అనంతపురం

వరుడి పరార్ - ఆగిన పెళ్లి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొళ్ల, మార్చి 2 : కొన్ని గంటల్లో భజాభంజత్రీల నడుమ పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు ఎలాంటి సమాచారం లేకుండా ఉడాయించాడు. ఫలితంగా వధువు కుటుంబ సభ్యులు, బంధువుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న ఘటన రొళ్ల మండలంలో చోటు చేసుకుంది. గుడిబండ మండలం కొంకల్లు గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప, నరసమ్మ రెండు కుమారుడు రవికుమార్‌కు రొళ్ల మండలం కాకి గ్రామానికి చెందిన గోవిందరాజు, లక్ష్మీదేవి కుమార్తెతో గురువారం రొళ్ల లక్ష్మీనరసింహస్వామి కమ్యూనిటీ భవనంలో వివాహం జరిపించేందుకు నిశ్చయించారు. గతనెల 9న నిశ్చితార్థం కూడా చేశారు. గురువారం వివాహం కావడంతో వధువు ఇంటికి బంధువులు, స్నేహితులు చేరుకున్నారు. బుధవారం రాత్రికే వరుడు రవికుమార్ బంధువులతోపాటు వధువు బంధువులు కమ్యూనిటీ హాలుకు చేరుకున్నారు. అయితే గురువారం ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉండటంతో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో రవికుమార్ బహిర్భుమికి వెళ్లి వస్తానని చెప్పి ద్విచక్ర వాహనంలో కనిపించకుండాపోయాడు. విషయం తెలుసుకున్న రవికుమార్ బంధువులు, వధువు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గ్రామం అంతటా కలియ తిరిగారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన వధువు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చివరకు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివాహం అర్ధాంతరంగా ఆగిపోయిందని, తమ కుమార్తెకు న్యాయం చేయాలని ఎస్నై నాగన్నను వేడుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు భేష్
* పరిశీలకులు రామ్‌గోపాల్
అనంతపురం సిటీ, మార్చి 2: జిల్లాలో పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు బాగా చేసారని ఎన్నికల పరిశీలకులు, ఐఎఎస్ అ ధికారి రామ్‌గోపాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్సు హాల్‌లో కలెక్టర్ కో న శశిధర్, ఎస్పీ రాజశేఖర్‌బాబులతో కలసి ఆయన ఎన్నికల నిర్వహణ ఏ ర్పాట్లును సమీక్షించారు. ఈ సందర్భ ంగా కలెక్టర్ పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎ న్నికల బరిలో 25 మంది, ఉపాధ్యా య ఎమ్మెల్సీ బరిలో 10 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. పట్ట్భద్రులకు 125, టీచర్స్‌కు 65 పో లింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశామన్నా రు. జిల్లాలో 88,823 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు, 7,875 మంది టీచర్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. పోలింగ్ సిబ్బంది, ర్యాండమైజేషన్ పూర్తయిందని, పోలింగ్ సిబ్బందికి మొదటి విడత శిక్షణ పూర్తయిందన్నారు. రెం డవ విడత శిక్షణను 4వ తేదీన నిర్వహించనున్నామని తెలిపారు. వెబ్‌క్యాస్టింగ్, మైక్రో పరిశీలకుల శిక్షణ కూడా పూర్తయిందన్నారు. కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను కూడా చేపడుతున్నట్లు కలెక్టర్ పరిశీలకునికి వివరించారు. ఎస్పీ రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలకు లొకేషన్ల వారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో 9 మంది డిఎస్పీలు, 21 మంది ఇన్‌స్పెక్టర్లు, 121 మంది ఎస్‌ఐలతోపాటు ఆర్మ్డ్, అనార్మ్డ్, ఇతర పోలీసు సిబ్బందిని భద్రతకు వినియోగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెసి బి.లక్ష్మికాంతం, డిఆర్‌ఓ మల్లీశ్వరీదేవి పాల్గొన్నారు.
వాటర్ వర్క్స్ ఇఇ ఉన్నట్టా, లేనట్టా!
అనంతపురంటౌన్, మార్చి 2: కార్పొరేషన్‌లో వాటర్ వర్క్స్ ఇఇ ఉన్నారా లేరాయన్న చర్చ అధికార వర్గాలలో కొనసాగుతోంది. ఇప్పటివరకు వాటర్ వర్క్స్ ఇఇగా ఉన్న సురేంద్రబాబును తప్పించి ఎపిఎండిపి ఇఇ రామ్మోహనరెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ కమిషనర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఎపిఎండిపి ఇఇగా ఉంటూ అదనంగా వాటర్ వర్క్స్ బాధ్యతలు చేపట్టరాదన్న నిబంధనల మేరకు గతంలో ఆయన వాటర్ వర్క్స్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఎపిఎండిపి ఎండి రామనారాయణరెడ్డి ఆదేశాలతో రామ్మోహనరెడ్డి ఎపిఎండిపి ప్రాజెక్ట్ పనులకే పరిమితమయ్యారు. అయితే తాజాగా ముఖ్య నేతల ఆదేశాల మేరకు కమిషనర్ వాటర్ వర్క్స్ బాధ్యతల నుంచి ఇఇ సురేంద్రబాబును తప్పించి రామ్మోహనరెడ్డికి అప్పగించారు. వాటర్ వర్క్స్ బాధ్యతలను చేపట్టటానికి ఆయన ససేమిరా అంగీకరించనట్లు తెలిసింది. దీనితో వేసవిలో తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ జరపాల్సిన వాటర్ వర్క్స్‌కు ఇఇ లేనట్లైంది. పైపులైను లీకేజీ తదితర సమస్యలు ఏర్పడితే పరిస్థితి ఏమిటో నేతలకే తెలియాలి. దీనితో కార్పొరేషన్‌లో వాటర్ వర్క్స్‌కు పర్యవేక్షణాధికారియైన ఇఇ ఉన్నట్లా, లేనట్లా అన్న అంశంపై పాలకవర్గం, ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది. దీనిపై ప్రశ్నించగా వారి నుంచి వౌనమే సమాధానం ఎదురవుతోంది.