అనంతపురం

పింఛన్లు సొమ్ము దోపిడీ చేయడం సిగ్గుచేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, మార్చి 3: వృద్ధులు, వికలాంగులు, వితంతవులకు ఇచ్చే పింఛన్లును దొంగ వేలిముద్రలు వేసి అధికారులు, ప్రజా ప్రతినిధులు పింఛన్ సొమ్మును దోపిడీ చేయడం సిగ్గుచేటని సిపిఐ నగర కార్యదర్శి లింగమయ్య పేర్కొన్నారు. గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో లింగమయ్య విలేఖర్లతో మాట్లాడుతూ నగరంలోని చనిపోయిన వృద్ధులు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారివి, వేలిముద్రలు పడలేదని మరికొందరి పింఛన్లును అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మకై వెయ్యి రూపాయలను దోచుకుంటున్నారని ఆరోపించారు. న నగరంలో సర్వే జరిపించి తక్షణమే అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జన్మభూమి కమిటీలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు శ్రీరాములు, అల్లీపీరా, ఎ.నారాయణస్వామి, ప్రసాద్, చాంద్‌బాషా పాల్గొన్నారు.
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి
అనంతపురం సిటీ, మార్చి 3: రాష్ట్రంలో ప్రజల నుండి లక్షల కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో సేకరించి, బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం వేలం వేసి బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ అండ్ ఏజెంట్ల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ యాజమాన్యం 8 రాష్ట్రాల నుండి 32లక్షల మంది నుండి 7,600 కోట్ల రూపాయలు సేకరించి, బోర్డు తిప్పేయడం చాలా దారుణమన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేసి బాధితులకు అందిస్తామని చెప్పి సంవత్సరం కావస్తున్నా ఇప్పటికి ఎలాంటి పురోగతి లేకపోవడం చాలా దారుణమన్నారు. దీనిపై మార్చి 8వ తేదీ నుండి రాజధానిలో ఉద్యమాన్ని, నిరవధిక దీక్షలు చేయట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిద్దేశ్వరరావు, నారాయణప్పలు తదితరులు పాల్గొన్నారు.
ఉగాది పురస్కారాలకు
దరఖాస్తు చేసుకోండి
అనంతపురం సిటీ, మార్చి 3: జిల్లాలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన కళాకారులు, కవులకు, ఉగాది పురస్కారాలు, కళారత్నలను ప్రభుత్వం ప్రదానం చేయనున్నదని ఏపి సాంస్కృతిక విభాగ సంచాలకులు డి.విజయభాస్కర్ గుంటూరులో గురువారం విడుదల చేశారు. జిల్లాలో హంస పురస్కారాల విభాగంలో సాహిత్యం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం, నాటకం, జానపదం, మిమిక్రీ, అవధానంలోనూ, ఉగాది పురస్కారాల విధాగంలో సాహిత్యం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం, నాటకం, జానపదం, మిమిక్రీ, అవధానం, వైద్యం, ఇంద్రజాలం, మూకాభినయం, హరికథ, బుర్రకథ, జర్నలిజం, సామాజిక సేవ, కమిటీ సిఫారసు చేసిన ఇతర సేవారంగాలకు ఇవ్వబడునని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు తమ బయోడేటాను మార్చి 13వ తేదీలోపు సంచాలకులు, భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జివిఆర్ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల భవనం, దుర్గాపురం, విజయవాడకు పంపాలన్నారు.
ఎమ్మెల్సీ వైకాపా అభ్యర్థి
వెన్నపూసను గెలిపించండి

అనంతపురం అర్బన్, మార్చి 2: పశ్చిమ రాయలసీమ పట్ట్భద్రుల నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించాలని, ఆయనను గెలిపించటం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుందని రాప్తాడు నియోజకవర్గ ఇన్‌చార్జి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. గురువారం స్థాని