూరుకు వెళుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్‌ను హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బాలుడి ఆత్మహత్య
రాయదుర్గం,్ఫబ్రవరి 17 : అమ్మ కొట్టిందని బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. పట్టణంలోని చంద్రబాబునాయుడు కాలనీలో నివాసముంటున్న మహేశ్ (10) తల్లితండ్రులు ఊరికిపోతున్న సమయంలో గొడవ చేయడంతో తల్లి కొట్టింది. దీంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో పేన్ల మందు తాగాడు. గమణించిన స్థానికులు పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చేర్పించారు. అక్కడి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.
చేనేత కార్మికుడి ఆత్మహత్య
ధర్మవరం టౌన్, ఫిబ్రవరి 17 : నేసిన పట్టుచీరలకు సరైన గిట్టుబాటు ధరలు లేకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక శాంతినగర్ రైల్వేగేటు వద్ద చేనేత కార్మికులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు శాంతినగర్‌కు చెందిన అన్నం వెంకటరమణ(34) అద్దె ఇంట్లో ఉంటూ కూలిమగ్గం నేస్తూ జీవనం సాగించేవాడు. వెంకటరమణకు ఎనిమిదేళ్ల క్రితం నాగమ్మతో వివాహమైంది. వీరికి సంతానం లేదు. దీనికితోడు అప్పులు ఎక్కువ అవడంతో తరచూ మానసిక ఆందోళనకు గురవుతుండేవాడు. ఇందులో భాగంగానే గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంకటరమణ శుక్రవారం ఉదయం శవమై తేలడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తి ఆత్మహత్య
ఉరవకొండ, ఫిబ్రవరి 17 : మండలంలోని ఆమిద్యాల గ్రామంలో వ్యక్తి ఉరేసుకుని శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమిద్యాల గ్రామానికి చెందిన మురళి (41) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎర్రచందనం నిందితుల అరెస్టు
* రెండు వాహనాలు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం
చెనే్నకొత్తపల్లి, ఫిబ్రవరి 17 : ఎర్రచందనం నిందితులు ఇద్దరిని అరెస్టు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెనే్నకొత్తపల్లి పోలీసులు తెలిపారు. శుక్రవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రామగిరి సిఐ యుగంధర్, ఎస్‌ఐ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ నిందితులు గౌడమని, సునీల్, ప్రసాద్, మహేంద్ర, కుమార్, శివశక్తినాదన్ తాడిపత్రి నుంచి గుత్తి మీదుగా ఎర్రచందనం దుంగల అక్ర మ రవాణా చేస్తుండేవారన్నారు. అయి తే అనంతపురం నుంచి బెంగుళూరు వైపు 15 ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు దామాజిపల్లి వద్ద వాహనా లు తనిఖీ చేస్తున్న ఎస్‌ఐ మహమ్మద్ రఫీకి సమాచారం అందడంతో వాహనాలు తనిఖీ చేస్తుండగా దుంగలను తరలిస్తున్న సుమో, ఫోర్డ్ కారు నిలపకుండా వెళ్లిపోయారన్నారు. దీంతో వెం బడించగా నిందితులు వాహనాలను వదిలి పారిపోయారన్నారు. అయితే ప్రసాద్, సునీల్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. మిగిలిన నలుగురిని త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు సిఐ తెలిపారు. దాదాపుగా ఎర్రచందనం విలు వ ప్రభుత్వ ధర ప్రకారం రూ.1లక్ష ఉంటుందన్నారు. వీరి వద్ద నుండి 8సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. కువ