అనంతపురం

పొట్టకూటి కోసమే వలస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమాడ, ఫిబ్రవరి 28: కుటుంబాల్ని పోషించుకోవడానికి పొట్ట చేతపట్టుకుని పట్టణాలకు వలస వెళ్తే వారు అదనపు సంపాదన కోసం పట్టణాలకు వెళ్తున్నారని మంత్రి పల్లె రఘునాథరెడ్డి కొత్త నిర్వచనం చెప్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 24వ తేదీన ఆంధ్రభూమిలో ప్రచురితమైన వలస అదే వరస కథనంలో నల్లమాడ మండలం కుటాలపల్లిలో 60శాతం మంది రైతులు కరవు వెళ్లారన్న కథనానికి స్పందించి సిపిఐ చేబట్టిన రైతు కరవు కన్నీటి యాత్రలో భాగంగా మంగళవారం కుటాలపల్లిని సిపిఐ జిల్లా నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ ఆకలితో వున్న వారికి కడుపునింపిన రైతన్నలు బతుకుతెరువు కోసం కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు వలసలు వెళ్ళారన్నారు. జిల్లా వ్యాప్తంగా 8 లక్షల మంది వలసలు వెళ్ళి కూలి పనులు చేసుకుంటూ ఫ్లైవోవర్ బ్రిడ్జిల కింద, మురికివాడల్లో తలదాచుకుంటున్నారన్నారు. రైతన్నలు తాము సాగు చేసిన పంటల కోసం చేసిన అప్పులు తీర్చుకోవడానికి, తమ పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టడానికి, తమ వృద్ధ తల్లిదండ్రులను, చిన్నచిన్న పిల్లలను ఇళ్ల వద్ద కాపలాగా వదిలేసి భార్య ఓ చోట, భర్త ఓ చోట పట్టణాల్లో కూలీ పనులు చేసుకుంటూ కష్టపడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందజేయాల్సిన మంత్రి పల్లె పట్టణాలకు వలస వెళ్తోంది అదనపు ఆదాయం కోసమని గ్లోబల్ ప్రచారానికి తెరతీయడం శోచనీయమన్నారు. ఇదే విషయాన్ని మంత్రి పల్లె సియం చంద్రబాబుకు తెలపడంతోనే ప్రభుత్వం కూడా వలస వెళ్తున్న వారికి ఏ మాత్రం సహాయం అందజేయడం లేదన్నారు. కంటిచూపు లేని వృద్ధ తల్లిదండ్రులను ఇళ్ల వద్దే వుంచి, ఏ మాత్రం ప్రపంచ జ్ఞానం లేని చిన్నారులను ఇళ్ల వద్ద వదిలేసి వలసలు వెళ్ళడం హృదయ విదారక దృశ్యాలన్నారు. 50 ఎకరాల భూమి వున్న రైతులు కూడా వలసలు వెళ్ళి బెంగళూరులాంటి నగరాల్లో ఫుట్‌పాత్‌పైన జీవనం కొనసాగిస్తున్న దుస్థితి మంత్రి పల్లెకు కనిపించకపోవడం విడ్డూరమన్నారు. ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని అన్ని చెరువులకు హంద్రీనీవా ద్వారా నీళ్లు నింపుతామని పదేపదే మంత్రి అబద్ధాలు చెప్తున్నారన్నారు. చెరువులకు నీళ్లు చేర్చడం కోసం పిల్లకాలువలు తవ్వడానికి కనీసం భూ సేకరణ కూడా జరగలేదన్నారు. అనంతపురం జిల్లాలో కరవు తాండవిస్తోందని ప్రతి రోజూ పత్రికల్లో, మీడియాలో కథనాలు వస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు తాగునీటి కోసం తిప్పలు పడుతున్నా వారి దాహం తీర్చాలన్న చిత్తశుద్ధి కూడా ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 168మంది రైతన్నలు, 32మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. అనంతపురం జిల్లా అంటే ప్రత్యేక అభిమానం వుందని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి యుద్ధ ప్రాతిపదికన అనంతపురం జిల్లా రైతన్నలకు ఎకరాకు రూ. 20వేలు చొప్పున పంట నష్టపరిహారాన్నిచ్చి ఆదుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా వచ్చే మొత్తాన్ని మాత్రమే రైతన్నలకు నష్టపరిహారం రూపంలో అందజేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందన్నారు. వరస కరవుతో అల్లాడుతున్న అనంత అన్నదాతల అన్ని రకాల రుణాలను తక్షణమే మాఫీ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మార్చి 24న జరగబోయే అసెంబ్లీ సమావేశాల సమయంలో అనంత రైతన్నలను తీసుకెళ్ళి రైతన్నల గోడు ప్రభుత్వానికి వినిపించేలా ధర్నా చేయనున్నట్లు రైతన్నలందరూ విరివిగా హాజరుకావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం కుటాలపల్లి గ్రామంలో అర్హులైన వృద్ధులు తమకు పింఛన్ రావడం లేదని సిపి ఐ నాయకుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్ళ కోసం గంటల తరబడి తాము ఎండలో వేచి చూడాల్సి వస్తోంది మహిళలు వాపోయారు. ఎస్సీ కాలనీలో ఇళ్ల వద్ద కాపలాగా వున్న వృద్ధులతో తమ పిల్లలు ఎక్కడెక్కడికి వలసలు వెళ్ళారంటూ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్, రామక్రిష్ణ, పుట్టపర్తి నియోజకవర్గ కార్యదర్శి ఆంజనేయులు, నల్లమాడ, ఓడిచెరువు, బుక్కపట్నం మండలాల కార్యదర్శులు కుంచపు చంద్ర, మున్న, బ్రహ్మ, ఏఐఎస్‌ఎఫ్ నాయకుడు కుళ్ళాయప్ప, టైలర్ గంగాద్రి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
హంస వాహనంపై విహరించిన
బుగ్గరామలింగేశ్వరుడు
తాడిపత్రి, ఫిబ్రవరి 28: శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజున మంగళవారం శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి హంస వాహనంపై విహరించారు. సుందర పుష్పాలతో అలంకృతుడై, పట్టుపీతాంబరాలు ధరించిన బుగ్గరామిలింగేశ్వరుడు తంబూర చేపట్టి హంస సవాహనంపై ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో మంగళవాయిద్యాలతో హంస వాహనంపై బుగ్గరామలింగేశ్వర స్వామి విహరించగా, భక్తులు పుష్ప, నారికేళాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.