అనంతపురం

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, మార్చి 9: ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తున్న పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పలువురు వక్తలు సూచించారు. గురువారం ఎస్కేయూలోని భౌతికశాస్త్ర విభాగంలో వాతావరణంలో శీతోష్ణ స్థితుల మార్పు, ప్రభావం, సవాళ్లు అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సుకు న్యూఢిల్లీ నుండి మినిస్టరీ ఆఫ్ ఎర్త్ సైన్సు డా.పి సంజీవరావ్, జనరల్ ఆఫ్ మెటాలజీ డైరెక్టర్ డా.కెజె.రమేష్, ఎస్‌ఈఆర్‌బి న్యూఢిల్లీ అడ్వయిజరీ డా.వైవి స్వామి, ఇతర వక్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత దేశంలో పర్యావరణం కలుషితం అవుతోందన్నారు. పర్యావరణాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్య భూతాపం, మనిషి చేసిన తప్పులకు ఎన్నో జీవజాతుతాలు భూమీద తరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంచుకొండలు తరుగుతున్నాయని, హిమాలయాల ఉనికికే ప్రమాదం ఏర్పడబోతోందన్నారు. వాటిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వారు పిలుపునిచ్చారు. అనంతరం వివిధ పరిశోధక విద్యార్థులు తమ పరిశోధనలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్కేయూ ఉప కులపతి ఆచార్య రాజగోపాల్, ప్రిన్సిపాల్ ఆర్ట్స్ కాలేజి రంగస్వామి, భౌతికశాస్త్ర విభాగాధిపతి ఆచార్య సుబ్బారావు, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.
గడ్చిరోలి జిల్లా కోర్టు తీర్పు
ఆప్రజాస్వామికం
అనంతపురం అర్బన్, మార్చి 9: ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ సాయిబాబాతోపాటు మరో నలుగురికి గడ్చిరోలి జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించటాన్ని పౌర హక్కుల సంఘం రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు ప్రొఫెసర్ శేషయ్య తీవ్రంగా ఖండించారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో శేషయ్య మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా శాంతియుతంగా ప్రజాస్వామిక పద్ధతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలపై అమలుచేస్తున్న అణిచివేతను ప్రశ్నిస్తున్నారన్నారు.
భారత ప్రభుత్వం గ్రీన్‌హంట్ పేరుతో ప్రజలపై చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. ఆయన వేసే ప్రశ్నలను, చేసే విమర్శలను సహించలేని పాలకులు సాయిబాబాతోపాటు మరో నలుగురిపై కుట్రలో భాగంగానే గడ్చిరోలి కోర్టు తీర్పు వచ్చిందని ఆయన అన్నారు. గడ్చిరోలి జిల్లా కోర్టు జడ్జి కేవలం సాయిబాబా కంప్యూటర్‌లోని సమాచారాన్ని అధారంగా చేసుకొని తీర్పు ప్రకటించటం జరిగిందన్నారు. బొమ్మయ్య మాట్లాడుతూ ప్రొ. సాయిబాబా ఎక్కడా హింసాత్మక చర్యలకు పాల్పడినట్లు ఆధారాలు లభించలేదన్నారు. ఈ తీర్పుపై పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మయ్య, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ నాయకులు రామకృష్ణ, మానవహక్కుల వేదిక నాయకులు చంద్రశేఖర్, హరినాధ్‌రెడ్డి, విజయకుమార్ పాల్గొన్నారు.

నేడు లక్ష్మీనరసింహస్వామి గరుడోత్సవం
ఆత్మకూరు, మార్చి 9: మండల పరిధిలోని వై.కొత్తపల్లి పరిధిలో పంపనూరు సమీపాన కొండపై వెలిసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారికి బ్రహ్మోత్సవ సేవల్లో భాగంగా శుక్రవారం గరుడోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ శ్రీరామరెడ్డి, ఈఓ నరసింహారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి గురువారం సుదర్శన హోమం, కళశారాధన హోమం నిర్వహించారు. 11న రాత్రి 10గంటలకు కల్యాణోత్సవం, 12న రథోత్సవం, 13న పరుష పారువేట ఉత్సవాలు నిర్వహించనున్నారు. 14న వసంత్సోవంతో బ్రహ్మోత్సవాలు పూర్తికానున్నాయి.