అనంతపురం

వైభవంగా ఆంజనేయస్వామి లంకాదహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, ఏప్రిల్ 10: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ఆంజనేయస్వామి లంకాదహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రథోత్సవం అనంతరం జరిగే లంకాదహానం( బాణాసంచా వేడుక)ను కన్నుల మిరుమిట్లు గొలిపై కాంతులతో భక్తులను అలరించాయి. ఆంజనేయస్వామి లంకాదహన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆదివారం తెల్లవారుజామున స్వామి వారికి సుప్రభాత సేవలో బాగంగా మహాభిషేకం, వజ్రకవచాలంకరణ, బంగారు కిరీట ధారణ, విశేష పుష్పలంకారాలు నిర్వహించి, అలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి మహానివేదన, మంగళ హారతులు నిర్వహించారు. సాయంకాలం యధావిధిగా పూజలు అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో స్వామి వారిని దేవాలయం ఎదురుగా ప్రత్యేకంగా అలంకరించిన వాహానంలో భాజభజంత్రీల నడుమ, భక్తుల శరణుఘోషల నడుమ కొలువు దీర్చారు. అక్కడి నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శరణు కీర్తనల నడుమ స్వామి వారి ఊరేగింపు కార్యక్రమాన్ని కొనసాగించారు. దేవాలయం నుండి సమీపంలో గల గుట్టపై గల కాశీవిశే్వశ్వర, విశాలక్షి దేవాలయం వరకు కొనసాగించారు. అక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి లంకాదహనానికి సిద్ధమయ్యారు. అనంతరం సమీపంలో గల ప్రాగంణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాణాసంచాను పేల్చి లంకాదహానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండ అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఈ కార్యక్రమంలో ఆలయ ఇఓ ముత్యాలరావు, ఎఇఓ ధనుంజయ, ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యురాలు సుగుణమ్మ, ఆలయ సిబ్బంది, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.